వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహేష్ కత్తితో పవన్ ఫ్యాన్స్ సెల్ఫీ: వివాదం ముగియడం వెనుక

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: గత కొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్ అభిమానులు, మహేష్ కత్తికి మధ్య జరుగుతున్న వివాదానికి ఫుల్‌స్టాప్ పడినట్లుగా కనిపిస్తోంది. మహేష్ కత్తి కార్యాలయానికి ఆర్టిస్ట్ కమ్ పవన్ అభిమాని కోటి వెళ్లారు. మహేష్ కత్తిని సత్కరించారు. కేసు పరిష్కరించుకోవడం ఆనందం కలిగించిందన్నారు. మహేష్ కత్తికి అతను శాలువా కప్పి సత్కరించారు. సెల్ఫీ దిగారు.

జనసేన ప్రెస్ నోట్ వెనుక!: పవన్ తొలి సినిమా నుంచి సీక్రెట్స్ చెప్పనా: మహేష్ కత్తి ఇంకాజనసేన ప్రెస్ నోట్ వెనుక!: పవన్ తొలి సినిమా నుంచి సీక్రెట్స్ చెప్పనా: మహేష్ కత్తి ఇంకా

కత్తి మహేష్ జిందాబాద్ అంటూ నినాదం కూడా చేశారు. కత్తితో పాటు పవన్ అభిమానులు కూడా దిగిరావడంతో సమస్య పరిష్కారమైంది. ఇటీవల మహేష్ కత్తి నటి పూనమ్ కౌర్‌తో పాటు పవన్ వ్యక్తిగత జీవితాన్ని లాగడం సర్వత్రా విమర్శలకు తావిచ్చింది. ఆ తర్వాత ఇద్దరు వ్యక్తులు కోడిగుడ్లతో దాడి చేయడం వివాదం అయింది.

వివాదం ముగిసినట్లే

వివాదం ముగిసినట్లే

ఈ నేపథ్యంలో ఇప్పుడు వివాదం ముగిసినట్లుగా కనిపిస్తోంది. మహేష్ కత్తి తనపై దాడి చేసిన వారిపై ఫిర్యాదు వెనక్కి తీసుకోవడం కూడా అనుమానాలకు తావిచ్చింది. దానిపై ఆయన వివరణ ఇచ్చారు. అయితే, మ‌హేష్ కత్తి తాను ఇచ్చిన కంప్లైంట్ రిటర్న్ తీసుకోవ‌డ‌మే కాదు ప‌వ‌న్ అభిమానుల‌తో క‌లిసి స్వీట్స్ తిని సెల్ఫీలు కూడా దిగార‌ట‌.

 ఓర్పే లక్ష్యంగా ముందుకుసాగుదామని

ఓర్పే లక్ష్యంగా ముందుకుసాగుదామని

ఈ నేప‌థ్యంలో క‌త్తి మ‌హేష్‌, ప‌వ‌న్ ఫ్యాన్స్ మ‌ధ్య వైరం ముగిసిన‌ట్టేన‌ని అంటున్నారు. అయితే అంత‌క ముందు ఫ్యాన్స్‌ని ఉద్దేశించి ప‌వ‌న్ నుండి, అత‌ని పార్టీ నుండి రెండు ప్రెస్ నోట్లు రిలీజ్ అయ్యాయి. ఎవ‌రు విమ‌ర్శ‌లు చేసిన, వాటిని అస్స‌లు ప‌ట్టించుకోవ‌ద్ద‌ని ఓర్పే ల‌క్ష్యంగా ముందుకు పోదామ‌ని ఆ నోట్‌లో తెలిపారు.

 వెనక్కి తగ్గడానికి కారణం

వెనక్కి తగ్గడానికి కారణం

అస‌లు క‌త్తి మ‌హేష్ కాస్త వెన‌క్కి త‌గ్గ‌డానికి కార‌ణం .. పవన్ అభిమానులు కొందరు రంగంలోకి దిగి, కత్తితో చర్చలు జరిపడం, అదే సమయంలో పవన్ కళ్యాణ్ నుంచి లేఖ విడుదల కావటం అని తెలుస్తుంది.

 రూటుమార్చిన మహేష్ కత్తి

రూటుమార్చిన మహేష్ కత్తి

ఇదిలా ఉంటే క‌త్తి మహేష్.. పవన్ సినిమా, రాజకీయాలకు సంబంధించిన విమర్శలు చేస్తానని, వ్యక్తిగత విమర్శలు మాత్రం తాను చేయనని ప్రకటించారు. ఇది వెన‌క్కి త‌గ్గ‌డం కాదని, మ‌నిషిగా ఎద‌గడమని అంటున్నారు.

English summary
Hours after registering a police complaint against the miscreants who attacked him with an egg, outspoken film critic Mahesh Kathi has withdrawan the complaint and make peace with his attackers (allegedly fans of actor-politician Pawan Kalyan).
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X