పీరియడ్స్ ఆపడం కోసం టాబ్లెట్స్.. 18 ఏళ్ల విద్యార్థినికి ఏం జరిగిందంటే ??

యువతులకు, స్త్రీ లకు నెలసరి ( పీరియడ్స్ ) రావడం సహజమే. ప్రస్తుతం యువతులు, ముఖ్యంగా పండుగలు, వివాహాలు, లేదా ఇతర ముఖ్యమైన కార్యక్రమాల కోసం పీరియడ్స్‌ను ఆలస్యం చేయడానికి హార్మోన్ల మాత్రలను కొందరు వాడుతున్నారు. అయితే ఓ 18 ఏళ్ల ఇంజినీరింగ్ విద్యార్థిని కూడా ఇలానే టాబ్లెట్స్ వాడి.. ఆ తర్వాత కాలు నొప్పి, వాపుతో ఆస్పత్రిలో చేరి చివరికి మరణించడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

'రీబూటింగ్ ది బ్రెయిన్' అనే పోడ్‌కాస్ట్‌లో వాస్కులర్ సర్జన్ డాక్టర్ వివేకానంద్ ఈ హృదయ విదారక సంఘటన గురించి వివరించారు. ఏం చెప్పారంటే.. ఒక 18 ఏళ్ల ఇంజనీరింగ్ విద్యార్థిని కాలు, తొడ నొప్పితో ఆసుపత్రికి వచ్చింది. తల్లిదండ్రులు అందుబాటులో లేరని.. 'పూజ ఉండటం వల్ల పిరియడ్స్ ఆపడానికి కొన్ని హార్మోన్ల మాత్రలు తీసుకోవలసి వచ్చిందని చెప్పిందన్నారు. అది DVTకి ఒక కారణమని.. క్లాట్ దాదాపు బొడ్డు వరకు ఉందని స్కాన్ ద్వారా తెలిసిందని,, కేవలం 3 రోజులు మాత్రమే ఆమె మాత్రలు తీసుకుందని వివరించారు.

18-years-girl-died-due-to-using-tablets-to-stop-periods

వెంటనే కుటుంబ సభ్యులతో మాట్లాడాలని చెప్పి.. ఆమె తండ్రితో మాట్లాడినట్టు తెలిపారు. ఆసుపత్రిలో చేర్చి చికిత్స చేయడం చాలా ముఖ్యమని వివరించానని.. కానీ ఆమె తల్లి వద్దని, రేపు ఉదయం వస్తానని చెప్పడంతో ఆగిపోయినట్టు చెప్పారు. కానీ దురదృష్టవశాత్తు, అర్థరాత్రి 2 గంటల ప్రాంతంలో ఫోన్ వచ్చిందని.. ఆ అమ్మాయిని అత్యవసర విభాగానికి తరలించగా.. అప్పటికే శ్వాస తీసుకోవడం లేదని వాపోయారు.

మతపరమైన వేడుక కోసం పిరియడ్స్ ఆలస్యం చేయడానికి హార్మోన్ల మాత్రలు తీసుకోవడమే ఈ మరణానికి కారణమని వైద్యులు నిర్ధారించారు. ఆ ఘటనతో చాలా బాధపడ్డానని డాక్టర్ వివేకానంద్ తెలిపారు. దీంతో డీప్ వెయిన్ థ్రాంబోసిస్ (DVT) గురించి తీవ్ర చర్చ మొదలైంది.

DVT అంటే ఏమిటి? కారణాలు ఏమిటి?

డీప్ వెయిన్ థ్రాంబోసిస్ (DVT) అనేది కాళ్లలోని లోతైన సిరలలో రక్తం గడ్డకట్టే ఒక తీవ్రమైన వైద్య పరిస్థితి. ఈ గడ్డలు కదిలి ఊపిరితిత్తులకు చేరితే పల్మనరీ ఎంబోలిజం అనే ప్రాణాంతక పరిస్థితికి దారితీస్తుంది. ఈ యువతి విషయంలో కూడా ఇదే జరిగింది. హార్మోన్ల మాత్రలు తీసుకోవడం, అలాగే సుదీర్ఘ కాలం ఒకే చోట కూర్చోవడం వంటివి DVTకి కారణాలుగా డాక్టర్ వివేకానంద్ పేర్కొన్నారు.

నేటి కాలంలో ఈ మాత్రలు శరీరంలో హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీసి, రక్త గడ్డకట్టే ప్రమాదాన్ని పెంచుతాయి. డాక్టర్ సలహా లేకుండా ఇలాంటి మాత్రలు వాడటం చాలా ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. ఒక్కోసారి కీలక సమయాల్లో ఆలస్యం చేయడం వల్ల తిరిగి కోలుకోలేని పరిణామాలు జరుగుతాయి" అని డాక్టర్ వివేకానంద్ ఆవేదన వ్యక్తం చేశారు.

డీప్ వెయిన్ థ్రాంబోసిస్ (DVT) లక్షణాలైన కాలు నొప్పి, వాపు, ఎరుపు రంగు వంటివి కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలని సూచిస్తున్నారు. సకాలంలో రోగ నిర్ధారణ, చికిత్సతో ప్రాణాలను కాపాడవచ్చని చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+