Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కాలేయ ఆరోగ్యానికి ఈ పానీయాలు బెస్ట్!

మన శరీరంలో కాలేయం అత్యంత ముఖ్యమైన అవయవం అని మనం చెప్పుకున్నాం. అటువంటి కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరి పైన ఖచ్చితంగా ఉంటుంది. కాలేయం మన శరీరంలో రక్తాన్ని శుద్ధి చేయడమే కాకుండా, మన జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉండేలా చేసి, జీవక్రియ సక్రమంగా సాగేలా చేస్తుంది.

కాలేయ ఆరోగ్యం కోసం పానీయాలు

కాలేయం సరిగ్గా పని చేస్తేనే మనిషి ఆరోగ్యంగా జీవిస్తాడు. అటువంటి కాలేయ ఆరోగ్యం కోసం కొన్ని ఇంట్లోనే తయారు చేసుకునే తాగగలిగే పానీయాలు ఆయుర్వేదం సూచించింది. ఈరోజు మనం వాటి గురించి తెలుసుకుందాం. ఈ పానీయాలు తాగితే కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

best ayurvedic drinks for liver health

ఉసిరి జ్యూస్

భారతీయ ప్రాచీన వైద్య విధానంలో ఆయుర్వేదం చాలా ముఖ్యమైనది. అటువంటి ఆయుర్వేదం కాలేయ ఆరోగ్యం కోసం కొన్ని రకాల పానీయాలను సూచించింది. కాలేయ ఆరోగ్యం కోసం ఉసిరి రసం తాగడం ఎంతో మంచిది. ఇది కాలేయాన్ని డిటాక్సిఫై చేసి రోగనిరోధక శక్తిని పెంచి కాలేయ ఆరోగ్యాన్ని పెంపొందించడంలో సహాయం చేస్తుంది. ఇందులో ఉండే విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్లు కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

కలబంద జ్యూస్

కాలేయ ఆరోగ్యం కోసం కలబంద జ్యూస్ ను తాగడం చాలా మంచిదని ఆయుర్వేదం చెప్తుంది. కలబంద జ్యూస్ లో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు కాలేయ ఆరోగ్యానికి దోహదం చేస్తాయి. ఇవి జీర్ణక్రియలో సహాయపడతాయి. కాలేయ పనితీరును మెరుగుపరుస్తాయి.

పసుపు కలిపిన పాలు, గ్రీన్ టీ

కాలేయ ఆరోగ్యం కోసం పసుపు కలిపిన పాలు కూడా ఎంతో బాగా ఉపయోగపడతాయి. పసుపులో కర్కుమిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్లను, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రభావాలను కలిగి ఉంటుంది. ఇది మన శరీరంలో కాలేయానికి నష్టం జరగకుండా కాపాడుతుంది. కాలేయ ఆరోగ్యానికి గ్రీన్ టీ కూడా ఉపయోగపడుతుంది.

అల్లం టీ, నిమ్మరసం, త్రిఫల నీరు

అల్లం టీ కూడా కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అల్లం టీ లోకాలేయాన్ని కాపాడడానికి మన జీర్ణక్రియను సక్రమంగా నిర్వహించడానికి కావలసిన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి మాత్రమే కాకుండా కాలేయ ఆరోగ్యానికి నిమ్మరసం కలిపిన నీరు, త్రిఫల పానీయం వంటివి కూడా ఎంతో బాగా ఉపయోగపడతాయి. ఈ పానీయాలను రోజువారి జీవితంలో భాగంగా చేర్చుకుంటే కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది. కాలేయానికి వచ్చే ఆరోగ్య ప్రమాదాల నుండి రక్షించడానికి వీలవుతుంది.

గమనిక: ఈ కథనంలో ఇవ్వబడిన వివరాలు ఆరోగ్య నిపుణుల సూచనలు మరియు ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం అందించబడ్డాయి. ఇది కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యల విషయంలో నిర్ణయాలు తీసుకునే ముందు వైద్యులను సంప్రదించడం ఉత్తమం.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+