హెయిర్ డైలు ఏదిపడితే అది వాడుతున్నారా? డేంజర్!
ప్రస్తుతం విపరీతంగా అన్ని వయసుల వారు తెల్ల జుట్టు సమస్యని ఎదుర్కొంటున్నారు. ఇక తెల్ల జుట్టును కవర్ చేసుకోవటానికి హెయిర్ డై లు వాడుతున్నారు. నిపుణులు మార్కెట్లో నియంత్రణ లేని హెయిర్ డై బ్రాండ్లు ఇబ్బడి ముబ్బడిగా వస్తున్నాయని వాటి గురించి ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఏది పడితే అది వాడకూడదని అంటున్నారు. ఈ ఉత్పత్తులపై సరైన చెకింగ్ లేకపోవటం కారణంగా వినియోగదారులకు ఆరోగ్య ప్రమాదాలను కలిగిస్తాయని ఆందోళన ఉంది.
హెయిర్ డైలను ఎంచుకునేటప్పుడు జాగ్రత్త
డెర్మటాలజిస్టులు మరియు ఆరోగ్య నిపుణులు హెయిర్ డైలను ఎంచుకునేటప్పుడు జాగ్రత్త వహించమని సలహా ఇస్తున్నారు. సరైన హెయిర్ డై సెలక్షన్ అనేది చాలా ముఖ్యమని చెప్తున్నారు. నియంత్రణ లేకుండా లెక్కకు మిక్కిలిగా వస్తున్న హెయిర్ డైలు అలెర్జిక్ ప్రతిచర్యలు కలిగిస్తాయని చెప్తున్నారు. చర్మ సమస్యలకు దారితీసే హానికరమైన రసాయనాలను కలిగి ఉండవచ్చునని నిపుణులు అంటున్నారు.

హానికరమైన హెయిర్ డై లతో ఆరోగ్యంపై ప్రభావం
ఈ డైల్లోని కొన్ని పదార్థాలు తీవ్రమైన తల సమస్యలను కలిగించవచ్చని కూడా హెచ్చరిస్తున్నారు. వినియోగదారులు లేబుళ్లను జాగ్రత్తగా చదవాలని లేబుల్ పై చెక్ చేయబడిన బ్రాండ్లను ఎంచుకోవాలని కోరుతున్నారు. హెయిర్ డై పరిశ్రమలో నియంత్రణ లేకపోవడం ఒక ముఖ్యమైన ఆందోళన. ఇది ఆ ప్రోడక్ట్ వాడిన వారి ఆరోగ్యంపైన తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది,
విశ్వసనీయ బ్రాండ్ లనే ఎంచుకోవాలి
సరైన పర్యవేక్షణ లేకుండా, తయారీదారులు చౌకైన, హానికరమైన పదార్థాలను ఉపయోగించే అవకాశం ఉంది. వినియోగదారుల భద్రతను నిర్ధారించడానికి ఈ ఉత్పత్తులపైన నియంత్రణ సంస్థలు కఠినమైన మార్గదర్శకాలను అమలు చేయాలి. అప్పటివరకు, ఎవరైనా సరే జాగ్రత్తగా పరిశీలించి, విశ్వసనీయ బ్రాండ్లను ఎంచుకోవాలి.
కొత్త హెయిర్ డైలను వాడే ముందు నిపుణులను సంప్రదించండి
మార్కెట్ లో వస్తున్న రకరకాల హెయిర్ కలర్స్ తో జుట్టు ఆరోగ్యం పాడవుతుంది. జుట్టు నిర్జీవంగా తయారవుతుంది. అలాగే జుట్టు కుదుళ్ళ వద్ద కూడా అలెర్జీలు వచ్చే అవకాశం ఉంటుంది. కొన్ని రకాల హెయిర్ కలర్స్ తో క్యాన్సర్ లు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కొత్త హెయిర్ డై బ్రాండ్లను ఉపయోగించే ముందు నిపుణులతో సంప్రదించి ఎంచుకోవాలి.












Click it and Unblock the Notifications