అంబానీతో బాబు బేటీ మతలబు: జగన్‌పై ఎదురుదాడి, పవన్‌పై మెతగ్గా...

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: కేంద్రం చేసిన అన్యాయంపై పోరాటానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రమైన నిర్ణయమేదీ తీసుకోరనే మాట వినిపిస్తోంది. కేంద్ర మంత్రుల చేత, ఎంపీల చేత రాజీనామా చేయిస్తారనేది కేవలం లీకులు మాత్రమేనని అంటున్నారు.

  Mukesh Ambani Plans To Build Electronic Park In Tirupati

  ఆ సందేహాలను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన సాక్షి మీడియా కూడా వ్యక్తం చేస్తోంది. అంతేకాకుండా ముకేష్ అంబానీ, చంద్రబాబు భేటీపై కూడా అనుమానాలు కలిగే విధంగా ఓ వార్తాకథనాన్ని ప్రచురించింది.

  ఆ మర్నాడే చంద్రబాబు

  ఆ మర్నాడే చంద్రబాబు

  ప్రత్యేక హోదాపై నోరు మెదపని చంద్రబాబు మంగళవారంనాడు రిలయన్స్ అధినే ముకేష్ అంబానీతో ప్రత్యేకంగ సమావేశం కావడం ప్రాధాన్యాన్ని సంతరించుకుందని సాక్షి మీడియా రాసింది. సెలవు రోజు కావడంతో సచివాలయంలో వారిద్దరు ఎక్కువ సేపు ఏకాంత చర్చలు జరిపారు. ఆ మర్నాడే టిడిపి సమన్వయ కమిటీ భేటీ జిరింది.

  భేటీలో ఏం జరిగింది....

  భేటీలో ఏం జరిగింది....

  సమన్వయ కమిటీ భేటీ తర్వాత మంత్రులు మీడియాతో మాట్లాడారు. కానీ ప్రత్యేక హోదాపై గానీ రాష్ట్ర సమస్యలపై గానీ మాట్లాడలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు అసలే మాట్లాడలేదు. మరి దేని గురించి ఈ సమావేశం జరిగిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముకేష్ అంబానీతో జరిగిన చర్చల తర్వాత ఇది జరగడంతో అనుమానాలు తలెత్తుతున్నాయని సాక్షి మీడియా వ్యాఖ్యానిస్తోంది.

  పవన్ కల్యాణ్‌పై తొందరొద్దు...

  పవన్ కల్యాణ్‌పై తొందరొద్దు...

  జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏర్పాటు చేయ తలపెట్టిన సంయుక్త నిజనిర్దారణ కమిటీ (జెఎఫ్‌సి)పై తొందరపడి మాట్లాడవద్దని చంద్రబాబు తన పార్టీ నేతలకు సూచించినట్లు తెలుస్తోంది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడం మీదనే దృష్టి పెట్టాలని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది.

  చంద్రబాబు లీకులు మాత్రమేనా...

  చంద్రబాబు లీకులు మాత్రమేనా...

  తమ పార్టీ ఎంపీలు ఏప్రిల్ 6వ తేదీన రాజీనామాలు చేస్తారని జగన్ ప్రకటించిన తర్వాత అత్యవసరంగా సమావేశమైన సమన్వయ కమిటీ ఏ విధమైన నిర్ణయం తీసుకుందనేది తెలియదు. కానీ, మీడియాకు మాత్రం లీకులు వెళ్లాయని అంటున్నారు. రాజీనామాలకు కూడా టిడిపి సిద్ధపడిందంటూ వచ్చిన వార్తలు లీకులు మాత్రమేనని సాక్షి మీడియా అభిప్రాయపడుతోంది. పదవులు ముఖ్యం కాదు, పదవులు లెక్క కాదు, రాష్ట్ర ప్రయోజనాలే మాకు మిన్న... అందుకోసం అవసరమైతే మంత్రుల చేత రాజీనామాలు చేయిస్తామని చంద్రబాబు అన్నట్లు మీడియాకు లీకులు ఇప్పించారని ఆరోపిస్తోంది.

  ఎదురుదాడి వ్యూహం

  ఎదురుదాడి వ్యూహం

  వైఎస్ జగన్‌పై ఎదురు దాడి చేయడం ద్వారా గట్టెక్కాలనే వ్యూహంతో చంద్రబాబు ఉన్నట్లు అర్థమవుతోంది. జగన్‌పై ఎదురు దాడి చేయాలని ఆయన మంత్రులకు, ముఖ్య నేతలకు సూచించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే జగన్‌పై టిడిపి నేతలు ఎదురు దాడికి దిగుతున్నారని అంటున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసమే జగన్ రాజీనామాల డ్రామాలు ఆడుతున్నారని, రాజీనామాల వల్ల ప్రయోజనం లేదని మాట్లాడడం వెనక వ్యూహం అదేనని అంటున్నారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  The YSR Congress party president YS Jagan's media expressed doubts over the meeting between Chandrababu and Mukesh Ambani.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి