లగడపాటి సంచలన సర్వే అంటూ వైరల్: నిజమేనా?

Subscribe to Oneindia Telugu

అమరావతి: ఆంధ్ర ఆక్టోపస్‌గా పేరు గాంచిన లగడపాటి రాజగోపాల్ సర్వేలకు విశ్వసనీయత చేకూరుతోంది. ఆయన అంచనాలు తర్వాత వెలువడే ఫలితాలకు చాలా దగ్గరగా ఉండడం అందుకు కారణం. ఇటీవల నంద్యాల ఉప ఎన్నిక ఫలితాన్ని కూడా ఆయన సరిగ్గా అంచనా వేశారు.

ఈ నేపథ్యంలో ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికల జరిగితే ఏ పార్టీ విజయం సాధిస్తుందనే విషయంపై ఆయన సమగ్ర సర్వే నిర్వహించారనే ప్రచారం ఎపిలో ముమ్మరంగా సాగుతోంది. జిల్లాలావారీగా ఆయన ఫలితాలను అంచనా వేసినట్లు చెబుతున్నారు.

అయితే, ఇది ఏ మేరకు వాస్తవమనేది తెలియదు. వాట్సప్‌లో లగడపాటి సంచలన సర్వే అంటూ వైరల్ అవుతోంది. ఇది జగన్‌పై మైండ్ గేమ్ కూడా కావచ్చుననే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అయితే, చాలా జాగ్రత్తగా ఏ పార్టీ ఏయే జిల్లాల్లో సీట్లు గెలుస్తుందనే అంచనాతో నమ్మదగిన రీతిలో అది ఉంది.

  Lagadapati Rajgopal meeting with Chandrababu 'టిడిపిలో చేరిక'పై లగడపాటి ట్విస్ట్ | Oneindia Telugu

  దానిపై ప్రస్తావించినప్పుడు అదంతా ఉత్తదే, లగడపాటితో చంద్రబాబు సర్వే చేయించారనేది నిజం కాదని తెలుగుదేశం పార్టీ నాయకులే అంటున్నారు.

  చంద్రబాబుతో భేటీ మతలబు ఇదే...

  చంద్రబాబుతో భేటీ మతలబు ఇదే...

  ఇటీవల లగడపాటి రాజగోపాల్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడిని కలిసిన విషయంం తెలిసిందే. చంద్రబాబు పిలిస్తే తాను వచ్చానని లగడపాటి చెప్పారు. అయితే, ఎందుకు పిలిచారనే విషయాన్ని ఆయన చెప్పలేదు. దాంతో లగడపాటి రాజగోపాల్‌ను చంద్రబాబు టిడిపిలోకి ఆహ్వానిస్తున్నట్లుగా ప్రచారం జరగింది. కానీ, తాను తాజాగా నిర్వహంచిన సర్వే ఫలితాలను అందజేయడానికి చంద్రబాబును కలిసినట్లు తెలుస్తోంది.

  మళ్లీ చంద్రబాబుదే విజయం

  మళ్లీ చంద్రబాబుదే విజయం

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ విజయం సాధించే అవకాశం ఉన్నట్లు లగడపాటి సర్వే తెలియజేస్తోంది. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో టిడిపి అత్యధిక స్థానాలు గెలుచుకుంటుంది. రాష్ట్రంలోని మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో టిడిపి 71 స్థానాలు గెలుచుకుంటుందని లగడపాటి అంచనా వేసినట్లు తెలుస్తోంది.

  చంద్రబాబుకు పవన్ కల్యాణ్ సవాల్

  చంద్రబాబుకు పవన్ కల్యాణ్ సవాల్

  లగడపాటి సర్వే ప్రకారం పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీకి గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. జనసేన 65 స్థానాలు గెలుచుకుంటుందని లగడపాటి అంచనా వేశారు. తెలుగుదేశం పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకున్న ఉభయగోదావరి జిల్లాల్లో జనసేన పాగా వేయబోతోంది. జనసేన రంగంలోకి పూర్తి స్థాయిలో దిగితే తెలుగుదేశం పార్టీకి గట్టి సవాల్ విసిరే అవకాశం కనిపిస్తోంది.

