వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తాగి న్యూసెన్స్ చేసిన రజనీ: సోషల్ మీడియాలో వైరల్!, ఇప్పుడెందుకు తెర పైకి?

ఎయిర్ పోర్టు అధికారులను సైతం రజనీ లెక్క చేయకపోవడంతో.. హైదరాబాద్ పోలీసులే స్వయంగా రంగంలోకి దిగారని ఆ పత్రిక చెప్పుకొచ్చింది.

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళ రాజకీయ శక్తులకు ఇప్పుడు 'రజనీ' అనే ఓ గండం పట్టుకుంది. ఆయన పొలిటికల్ ఎంట్రీ గనుక ఖాయమైతే.. తమకు అన్ని దారులు మూసుకుపోయినట్లేనని అక్కడి పార్టీలు భావిస్తున్నాయి. రజనీని ఎలాగైనా అడ్డుకోవాలనే ప్రయత్నంలో భాగంగా 'లోకల్' సెంటిమెంటును తెర పైకి తీసుకొచ్చే ప్రయత్నం ఓవైపు జరుగుతుండగా.. మరోవైపు ఆయన గతాన్ని తవ్వి.. వివాదాలను వెలికితీసే పనిలో చాలామంది నిమగ్నమయ్యారు.

ఈ నేపథ్యంలోనే ఎప్పుడో 1979లో జరిగిన ఓ ఘటనను తెర పైకి తీసుకొచ్చి.. రజనీ మీద వ్యతిరేక ప్రచారానికి పూనుకుంటున్నారు. రజనీ పొలిటికల్ ఎంట్రీని అడ్డుకోవమే ధ్యేయంగా ఏకమవుతున్న వ్యతిరేక వర్గాలు.. ఇటీవలి కాలంలో ఆయనపై వివాదాలేమి లేకపోవడంతో.. గతంలో చేసిన తప్పులేమి దొరక్కపోవా? అని వెతుకులాట ప్రారంభించాయి.

ఇంతకీ ఏంటా వివాదం?:

ఇంతకీ ఏంటా వివాదం?:

1979,జూన్20వ తేదీన రజనీకాంత్ హైదరాబాద్ నుంచి చెన్నై తిరుగు పయనమయ్యారు. ఆరోజు రాత్రి 11గం. సమయంలో ఆయన హైదరాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అయితే అప్పటికే ఫూటుగా తాగి ఉన్న రజనీ.. భారతీయులను శనుకాలంటూ దూషించారన్న ఆరోపణలున్నాయి.

రజనీపై వార్తా పత్రిక కథనం:

రజనీపై వార్తా పత్రిక కథనం:

తాగిన మత్తులో రజనీ భారతీయులను దూషించాడని, తనతో పాటు వచ్చిన స్నేహితుడితోను గొడవ పెట్టుకున్నాడని మరుసటి రోజు ఓ వార్తా పత్రిక కథనాన్ని ప్రచురించింది. రజనీ చేసిన వీరంగం చూసి ఎయిర్ పోర్టు అధికారులు ఆయన్ను అడ్డుకున్నారని, అక్కడి నుంచి ఓ గదిలోకి తరలించారని తెలిపింది. అయితే ఆ గదిలోని అద్దాలను పగలగొట్టి రజనీ మరింత హంగామా సృష్టించారని ఆ కథనంలో పేర్కొంది.

రజనీ అరెస్టు:

రజనీ అరెస్టు:

ఎయిర్ పోర్టు అధికారులను సైతం రజనీ లెక్క చేయకపోవడంతో.. హైదరాబాద్ పోలీసులే స్వయంగా రంగంలోకి దిగారని ఆ పత్రిక చెప్పుకొచ్చింది. ఎయిర్ పోర్టు అధికారుల ఫిర్యాదు మేరకు, అక్కడి చేరుకున్న పోలీసులు తొలుత రజనీ టిక్కెట్లను రద్దు చేశారని తెలిపింది. ఆపై పోలీసులు ఆయన్ను అరెస్టు చేసి తీసుకెళ్లారని ఆరోజు ఘటనను సదరు పత్రిక ప్రచురించింది.

సోషల్ మీడియాలో వైరల్:

సోషల్ మీడియాలో వైరల్:

మూడు దశాబ్దాల క్రితం చోటు చేసుకున్న ఈ వివాదం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రజనీ పొలిటికల్ ఎంట్రీ పక్కా అని ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో.. ఆయన్ను అడ్డుకోవడానికి వ్యతిరేక శక్తులు సర్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. అందులో భాగంగానే ఆయన వివాదాలను బయటకు లాగి జనంలో వ్యతిరేకత పెరిగేలా చేయాలని భావిస్తున్నాయి. కానీ ఎప్పటిదో వివాదాన్ని ఇప్పుడు రచ్చకీడ్చినంత మాత్రాన రజనీకి ఉన్న ఇమేజ్ చెరిగిపోతుందా? అన్నది జనంలో మదిలో మెదులుతోన్న ఆలోచన.ఊహించిందే నిజమైంది:

<strong>'రజనీ' పొలిటికల్ ఎంట్రీపై ఆందోళనలు, కానీ కబాలి డిసైడెడ్!?</strong>'రజనీ' పొలిటికల్ ఎంట్రీపై ఆందోళనలు, కానీ కబాలి డిసైడెడ్!?

English summary
A old news about Rajinikanth arrest for drunken nuisance in 1979 was spreading viral in social media.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X