క్షణాల్లోనే ట్విట్టర్‌లో కోవింద్‌కు 3.25 మిలియన్ ఫాలోవర్లు
భారత 14వ, రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన రామ్‌నాథ్‌కోవింద్ ట్విట్టర్‌లో దూసుకుపోతున్నారు. ఆయన ట్విట్టర్‌ఖాతాకు నిమిషాల్లోనే 3.5 మిలియన్లమంది ఫాలోవర్లుగా మారారు.
న్యూఢిల్లీ: భారత 14వ, రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన రామ్‌నాథ్‌కోవింద్ ట్విట్టర్‌లో దూసుకుపోతున్నారు. ఆయన ట్విట్టర్‌ఖాతాకు నిమిషాల్లోనే 3.5 మిలియన్లమంది ఫాలోవర్లుగా మారారు.
మంగళవారం మధ్యాహ్నం పార్లమెంట్ సెంట్రల్‌హల్‌లో 14వ, భారత రాష్ట్రపతిగా రామ్‌నాథ్‌కోవింద్ ప్రమాణం చేశారు. ఆయన ప్రమాణం చేసిన కొద్దిసేపటికే రామ్‌నాథ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పేరుతో ట్విట్టర్ ఖాతాను ప్రారంభించారు.

అయితే నిమిషాల్లోనే ఆయనకు ఫాలోవర్స్ లక్షల్లో పెరిగిపోవడం గమనార్హం.ఆయన భారతదేశ భారతదేశ 14వ, రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టడాన్ని గౌరవంగా భావిస్తున్నాను. నా బాధ్యతలన్నీ కూడ వినమ్రంగా నిర్వహిస్తాను. అంటూ ఆయన తొలి ట్వీట్ చేశారు.
సోషల్‌మీడియాలో ప్రధాని మోడీతో సహ ఎంతోమంది రాజకీయ నాయకుడుగా ఉన్నారు. అయితే కోవింద్ ఖాతాకు మాత్రం గతంలో ఏ రాష్ట్రపతికి రానంత వేగంగా ఫాలోవర్స్ పెరిగిపోయారు.












Click it and Unblock the Notifications