పవన్ దాడి, బిజెపి సీక్రెట్ ప్లాన్: ఎన్డీఎకూ చంద్రబాబు గుడ్‌బై?
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బిజెపి అనుసరించబోయే వ్యూహాన్ని ఆర్థం చేసుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు భవిష్యత్తు కార్యాచరణకు నడుం బిగించినట్లు కనిపిసస్తున్నారు.
Recommended Video

జనసేన అధినేత పవన్ కల్యాణ్ బుధవారం సాయంత్రం గుంటూరులో జరిగిన ఆవిర్బావ దినోత్సవంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్ర మనస్తాపానికి గురైనట్లు కనిపిస్తున్నారు. పవన్ కల్యాణ్ వెనక కూడా బిజెపి ఉందనే అనుమానాలను తెలుగుదేశం పార్టీ నాయకులు వ్యక్తం చేస్తున్నారు.

చంద్రబాబు ఉక్కిరిబిక్కిరి అయ్యారు...
పవన్ కల్యాణ్ చేసిన తీవ్రమైన వ్యాఖ్యలతో చంద్రబాబు ఉక్కిరిబిక్కిరి అయినట్లు కనిపిస్తున్నారు. అనూహ్యమైన రీతిలో పవన్ కల్యాణ్ ఆయనను టార్గెట్ చేశారు. దానికితోడు, చంద్రబాబు వారసుడిగా ముందుకు వస్తున్న నారా లోకేష్‌పై ఆయన అవినీతి ఆరోపణలు చేయడం తెలుగుదేశం పార్టీ నాయకులకు మింగుడుపడడం లేదు. పవన్ కల్యాణ్‌పై ఎదురుదాడికి దిగుతున్నారు. అయితే, పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు ప్రజల్లోకి నేరుగా వెళ్లడం చంద్రబాబుకు ఇబ్బందిగానే ఉందని చెప్పాలి.

జగన్, పవన్ కల్యాణ్ మధ్య దోస్తీ
పవన్ కల్యాణ్, జగన్ మధ్య అవగాహన ఉందనే విష,యం తాజాగా బయటపడింది. వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యుడు వరప్రసాద్ ఆ విషయాన్ని బయటపెట్టారు. ఎన్నికల తర్వాత పవన్ కల్యాణ్ తమతోనే కలుస్తారని కూడా ఆయన చెప్పారు. ఇది చంద్రబాబుకు కొత్త విషయమేనని చెప్పాలి. ఇంత కాలం చంద్రబాబుకు పవన్ కల్యాణ్ మద్దతు ఇస్తున్నారనే ప్రచారానికి తెరదించడం ద్వారా పవన్ కల్యాణ్ మార్గం చాలా వరకు సుగమం అయింది.

బాబు బహిరంగ ఆవేదన
తాము ఎన్డీఎలో ఉన్నప్పటికీ ఢిల్లీ పరిణామాలు ముందుకు వైఎస్సార్ కాంగ్రెసు పార్టీకి తెలుస్తున్నాయంటూ చంద్రబాబు శాసనసభ సాక్షిగా వ్యాఖ్యానించారు. విజయసాయిరెడ్డికి పిఎంవో దగ్గరగా ఉంటుండడం, జగన్‌కు మోడీ అపాయింట్‌మెంట్ ఇవ్వడం, కోవింద్‌ను రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసినట్లు తనకన్నా ముందు వైఎస్ జగన్‌కు తెలియడం వంటి విషయాలపై ఆయన తన ఆవేదనను బహిరంగంగానే వెల్లడించారు. ఎన్టీఎలో కొనసాగుతున్నప్పటికీ తనను నిర్లక్ష్యం చేస్తున్నారనే బాధ ఆయన మాటల్లో వ్యక్తమైంది.

బిజెపి ప్లాన్ ఇదని చంద్రబాబు
రాష్ట్రంలో తనకు వ్యతిరేకమైన పార్టీలను, శక్తులను బిజెపి బలోపేతం చేస్తోందనే అభిప్రాయంతో చంద్రబాబు ఉన్నారు. అందులో భాగంగానే జగన్‌ను బిజెపి ప్రోత్సహిస్తోందని అనుకుంటున్నట్లు వ్యాఖ్యానిస్తున్నారు. పవన్ కల్యాణ్ కూడా వైసిపితో జతకడుతారనే కొత్త విషయం వెలుగులోకి రావడంతో తనకు వ్యతిరేకంగా రాష్ట్రంలోని శక్తులన్నీ ఏకమవుతున్నాయని చంద్రబాబు భావిస్తున్నారు. దీని వెనక బిజెపి ఉందని ఆయన అనుకుంటున్నారు. అందువల్ల ఎన్డీఎలో కొనసాగడం వృధా అని ఆయన ఓ నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు.

రేపు టిడిపి పోలిట్‌బ్యూరో సమావేశం
రేపు శుక్రవారం సాయంత్రం తెలుగుదేశం పార్టీ పోలిట్‌బ్యూరో సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఎన్డీఎలో కొనసాగాలా, వద్దా అనే విషయంపై చర్చ జరుగుతుందని అంటున్నారు. ఇప్పటికే టిడిపి కేంద్ర మంత్రులు రాజీనామా చేశారు. ఇక ఎన్డీఎలో కొనసాగితే తప్పుడు సంకేతాలు ప్రజల్లోకి వెళ్తాయని చంద్రబాబు అనుకుంటున్నట్లు తెలుస్తోంది. కేసులకు భయపడి చంద్రబాబు కేంద్రంపై ఒత్తిడి తేవడం లేదని, బిజెపిపై పోరాటానికి సిద్ధపడడం లేదనే జగన్ ప్రచారానికి విశ్వసనీయత చేకూరుతుందని అంటున్నారు. కేంద్ర ప్రభుత్వానికి చంద్రబాబు భయపడుతున్నారని పవన్ కల్యాణ్ కూడా వ్యాఖ్యానించారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఎన్డీఎ నుంచి తప్పుకోవాలని చంద్రబాబు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
-
క్లీన్ స్వీప్ - చరిత్రలో లేని విధంగా మారిన కేరళ ఓటర్ సరళి! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు..












Click it and Unblock the Notifications