స్థానిక సంస్థల ఎన్నికలు నిలిపివేయాలి.. హైకోర్టులో పిల్..!!

స్థానిక సంస్థల వ్యవహారంలో కీలక పరిణామం. ఇప్పటికే స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. అటు రాజకీయ పార్టీలు సీట్లు.. అభ్యర్ధుల పైన కసరత్తు చేస్తున్నాయి. ఈ నెల 28న మున్సిపల్ ఎన్నికల పోలింగ్.. 30న ఫలితాలు వెల్లడి కానున్నాయి. దీంతో.. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ సమయంలోనే అనూహ్యంగా హైకోర్టులో పిల్ దాఖలైంది. స్థానిక ఎన్నికలు నిలిపివేయాలని అందులో పిటీషనర్ కోరారు. రిజర్వేషన్ల అంశం ప్రస్తావించారు. న్యాయస్థానం విచారణ చేసింది.

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణను నిలిపివేయాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయో జన పిటిషన్ పై విచారణ జరిగింది. చేసింది. పంచాయతీ రాజ్, మున్సిపల్ శాఖలు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల ఖరారు కోసం విడుదల చేసిన జీఓలు గతంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు విరుద్ధంగా ఉన్నాయని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం రిజర్వేషన్లను సరిగ్గా అమలు చేసేవరకు ఎన్నికల ప్రక్రియను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని పిటిషనర్ విన్నవించారు. స్థానిక సంస్థలలో బీసీ రిజర్వేషన్ల కోసం ఏర్పాటు చేసిన డెడికేషన్ కమిషన్‌పై ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించిన తర్వాత మాత్రమే దాని సిఫార్సులను అమలు చేయాల్సి ఉందని పిటిషనర్ వాదించారు.

ఎట్టకేలకు బీజేపీ, జనసేన సీట్లు ఖరారు - ఆ స్థానం పైనే పీఠముడి, జాబితా..!!
ఎట్టకేలకు బీజేపీ, జనసేన సీట్లు ఖరారు - ఆ స్థానం పైనే పీఠముడి, జాబితా..!!
high-court-reserves-verdict-on-pil-seeking-stay-on-local-body-elections-here-the-details

వాదనల తరువాత తీర్పు రిజర్వ్ చేసిన న్యాయస్థానం

దీంతో పాటుగా సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం కమిషన్ నివేదికను పబ్లిక్ డొమైన్‌లో పెట్టాల్సి ఉన్నప్పటికీ, అధికారులు అలా చేయకుండా అభ్యంతరాలను స్వీకరించ లేదని కోర్టుకు తెలిపారు. నిబంధనలను పాటించకుండా రిజర్వేషన్లు అమలు చేయడం చట్టవిరుద్ధమని పిటిషనర్ తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన న్యాయవాదులు ఈ పిటిషన్‌కు విచారణ అర్హత లేదని కోర్టుకు విన్నవించారు. కేవలం ఫ్యామిలీ సర్వే ఆధారంగా మాత్రమే కాకుండా, ఇతర అనేక అంశాలను సమగ్రంగా పరిశీలించి, చట్టప్రకారమే రిజర్వేషన్లను ఖరారు చేశామని కోర్టుకు వెల్లడించారు. రెండు వైపులా వాదనలు విన్న న్యాయస్థానం నిర్ణయాన్ని రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+