వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జూ.ఎన్టీఆర్ ఈ పార్టీ ఏపీ అధ్యక్షుడు అంటూ ప్రచారం

నందమూరి తారాక రామారావును నవ భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకున్నట్లు ఓ లెటర్ హెడ్ వాట్సాప్‌లో హల్‌చల్ చేస్తోంది. దీంతో జూనియర్ ఎన్టీఆర్ కొత్త పార్టీ పెట్టారా అనే చర్చ సాగుతోంది.

|
Google Oneindia TeluguNews

విజయవాడ: నందమూరి తారాక రామారావును నవ భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకున్నట్లు ఓ లెటర్ హెడ్ వాట్సాప్‌లో హల్‌చల్ చేస్తోంది. దీంతో జూనియర్ ఎన్టీఆర్ కొత్త పార్టీ పెట్టారా అనే చర్చ సాగుతోంది. అయితే, అది ఫేక్ అని అందరికి తెలిసిపోయింది.

ఆ లెడర్ హెడ్‌లో జూనియర్ ఎన్టీఆర్ కొత్త పార్టీ పేరు నవభారత్ నేషనల్ పార్టీ అని, ఆయన ఏపీ రాష్ట్ర శాఖకు అధ్యక్షుడిగా నియమించబడ్డారని.. సోషల్ మీడియాలోను ప్రచారం సాగుతోంది.

They have appointed Jr. NTR as party president

ఎన్టీఆర్‌ను అధ్యక్షుడిగా నియమించినట్లు పేర్కొంటు ఆయనకు రాసినట్లు లెటర్ హెడ్ ఉంది. అందులో.. టు నందమూరి తారక రామారావు, తండ్రి పేరు హరికృష్ణ, వయస్సు 33, వృత్తిపరంగా నటుడు అని పేర్కొంటూ జూబ్లీహిల్స్ అడ్రస్ ఇచ్చారు.

అయితే, దీనిని ఎవరో కావాలనే క్రియేట్ చేసినట్లుగా ఉంది. జూ.ఎన్టీఆర్ పార్టీ పెడితే హంగామా ఉంటుందని, సాదాసీదాగా ఎలా ఉంటుందని చెబుతున్నారు. మరో ముఖ్య విషయం ఏమంటే.. వేరే పార్టీకి ఏపీ శాఖ అధ్యక్షుడిగా ఉండటం ఏమిటని అంటున్నారు. ఇక, లెటర్ హెడ్‌లోని పార్టీ గుర్తు.. వైసిపి టైపులో, మధ్యలో జనసేన గుర్తు ఉంది.

ఇక, నవభారత్ నేషనల్ పార్టీ విషయానికి వస్తే.. ఈ పార్టీ ఉంది. గత ఎన్నికల్లో పోటీ చేసింది. 2012 ఆగస్ట్ 15న ఆవిర్భవించింది. దీనికి వ్యవస్థాపకులు కళ్యాణ రామకృష్ణ. అయితే, ఆ లెటర్ హెడ్, నియామక పత్రం మాత్రం వీరు ఇవ్వలేదని తెలుస్తోంది. వాళ్ల లెటర్ హెడ్‌ను జూ.ఎన్టీఆర్ పేర దుర్వినియోగం చేసింది ఎవరనే చర్చ సాగుతోంది.

English summary
A section of people are doing campaigns to malign Jr NTR's image. In a latest development, a letter has been circulating in the social media that a new party has appointed NTR as its president.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X