బొమ్మిడాల పులుసు.. ఆంధ్రా స్టైల్ చేపల పులుసు ఇలా చేస్తే సూపర్ టేస్ట్!

బొమ్మిడాల పులుసు ఆంధ్రా ఇళ్లలో చాలా ఇష్టపడే వంటకం. చిన్న చేపలతో చేసే ఈ పులుసు అన్నంతో కలిపి తింటే నోరూరించేలా ఉంటుంది. ఇంట్లో సులభంగా చేసుకోవచ్చు. ఈ బొమ్మిడాల పులుసును ఇలా చేస్తే సూపర్ రుచిగా ఉంటుంది.

కావాల్సిన పదార్థాలు

బొమ్మిడాల చేపలు 250 గ్రాములు,
ఉల్లిపాయలు 2,
టమాటాలు 2,
పచ్చిమిర్చి 3-4,
అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్,
చింతపండు రసం 2 టేబుల్ స్పూన్లు,
పసుపు అర టీస్పూన్,
కారం 1-1½ టీస్పూన్,
ధనియాల పొడి 1 టీస్పూన్,
ఉప్పు రుచికి తగినంత
నూనె 3 టేబుల్ స్పూన్లు,
కరివేపాకు.. రెండు రెమ్మలు
కొత్తిమీర కొద్దిగా
ఆవాలు, జీలకర్ర, .

Bommidala Pulusu Recipe Authentic Andhra Style Fish Curry make this in process for better taste

తయారీ విధానం

ముందుగా ఉప్పు, పసుపు రాసి చేపలను బాగా కడిగి పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయిలో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి పోపు చేయండి. ఉల్లిపాయలు వేసి దోరగా వేగనివ్వండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి వేసి కాసేపు వేయించండి. టమాటాలు వేసి మెత్తగా అయ్యే వరకు ఉడికించి పసుపు, కారం, ధనియా పొడి కలపండి. చింతపండు రసం, కాస్త నీళ్లు పోసి మరిగించండి. ఉప్పు వేసి రుచి చూసుకోండి.

ఇప్పుడు చేపలు వేసి మూత పెట్టకుండా 8-10 నిమిషాలు పాటు ఉడికించండి. చేపలు విరిగిపోకుండా జాగ్రత్తగా కలపండి. చివర్లో కొత్తిమీర చల్లి దించుకోండి. అంతే రుచికరమైన బొమ్మిడాల పులుసు రెడీ అవుతుంది. వేడి అన్నంతో కలిపి తింటే ఈ బొమ్మిడాల పులుసు చాలా రుచిగా ఉంటుంది. చేపలు ఎక్కువసేపు ఉడికిస్తే విరిగిపోతాయి కాబట్టి సమయం పాటించండి.

కొర్రల కట్టె పొంగలి: బరువు తగ్గాలనుకునేవారికి, షుగర్ పేషెంట్లకు సూపర్!
కొర్రల కట్టె పొంగలి: బరువు తగ్గాలనుకునేవారికి, షుగర్ పేషెంట్లకు సూపర్!

బొమ్మిడాల చేప ప్రోటీన్, కాల్షియం, ఐరన్ మరియు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌తో నిండి ఉంటుంది. ఈ ప్రోటీన్ మన శరీర ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుంది. కాల్షియం ఎముకలు, దంతాలు బలపడటానికి సహాయపడుతుంది. ఒమేగా-3లు గుండె ఆరోగ్యాన్ని కాపాడుతూ, రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి. పులుసులోని చింతపండు, పసుపు, వెల్లుల్లి వంటి పదార్థాలు జీర్ణశక్తిని పెంచి, వాపు తగ్గించి, రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+