వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నోట్ల రద్దు ఎఫెక్ట్‌తో.. వరంగల్‌కు మారిన తెరాస సభ

తెలంగాణ రాష్ట్ర సమితి 16వ వార్షికోత్సవం సందర్భంగా గురువారం వరంగల్‌లో భారీ బహిరంగ సభ జరుగుతోంది. ఇందుకు అంతా సిద్ధమయింది.

|
Google Oneindia TeluguNews

వరంగల్: తెలంగాణ రాష్ట్ర సమితి 16వ వార్షికోత్సవం సందర్భంగా గురువారం వరంగల్‌లో భారీ బహిరంగ సభ జరుగుతోంది. ఇందుకు అంతా సిద్ధమయింది.

నిజానికి గత ఏడాది డిసెంబరు 2న హైదరాబాద్‌లో జరగాల్సిన సభ ఇది. తెరాస సర్కారుకు రెండున్నరేళ్లు పూర్తయిన సందర్భంగా హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని అప్పటికి నెలరోజుల ముందే కార్యాచరణ రూపొందించారు.

Warangal painted pink ahead of TRS meeting

అయితే అనూహ్యంగా నవంబరులో కేంద్రం పెద్ద నోట్లను రద్దు చేయడంతో టీఆర్ఎస్ ప్రభుత్వం బహిరంగ సభ ఆలోచనను విరమించుకుందని చెబుతున్నారు.

హైదరాబాద్‌లో నిర్వహించాలనుకున్న సభ ఆగిపోవడంతో తెరాస 16 వార్షికోత్సవ సభకు వరంగల్‌ను వేదికగా ఎంచుకుంది. ఈ సభకు 10 నుంచి 15 లక్షల మందిని తరలించాలని నిర్ణయించారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు 2015లో హైదరాబాద్‌లో, 2016లో ఖమ్మంలో పార్టీ వార్షికోత్సవాలు నిర్వహించారు. ఇప్పుడు వరంగల్‌లో నిర్వహిస్తున్నారు.

English summary
Ongoing beautification of Hanamkonda, Warangal and Kazipet has come in handy for the meeting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X