వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రేవంత్‌రెడ్డి ఎపిసోడ్: టిడిఎల్‌పిలో ఏం జరుగుతోంది, పార్టీ ఎందుకు వీడుతున్నారు?

2014 ఎన్నికల్లో 15 ఎమ్మెల్యే, 1 ఎంపీ స్థానంలో విజయం సాధించిన టిడిపి ప్రస్తుతం ముగ్గురు ఎమ్మెల్యేలతోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. రేవంత్‌రెడ్డి ఎపిసోడ్ కారణంగా ఆ ముగ్గురు ఎమ్మెల్యేల్లో

By Narsimha
|
Google Oneindia TeluguNews

Recommended Video

రేవంత్‌రెడ్డిని పదవుల నుండి తొలగిస్తున్నారా?TDLP

హైదరాబాద్: 2014 ఎన్నికల్లో 15 ఎమ్మెల్యే, 1 ఎంపీ స్థానంలో విజయం సాధించిన టిడిపి ప్రస్తుతం ముగ్గురు ఎమ్మెల్యేలతోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. రేవంత్‌రెడ్డి ఎపిసోడ్ కారణంగా ఆ ముగ్గురు ఎమ్మెల్యేల్లో ఎంతమంది పార్టీతోనే ఉంటారోననే ఆందోళన నెలకొంది. టిడిఎల్పీలో నేతల మధ్య ఆధిపత్యపోరు కూడ తెలంగాణలో పార్టీ తీవ్రంగా నష్టపోయేందుకు కారణమైందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ముదురుతున్న వివాదం: తగ్గని రేవంత్‌రెడ్డిముదురుతున్న వివాదం: తగ్గని రేవంత్‌రెడ్డి

తెలంగాణ రాష్ట్రం వచ్చిన సమయంలో 2014లో జరిగిన ఎన్నికల్లో తెలంగాణలో టిడిపి 15 ఎమ్మెల్యేలు, దేశంలోనే అతి పెద్దదైన మల్కాజ్‌గిరి పార్లమెంట్ స్థానం దక్కించుకోవడం మామూలు విషయం కాదు.

రేవంత్‌కు షాక్: 'టిడిఎల్పీ, పార్టీ కార్యక్రమాలు నిర్వహించొద్దని ఆదేశం'రేవంత్‌కు షాక్: 'టిడిఎల్పీ, పార్టీ కార్యక్రమాలు నిర్వహించొద్దని ఆదేశం'

అయితే తెలంగాణ రాష్ట్రంలో చోటుచేసుకొన్న పరిణామాల నేపథ్యంలో టిడిపి ఎమ్మెల్యేలు అధికార టిడిపిలో చేరిపోయారు. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు హైద్రాబాద్‌ నుండి అమరావతికి మకాం మార్చడం ఆ పార్టీకి తీవ్ర ఇబ్బందులను తెచ్చిపెట్టిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయంతో ఉన్నారు.

రేవంత్‌ దెబ్బ: 'శత్రువులెవరో, మిత్రులెవరో చెప్పలేం, స్వంత పనంటూ ఢిల్లీకి'రేవంత్‌ దెబ్బ: 'శత్రువులెవరో, మిత్రులెవరో చెప్పలేం, స్వంత పనంటూ ఢిల్లీకి'

తలసాని కాకుండా ఎర్రబెల్లికి శాసనసభపక్ష పదవి

తలసాని కాకుండా ఎర్రబెల్లికి శాసనసభపక్ష పదవి

2014 ఎన్నికల తర్వాత నూతనంగా ఎన్నికైన టిడిపి ఎమ్మెల్యేలు, ఎంపితో ఆ సమయంలో టిడిపి చీఫ్ చంద్రబాబునాయుడు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మెజారిటీ ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ను పార్టీ శాసనసభపక్ష నేతగా సూచించారు. అయితే ఎర్రబెల్లి దయాకర్‌రావు కూడ పార్టీ శాసనసభపక్ష పదవిని ఇవ్వాలని చంద్రబాబునాయుడును కోరారు. అయితే అప్పటికే టిడిపి తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని రేవంత్‌రెడ్డికి ఇవ్వాలని చంద్రబాబునాయుడు ఆలోచనలో ఉన్నారు. కానీ, ఎమ్మెల్యేల సమావేశంలో శాసనసభపక్ష నేత పేరును ప్రకటించకుండా తాత్సారం చేశారు. అయితే మీడియాకు మాత్రం తలసాని శ్రీనివాస్‌యాదవ్ శాసనసభపక్ష నాయకుడిగా నిర్ణయించారని సమాచారం అందింది. అయితే ఎర్రబెల్లి కారణంగా తలసాని పేరును ప్రకటించలేదు. ఈ విషయాన్ని రెండు రోజుల తర్వాత చంద్రబాబునాయుడు తలసానితో ఫోన్‌లో చర్చించారు. డిప్యూటీ లీడర్‌గా తలసానిని ఉండాలని సూచించారు. పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగుతానని తలసాని బాబుకు తేల్చి చెప్పారు. ఎర్రబెల్లి దయాకర్‌రావును శాసనసభపక్ష నేతగా ప్రకటించారు. దీంతో పార్టీ నాయకత్వంపై అసంతృప్తిగా ఉన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆ తర్వాత టిఆర్ఎస్‌లో చేరి మంత్రి పదవిని పొందారు.

