మతిమరుపును తగ్గించే ఆయుర్వేద మూలికలు.. తరచూ తీసుకుంటే..?
మతిమరుపు (memory loss) అనేది వయసుతో సంబంధం ఉన్న సమస్యగా కనిపించవచ్చు, కానీ సరైన ఆహారం, జీవనశైలి ద్వారా దీనిని నియంత్రించవచ్చు. ముఖ్యంగా, కొన్ని ప్రత్యేక మూలికలు మేధస్సు పనితీరును మెరుగుపరచడంలో, మతిమరుపు తగ్గించడంలో సహాయపడతాయి. ఈ మూలికలు మెదడు ఆరోగ్యానికి అవసరమైన పోషకాలను అందిస్తూ, నరాలు మరియు నాడీ వ్యవస్థను చురుకుగా ఉంచుతాయి.
1. బ్రాహ్మి (Bacopa Monnieri)
బ్రాహ్మి అనేది ప్రాచీన ఆయుర్వేద మూలిక, ఇది మెదడును శక్తివంతం చేయడంలో ప్రసిద్ధి పొందింది. దీనిని తరచూ తీసుకోవడం వల్ల మెమరీ మెరుగుదలకు తోడ్పడుతుంది. మానసిక ఒత్తిడిని తగ్గించి మేధో శక్తిని పెంచుతుంది. రోజువారీ కాషాయంగా లేదా మెడికేషన్ రూపంలో దీనిని తీసుకోవచ్చు.ఈ మూలిక మెదడుకు రక్త ప్రవాహాన్ని పెంచి, మెదడులోని నరాల కణాలను రక్షిస్తుంది

2. శంఖపుష్పి (Shankhpushpi)
ఈ మూలిక మెదడులోని నరాల కణాలకు పోషణ ఇచ్చి, మతిమరుపును తగ్గిస్తుంది. ఇది ఒత్తిడిని తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. దీనిని ఉదయాన్నే టీ రూపంలో కూడా తీసుకోవచ్చు. ఇది నరాల శక్తిని పెంచి మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. ధ్యానం, ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది.
3. అశ్వగంధ (Ashwagandha)
ఈ అశ్వగంధ మూలిక మెదడులోని ఆక్సిడేటివ్ స్ట్రెస్ ను తగ్గించి, జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది. ఇది మెదడులోని నరాల కణాలను రక్షిస్తుంది. అల్జీమర్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఒత్తిడిని తగ్గించడంతో పాటు నిద్రలేమి కారణంగా వచ్చే మతిమరుపును నియంత్రిస్తుంది.
4.తులసి (Holy Basil)
తులసిలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి మెదడులోని నరాల కణాలను రక్షిస్తాయి. మెదడు, నాడీ వ్యవస్థను సమతుల్యం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. తులసి ఆకుల రసాన్ని తాగడం వల్ల మతిమరుపు తగ్గుతుంది.
4. గింకో బిలొబా (Ginkgo Biloba)
ఈ మూలిక చైనీస్ వైద్య విధానంలో విస్తృతంగా ఉపయోగించబడుతుంది. ఇది మెదడుకు రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. స్మరణశక్తిని పెంచడంతో పాటు ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను తగ్గించడంలో సూపర్‌గా పనిచేస్తుంది.
5. గ్రీన్ టీ ( Green Tea )
గ్రీన్ టీ శరీరంలోని టాక్సిన్లను తొలగించడంలో సహాయపడుతుంది. దీనిలో యాంటీఆక్సిడెంట్ గుణాలు కలిగి ఉండడం. ఇది మెదడు కార్యక్షమతను మెరుగుపరచడం. మెమరీ ఫంక్షన్‌ను ప్రోత్సహించడం.
ఈ మూలికలను ఎలా ఉపయోగించాలి?
ఈ మూలికలను చూర్ణం చేసి, తేనె లేదా గోరువెచ్చటి నీటితో కలిపి తీసుకోవచ్చు. అంతే కాకుండా ఈ మూలికలతో కషాయం తయారు చేసి తాగవచ్చు. ఈ మూలికలను వంటల్లో కూడా చేర్చవచ్చు . ఈ మూలికలన్నీ ఆయుర్వేదం మరియు ప్రకృతిలో మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ప్రసిద్ధి పొందినవి. సక్రమ ఆహారం, శారీరక వ్యాయామం, ఈ మూలికలతో జ్ఞాపకశక్తి, మానసిక ఆరోగ్యాన్ని సమర్థవంతంగా మెరుగుపరచుకోవచ్చు. తగిన మోతాదులో వైద్యుల సూచనతో ఈ మూలికలను ఉపయోగించడం మంచిది.












Click it and Unblock the Notifications