  మూడో స్థానంతో జగన్ సరి....

  మూడో స్థానంతో జగన్ సరి....

  అధికారం కోసం అహర్నిశలు శ్రమిస్తున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి ఉంటుందని లగడపాటి సర్వేను బట్టి తెలుస్తోంది. అధికారానికి ఆయన దరిదాపుల్లో కూడా ఉండరని అర్థమవుతోంది. ఆయన 39 సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఉందని లగడపాటి సర్వే తెలియజేస్తోంది.

  జిల్లాలవారీగా అంచనాలు...

  జిల్లాలవారీగా అంచనాలు...

  1 . శ్రీకాకుళం మొత్తం సీట్లు - 10

  టీడీపీ గెల్చుకొనేవి - 5
  వైస్సార్సీపీ గెలిసేవి - 0
  జనసేన గెల్చుకొనేవి - 5

  2 . విజయనగరం మొత్తం సీట్లు - 9

  టీడీపీ గెల్చుకొనేవి - 5
  వైస్సార్సీపీ గెలిసేవి - 0
  జనసేన గెల్చుకొనేవి - 4

  3 .విశాఖపట్నం మొత్తం సీట్లు - 15

  టీడీపీ గెల్చుకొనేవి - 6
  వైస్సార్సీపీ గెలిసేవి - 0
  జనసేన గెల్చుకొనేవి - 9

  4 .తూర్పుగోదావరి మొత్తం సీట్లు - 19

  టీడీపీ గెల్చుకొనేవి - 3
  వైస్సార్సీపీ గెలిసేవి - 1
  జనసేన గెల్చుకొనేవి - 15

  5 .పశ్చిమగోదావరి మొత్తం సీట్లు - 15

  టీడీపీ గెల్చుకొనేవి - 3
  వైస్సార్సీపీ గెలిసేవి - 0
  జనసేన గెల్చుకొనేవి - 12

  6 .కృష్ణ మొత్తం సీట్లు - 16

  టీడీపీ గెల్చుకొనేవి - 10
  వైస్సార్సీపీ గెలిసేవి - 0
  జనసేన గెల్చుకొనేవి - 6

  7 .గుంటూరు మొత్తం సీట్లు - 17

  టీడీపీ గెల్చుకొనేవి - 10
  వైస్సార్సీపీ గెలిసేవి - 2
  జనసేన గెల్చుకొనేవి - 5

  8 .ప్రకాశం మొత్తం సీట్లు - 12

  టీడీపీ గెల్చుకొనేవి - 5
  వైస్సార్సీపీ గెలిసేవి - 4
  జనసేన గెల్చుకొనేవి - 3

  9 .నెల్లూరు మొత్తం సీట్లు - 10

  టీడీపీ గెల్చుకొనేవి - 3
  వైస్సార్సీపీ గెలిసేవి - 4
  జనసేన గెల్చుకొనేవి - 3

  10 .కడప మొత్తం సీట్లు - 10

  టీడీపీ గెల్చుకొనేవి - 0
  వైస్సార్సీపీ గెలిసేవి - 10
  జనసేన గెల్చుకొనేవి - 0

  11 .కర్నూల్ మొత్తం సీట్లు - 14

  టీడీపీ గెల్చుకొనేవి - 4
  వైస్సార్సీపీ గెలిసేవి - 10
  జనసేన గెల్చుకొనేవి - 0

  12 .అనంతపురం మొత్తం సీట్లు - 14

  టీడీపీ గెల్చుకొనేవి - 10
  వైస్సార్సీపీ గెలిసేవి - 4
  జనసేన గెల్చుకొనేవి - 0

  13 .చిత్తూర్ మొత్తం సీట్లు
  - 14

  టీడీపీ గెల్చుకొనేవి - 7
  వైస్సార్సీపీ గెలిసేవి - 4
  జనసేన గెల్చుకొనేవి - 3

  ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్ మొత్తం సీట్లు - 175
  టీడీపీ గెల్చుకొనేవి - 71
  వైస్సార్సీపీ గెలిసేవి - 39
  జనసేన గెల్చుకొనేవి - 65

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  A whatsup message is circulating among the public in Andhra Pradesh saying Lagadapati Rajagopal'survey.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి

  X