టిఆర్ఎస్‌లోకి జంప్ అయిన ఎమ్మెల్యేలు

టిఆర్ఎస్‌లోకి జంప్ అయిన ఎమ్మెల్యేలు

తెలంగాణలో రాజకీయ పునరేకీకరణ పేరుతో టిఆర్ఎస్ వేసిన ఎత్తుగడలో టిడిపి తీవ్రంగా నష్టపోయింది. వరుసగా టిడిపి ఎమ్మెల్యేలు టిఆర్ఎస్‌లో చేరిపోయారు. 12 మంది ఎమ్మెల్యేలు టిడిపిలో చేరుతారని ఎమ్మెల్యేలుగా ఎన్నికైన కొంతకాలానికే ప్రచారం ప్రారంభమైంది. ఆ ప్రచారాన్ని తగ్గట్టుగానే నేతలు పార్టీని వీడారు. విడతలు విడతలుగా ఎమ్మెల్యేలు టిడిపిని వీడి టిఆర్ఎస్‌లో చేరారు.జిహెచ్ఎంసి ఎన్నికల ఫలితాలు టిడిపిని మరింత కుంగదీశాయి. ఈ ఫలితాల వెలువడిన రెండు రోజులకే ఎర్రబెల్లి దయాకర్‌రావు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ పార్టీని వీడారు. అంతకుముందే 10 ఎమ్మెల్యేలు టిడిపిని వీడి టిఆర్ఎస్‌లో చేరారు.

శాసనసభపక్షం టిఆర్ఎస్‌లో విలీనం

శాసనసభపక్షం టిఆర్ఎస్‌లో విలీనం

టిడిపి నుండి టిఆర్ఎస్‌లో ఎమ్మెల్యేల చేరిక వ్యూహత్మకంగానే సాగిందనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు.టిఆర్ఎస్‌లో చేరేందుకు ప్లాన్ చేసుకొన్న ఎమ్మెల్యేలంతా విడతలు విడతలుగా పార్టీ మారారని కొందరు టిడిపి నేతలు అభిప్రాయపడుతున్నారు. ఎర్రబెల్లి దయాకర్‌రావు టిఆర్ఎస్‌లో చేరిన తర్వాత టిడిపి శాసనసభపక్షసమావేశాన్ని టిఆర్ఎస్‌లో విలీనం చేశారని స్పీకర్‌కు లేఖ రాశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌కు ఫిర్యాదు చేయడంతో పాటు.. కోర్టును కూడ టిడిపి ఆశ్రయించింది. అ వ్యవహరంలో ఎర్రబెల్లి కీలకంగా వ్యవహరించారు. ఎర్రబెల్లి పార్టీ మారడంతో రేవంత్‌రెడ్డికి టిడిపి శాసనసభపక్షనేతగా బాధ్యతలు చేపట్టారు.

అసెంబ్లీలో రేవంత్‌పైనే ఫోకస్

అసెంబ్లీలో రేవంత్‌పైనే ఫోకస్

రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై టిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి తన ప్రసంగాలతో ఇరుకునపెట్టేవారు. దీంతో రేవంత్‌ను అసెంబ్లీలోకి అడుగుపెట్టేలా అధికార టిడిపి వ్యూహరచన చేసింది. రేవంత్‌తో పాటు టిడిపి ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు. ఒక సెషన్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కూడ సస్పెండ్ చేశారు. అయితే జానారెడ్డి వినతి మేరకు విపక్ష ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ ఎత్తేశారు. అయితే ఓటుకు నోటు కేసు తర్వాత అసెంబ్లీలో రేవంత్ కొంత తన వేడిని తగ్గించినట్టు కన్పించింది. అయినా ప్రభుత్వంపై మాత్రం పోరును ఆపలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

English summary
Tdp lost 12 mlas in three years period in Telangana Assembly. 12 MLA's and 1 MP joined in TRS. 3 MLA are continuing in Tdp. Revanth Reddy episode reflects on other 2 mla's.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X