పవన్ కల్యాణ్‌కు బాబు రెడ్ కార్పెట్: కెసీఆర్ కోసం గంట వెయిట్

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్‌: జనసేన అధినేత పవన్ కల్యాణ్ అవసరం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి అవసరం ఉంది. మరి, పవన్ కల్యాణ్‌కు తెలంగాణ ముఖ్యమంత్రి అవసరం ఉందా అనే ప్రశ్న ఉదయిస్తోంది.

  Pawan & KCR's meeting : కేసీఆర్ - పవన్ భేటీ : 'తాట తీస్తా', 'ఆడి పేరేందిరా బై' !

  తనను కలవడానికి వచ్చిన ప్రతిసారీ చంద్రబాబు పవన్ కల్యాణ్‌‌కు రెడ్ కార్పెట్ స్వాగతం చెప్పారు. ఓ వివిఐపికి ఇచ్చిన గౌరవం ఆయనకు ఇచ్చారు. కేసీఆర్‌ను కలవడానికి పవన్ కల్యాణ్ దాదాపు గంట పాటు వేచి చూడాల్సి వచ్చింది. అంటే పవన్ కల్యాణ్‌కు కేసీఆర్ అవసరం ఉందని భావింంచాల్సి వస్తుందని అనుకోవచ్చునని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

   కేసీఆర్ గవర్నర్‌తో భేటీ వెళ్లడంతో..

  కేసీఆర్ గవర్నర్‌తో భేటీ వెళ్లడంతో..

  కేసీఆర్ గవర్నరన్ నరసింహన్‌తో భేటీకి రాజభవన్ వెళ్లిన సమయంలో పవన్ కల్యాణ్ ప్రగతి భవన్‌కు వచ్చారు. ముందస్తు అపాయింంట్‌మెంంట్ తీసుకునే పవన్ కల్యాణ్ వచ్చి ఉంటారనేది కాదనలేంం. అయితే, కేసీఆర్ గవర్నర్‌తో బేటీకి వెళ్లారు కాబట్టి పవన్ కల్యాణ్ నిరీక్షించక తప్పలేదు. కేసిఆర్ కావాలని పవన్ కల్యాణ్‌ను నిరీక్షణలో పెట్టారని అనుకోవడానికి లేదు. గవర్నర్‌‌‌తో భేటీ అనేది అత్యంత ముఖ్యమైంది.

  తెలంగాణలో నాకూ బలం ఉంది

  తెలంగాణలో నాకూ బలం ఉంది

  తెలంగాణలో తనకు అభిమానులున్నారని, తన బలం తనకు ఉందని, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం బాగా పనిచేస్తోందని తాను తన అభిమానులకు ప్రత్యేకంగా చెప్పనక్కరలేదని పవన్ కల్యాణ్ అన్నారు. దీన్ని బట్టి కేసీఆర్‌కు పవన్ కల్యాణ్ బేషరతు మద్దతు ప్రకటించినట్లే భావించాలి. కెసీఆర్‌‌ వెంట నడవాలని ఆయన పరోక్షంగా తెలంగాణలోని తన అభిమానులకు సంకేతాలు ఇచ్చారని భావించవచ్చు.

   గంట సేపు ఏకాంత చర్చలు..

  గంట సేపు ఏకాంత చర్చలు..

  కెసిఆర్, పవన్ కల్యాణ్ అరగంటసేపు ఏకాంతంగా భేటీ అయ్యారు. వారి మధ్య ప్రధానంగా రాజకీయ అంశాలు ప్రస్తావనకు వచ్చినట్లు చెబుతున్నారు. తర్వాత ఇద్దరూ కలిసి భోజనం చేశారు. దాదాపు రెండు గంటలపాటు పవన్‌ కల్యాణ్ ప్రగతిభవన్‌లో ఉన్నారు.

   గతంలో కాపు సమస్యపై సలహాకు..

  గతంలో కాపు సమస్యపై సలహాకు..

  కాపు సమస్యపై చర్చకు గతంలో ఒకసారి పవన్ కల్యాణ్ కేసీఆర్‌ అపాయింట్‌మెంట్‌ కోరినట్లు సమాచారం. సమావేశానికి అప్పుడు సమయం చిక్కలేదని అంటున్నారు. ఇటీవల రాజ్‌భవన్‌లో ఇరువురు కాసేపు మాట్లాడుకున్నారు. ఇరువురి మధ్య ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలపై కూడా చర్చ జరిగినట్లు తెలుస్తోంది.

   జానా రెడ్డి మాటలు గుర్తుకొచ్చాయి...

  జానా రెడ్డి మాటలు గుర్తుకొచ్చాయి...

  రైతులకు 24 గంటల విద్యుత్తు ఇస్తే వచ్చే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) తరఫున ప్రచారం చేస్తానని ప్రతిపక్ష నేత జానారెడ్డి చెప్పిన మాటలు తనకు గుర్తుకొచ్చాయని పవన్ కల్యాణ్ అన్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో తెరాసకు మద్దతిచ్చే ఆలోచన లేదని చెప్పారు.

   కేసీఆర్‌ను అప్పుడే అడిగా..

  కేసీఆర్‌ను అప్పుడే అడిగా..

  రాష్ట్రపతికి గవర్నర్‌ ఇచ్చిన విందులో తాను కేసీఆర్‌ని కలిసిన విషయాన్ని పవన్ కల్యాణ్ గుర్తు చే్తూ త్వరలోనే భేటీ అవుదామని కేసిఆర్ చెప్పారని పవన్ కల్యాణ్ అన్నారు. ప్రపంచ తెలుగు మహాసభలకు తాను రాలేకపోయిన విషయం కూడా ముఖ్యమంత్రితో చర్చించినట్లు తెలిపారు.

   గంట సేపు నిరీక్షణ..

  గంట సేపు నిరీక్షణ..

  పవన్‌ కల్యాణ్‌ సోమవారం సాయంత్రం 6.20 గంటల ప్రాంతంలో ప్రగతి భవన్‌కు చేరుకున్నారు. సరిగ్గా అదే సమయానికి కేసీఆర్ గవర్నర్‌ నరసింహన్‌ను కలిసేందుకు రాజ్‌భవన్‌కు వెళ్లారు. దీంతో పవన్‌ దాదాపు గంట సేపు కేసీఆర్‌ కోసం ఎదురుచూశారు. గవర్నర్‌ని కలిసి ప్రగతి భవన్‌కు వచ్చిన కేసీఆర్‌ నేరుగా పవన్‌ కల్యాణ్‌ను కలుసుకున్నారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Jana sena chief Pawan Kalyan has waited for one hour at Pragathi Bhavan to meet Telangana CM K chandrasekhar Rao (KCR).

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి