సిగరెట్ అలవాటు ఉందా, రోజూ ఇవి రెండు తినండి - ఊహించని మార్పు..!!

సిగరెట్ అలవాటు ఆరోగ్యానికి హానికరం. దీని కారణంగా ఊపిరి తిత్తుల పై దుష్ఫ్రభావం కారణంగా తరచూ ఆరోగ్య సమస్యలు వస్తాయి. అయినా ఈ అలవాటును చాలామంది వదులుకోలేకపో తున్నారు. సిగరెట్ మానేసినప్పుడు రోజు రోజుకి శరీరంలో ఎన్నో మార్పులు వస్తాయని అధ్యయనా లు స్పష్టం చేస్తున్నాయి. సిగరెట్ అలవాటు ఉన్నవారు ప్రతీ రోజు నానబెట్టిన బాదం పప్పును తొక్కతో సహా తినటం ప్రారంభిస్తే నెల రోజుల్లోనే ఊహించని మార్పు కనిపిస్తుందని ప్రకృతి వైద్య ప్రముఖులు స్పష్టం చేస్తున్నారు.

సిగరెట్ ఎప్పటి నుంచో అలవాటు ఉన్నవారు ఒక్క సారిగా మానుకోలేరు. మానేసే ప్రయత్నం చేసినా తిరిగి ప్రారంభించన వారి సంఖ్య చాలా ఎక్కువగానే కనిపిస్తుంది. అయితే, సిగరెట్ తాగటం వలన ఉపిరితిత్తులు దెబ్బ తింటాయి. పొగ తాగే వారే కాదు.. ఆ సమయంలో అక్కడ ఉన్న వారికి నష్టం కలుగుతుంది. అయితే, సిగరెట్ తాగే అలవాటు ఉన్నవారు ఆరోగ్యాన్ని కాపాడు కోవటానికి .. ప్రధానంగా ఊపిరితిత్తుల ఆరోగ్యం కోసం ప్రకృతి వైద్యులు కొన్ని సూచనలు చేస్తున్నారు. అందులో భాగంగా నాలుగు వారాల పాటు బాదం పప్పును తొక్కతో తీసుకోవాలని సూచించారు. దీని ద్వారా నాలుగు వారాలు బాదం పప్పు నానబెట్టి తొక్కతో తింటే వారిలో మార్పు వస్తుందని చెబుతున్నారు. దీంతో.. ప్రీ రాడికల్స్ డామేజ్ కంట్రోల్ తో పాటుగా.. ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గుతుందని వివరిస్తున్నారు. ఈ బాదం పప్పు 35 శాతం వరకు ఊపిరితిత్తులను రక్షిస్తాయని విశ్లేషించారు. 22 రకాల యాంటి ఆక్సిడెంట్స్ బాదం పప్పులో ఉన్నాయని చెబుతున్నారు. సిగరెట్ తాగే వారిలో గుండె సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని.. బాదం పప్పు ద్వారా గుండె కు మేలు జరుగుతుందని వివరిస్తున్నారు.

almond-healthy-way-to-lower-bad-cholesterol-levels-and-prevents-the-risk-of-heart-diseases

పొగ తాగటం ద్వారా గుండె మీద ప్రభావం ఉండటంతో బాదం పప్పు మేలు చేస్తుంది. శరీరంలోని ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ తగ్గి బాదం పప్పు ద్వారా మంచి కొవ్వు పెరుగుతుందని చెబుతున్నారు. ఇక.. షుగరు ఉన్నవారికి సైతం బాదం పప్పు అద్భుతంగా పని చేస్తుంది. ఇందులో ఉండే మెగ్నీషియం ప్యాంక్రియాస్ ను రక్షిస్తాయి. హైప్రొటీన్ ఉండటం వలన శరీరానికి మేలు చేస్తుంది. దీంతో, రెండు వారాల నుంచి 3 నెలల తర్వాత మీ ఊపిరితిత్తులు మునుపటి కంటే స్పష్టంగా బలంగా మారుతాయి. మీ రక్త ప్రసరణ మెరుగవుతుంది వ్యాయామం చేయగలుగుతారు. సిగరెట్ మానేసిన 3 నుంచి 6 నెలలలోపు సులభంగా శ్వాస తీసుకోవడం ప్రారంభిస్తారు. మీ శక్తి పెరగడం ప్రారంభమవుతుంది జలుబు, ఇతర వ్యాధులను తగ్గించడంలో సహాయం లభిస్తుంది. ఒక సంవత్సరం తర్వాత గుండె జబ్బులు వచ్చే ప్రమాదం సగానికి పైగా తగ్గిపోతుంది. ఇలా బాదం పప్పు రెగ్యులర్ గా తీసుకోవటం ద్వారా సిగరెట్ తాగే వారికి ఆరోగ్య పరంగా మేలు జరుగుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+