అందంగా ఉన్నావు, నా కోరిక తీర్చు, అడిగిందిస్తా, మహిళపై వేధింపులు

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: చాలా అందంగా ఉన్నావు. నా కోరిక తీర్చకుంటే బదిలీ చేస్తానంటూ ఏపీ ట్రాన్స్ కో లిప్ట్ ఇరిగేషన్ సూపరింటెండ్ వీబీడి శ్రీనివాస్ రావు వేధింపులు తాళలేక ఓ మహిళ ఉద్యోగిని నిద్రమాత్రలు మింగి ఆత్మహాత్యయత్నానికి ప్రయత్నించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

బోడుప్పల్ కు చెందిన ఓ మహిళ విద్యుత్ సౌధలో పనిచేస్తోంది. టైపిస్టుగా ఆరేళ్లపాటుగా పనిచేస్తోంది. అయితే కొద్ది కాలం క్రితమే ఆమెకు పదోన్నతతిపై లిఫ్ట్ ఇరిగేస్ డిపార్ట్ మెంట్ కు బదిలీపై వెళ్ళింది.

అయితే అప్పటి నుండి ఆమెకు కష్టాలు ప్రారంభమయ్యాయి.లిఫ్ట్ ఇరిగేషన్ డిపార్ట్ మెంట్ విభాగం సూపరింటెండ్ వీడీబీ శ్రీనివాస్ ఆ మహిళా ఉద్యోగిని లైంగికంగా వేధిస్తున్నాడు.

Transco staffer tries to end life

తన కోరిక తీర్చాలంటూ ఆమెను మాటలతో ఇబ్బందిపెడుతున్నాడు. నువ్వు చాలా అందంగా ఉన్నావు. నా కోరిక తీర్చు , నువ్వు అడిగినంత ఇస్తానంటూ ఆమెను ప్రలోభపెట్టే ప్రయత్నం చేశాడు. ఈ వేధింపులను ఆమె తట్టుకోలేకపోయింది.

శ్రీనివాస్ ను తీవ్రంగా ప్రతిఘటిస్తూ వచ్చింది. అయితే ఇక ఆమె లొంగదని తెలుసుకొన్న శ్రీనివాస్ ఆమెను బెదిరించడం ప్రారంభించాడు. తాను చెప్పినట్టు వినకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని ఆయన బెదిరించాడు.అంతేకాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బదిలీ చేస్తానని హెచ్చరించాడు.

శుక్రవారం నాడు కూడ ఇదే తరహాలో ఆమెను బెదిరించాడు.అయితే ఆమె గట్టిగానే ఆయనకు బదులిచ్చింది.కానీ, వేధింపులు తాళలేక ఆఫీసు నుండి బయటకు రాగానే నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది.

బాధితురాలని చికిత్సనిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి యాజమాన్యం ఇచ్చిన సమాచారంతో పాటు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A TS Transco staffer attempted suicide by consuming sleeping pills following alleged harassment at work by lift irrigation department superintendent V.D.B. Srinivas.
Please Wait while comments are loading...