బీరకాయ పొట్టు ఎగ్ కూర.. ఒక్కసారి తింటే మీ ఫేవరేట్ కూరైపోతుంది!

సహజంగా మనం బీరకాయని కూరగా వండుకొని తింటాం. అయితే బీరకాయల కూర వండుకునేటప్పుడు దానిపైన పొట్టును సాధారణంగా పడేస్తాం. అయితే బీరకాయ పొట్టు తో కూడా చాలా రుచికరమైన వంటలు తయారు చేయొచ్చు. అలాంటి వాటిల్లో బీరకాయ పొట్టు ఎగ్ కూర ఒకటి.

మంచి పోషకాహారం బీరకాయ పొట్టు, ఎగ్ కూర

ఇది గ్రామీణ ప్రాంతాలలో చాలా బాగా తయారుచేసే, అందరూ ఇష్టంగా తినే వంటకం. తక్కువ ఖర్చుతో, తక్కువ సమయంలో తయారయ్యే ఈ కూర పోషకాలలోనూ, రుచిలోనూ అద్భుతంగా ఉంటుంది. వేడివేడి అన్నంతో దీనిని తింటే ఇది మరింత రుచిగా ఉంటుంది. బీరకాయ పొట్టు ఎగ్ కూర ఎలా తయారు చెయ్యాలో తెలుసుకుందాం.

Beerakaya Pottu egg curry A Zero-Waste Indian Dish which is very delicious and special become favourite

బీరకాయ పొట్టు ఎగ్ కూర తయారీకి కావలసిన పదార్థాలు

బీరకాయ పొట్టు – 1 కప్పు (చిన్నగా తరిగినది)

గుడ్లు – 3 లేదా 4

ఉల్లిపాయ – 1 (సన్నగా తరిగినది)

పచ్చిమిర్చి – 2

అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టీ స్పూన్

కారం – ఒకటిన్నర టీ స్పూన్

ఉప్పు- రుచికి తగినంత

పసుపు – ¼ టీ స్పూన్

నూనె- రెండు టేబుల్ స్పూన్లు

ధనియాల పొడి- ఒక స్పూన్

కరివేపాకు – కొద్దిగా

కొత్తిమీర – అలంకరణకు

పోపు గింజలు- ఒక స్పూన్

తయారీ విధానం

ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె వేసి నూనె వేడి అయిన తర్వాత అందులో ఒక స్పూన్ పోపు గింజలు వేసి కరివేపాకు , ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి వేయించాలి. ఆ తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసి పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి. బీరకాయ పొట్టును బాగా పిసికి దానిని వేగిన ఉల్లిపాయలలో వేసుకోవాలి.

ఇలా బీరకాయ పొట్టు, ఎగ్ వండాలి

ఆ తర్వాత పసుపు, ఉప్పు వేసి బాగా కలిపి, అవసరం అనుకుంటే కొద్దిగా నీరు చల్లి మూత పెట్టి ఐదు నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఆ తర్వాత గుడ్లను నేరుగా కూరలో పగలగొట్టి వేసి కొద్దిసేపు ఉడికించాలి. గుడ్లు మొత్తం బాగా ఉడికి ఫ్రై అయిన తర్వాత, దాంట్లో ఒకటిన్నర స్పూను కారం వేసి మళ్లీ కొద్దిసేపు కలుపుకుంటూ ఫ్రై కానివ్వాలి.

మీ ఫేవరేట్ కూరగా బీరకాయపొట్టు, ఎగ్ కూర

తర్వాత అందులో కొద్దిగా ధనియాల పొడి, కొత్తిమీర వేసి రెండు నిమిషాలు ఆగి స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే రుచికరమైన బీరకాయ పొట్టు, ఎగ్ కర్రీ రెడీ అయింది. ఈ కూర వేడివేడి అన్నం, రోటీ లలో, జొన్న రొట్టెల లో చాలా బాగుంటుంది. ఈ విధంగా వండి ఒకసారి ట్రై చేస్తే ఈ కూర మీ ఫేవరెట్ కూరగా మారిపోతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+