బాయిల్డ్ ఎగ్ VS ఆమ్లెట్ - ఈ రెండింటి లో ఏ వయసు వారికి ఏది మంచిది..!?

గుడ్డు సంపూర్ణ పోషకాహారం. గుడ్డులో ప్రొటీన్‌ లు..ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ కారణంగానే వైద్యులు కూడా రోజుకో గుడ్డు తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిదని సూచిస్తుంటారు. చాలామంది తమ బ్రేక్ ఫాస్ట్ లో ఉడికించిన గుడ్డును, మరికొందరు ఆమ్లెట్ రూపంలో తీసుకోవ డానికి ఇష్టపడుతుంటారు. అయితే.. గుడ్డు - ఆమ్లెట్ ఈ రెండింటి లో ఆరోగ్యానికి ఏది మంచిది అనే సందేహం చాలా మందిలో ఉంది. దేని ద్వారా పోషకాలు లభిస్తాయి.. ఎవరికి ఏది మేలు చేస్తుందనేది నిపుణులు స్పష్టత ఇస్తున్నారు.

ఉడికించిన గుడ్డు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కండరాలు అభివృద్ధికి చాలా బాగా తోడ్పడు తుంది. అలాగే, దీనిలో ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, జింక్​తో పాటు విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ బి12 అధికంగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువగా ఉంటాయి. కాగా, ఉడికించిన గుడ్డులో కేలరీలు తక్కువగా ఉంటాయి. అయితే.. ప్రొటీన్లతో పాటుగా ఇతర పోషకాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి, బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఎంపిక అంటున్నారు నిపుణులు. ఇక.. మెదడు ఆరోగ్యానికి ఉడికించిన గుడ్డు చాలా మంచిది. దీనిలో అధికంగా ఉండే కోలిన్ అనే పోషకం బ్రెయిన్​ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి చాలా బాగా సహాయపడుతుంది. అదే విధంగా ఆమ్లెట్ సైతం ఎక్కువ మంది తీసుకుంటారు. ఆమ్లెట్ వేసుకోవడానికి చాలా మంది పచ్చిమిర్చి, పసుపు, కారం, ఉల్లిపాయలతో పాటు ఇతర కూరగాయలను యాడ్ చేస్తారు.

boiled-eggs-retain-nutrients-without-added-fats-while-omelettes-often-require-oil

మరి కొందరు చీజ్​ని కూడా వేస్తుంటారు. ఇవన్నీ వేసి ప్రిపేర్ చేసుకోవడం వల్ల రుచితో పాటు విట్లమిన్లు, ఖనిజాలు, ఫైబర్ లెవల్స్ పెరుగుతాయి. కానీ, నూనె, చీజ్ వంటివి కలపడం వల్ల కేలరీలు పెరగడంతో పాటు అనారోగ్యకరమైన కొవ్వులు యాడ్ అవుతాయి. కాబట్టి, అధిక కేలరీల ను తీసుకోవడం కారణంగా పలు ఆరోగ్య సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంటుందంటున్నారు నిపుణులు. ఆరోగ్యం పరంగా ఉడికించిన గుడ్డు అన్ని పోషకాలను కలిగి ఉంటుంది కాబట్టి, ఆరోగ్యానికి ఆమ్లెట్ కంటే బాయిల్డ్ ఎగ్ మంచిదని సూచిస్తున్నారు. పోషకాల పరంగా అయితే ఆమ్లెట్‌లో కూరగాయలు కలపడం వల్ల పోషకాలు ఎక్కువగా ఉంటాయి. కాగా.. చివరగా వ్యక్తి శరీర అవసరాలను బట్టి ఉడి కించిన గుడ్డు లేదా ఆమ్లెట్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఆధారపడి ఉంటాయి. బరువు తగ్గాలనుకుంటే బాయిల్డ్ ఎగ్ తీసుకోవడం ఉత్తమ ఫలితం ఇస్తుంది. అదే పోషకాలు ఎక్కువగా కావాలనుకునేవారికి ఆమ్లెట్ మంచి ఆహారంగా భావించవచ్చని సూచిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+