Jailer 2: రజనీకాంత్ 'జైలర్ 2' లో ప్లస్ లు.. మైనస్ లు ఇవే..

సూపర్ స్టార్ రజనీకాంత్- కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో 2023 లో వచ్చిన 'జైలర్' మూవీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ. 600 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. సూపర్ స్టార్ కెరీర్ లోనే అత్యధిక వసూల్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా జైలర్ నిలిచింది. అయితే ఆ మూవీకి కొనసాగింపుగా తాజాగా 'జైలర్ 2' మూవీ రిలీజ్ అయింది. అక్టోబర్ 15న ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. మరి జైలర్ 2 మూవీ పార్ట్ 1 ను మించిన రేంజ్ లో ఉందా..? జైలర్ 2 లో ప్లస్ లు ఏంటి..? మైనస్ లు ఏంటి..? పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం..

జైలర్ 2 మూవీ స్టోరీ విషయానికి వస్తే.. టైగర్ ముత్తువేల్ పాండ్యన్(రజనీకాంత్) తన కొడుకు మరణం తర్వాత ఆ కుటుంబానికి అన్నీ తానై చూసుకుంటూ ఉంటాడు. ఇక జైలర్ 1 లో టైగర్.. విగ్రహాల స్మగ్లింగ్ ముఠాకు చెందిన వర్మ(వినాయకన్)ను చంపేస్తాడు. అయితే పార్ట్ 2 కూడా అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. వర్మను చంపింది ఎవరు..? కనిపెట్టి అతడ్ని చంపేయాలని విగ్ర‌హాల స్మగ్లింగ్ ముఠాలో కీల‌క‌మైన దిలీప్ (సూర‌జ్ వెంజ‌రమూడు) ప్రయత్నిస్తుంటాడు. మరోవైపు టైగర్ కూడా దిలీప్ ను బయటకు లాగి ఈ ముఠాను అంతం చేయాలని నిర్ణయించుకుంటాడు.

ఈ క్రమంలో లోకల్ రౌడీ మూర్తి(నమో నారాయణ)తో కలిసి దిలీప్ వరకు వెళ్తాడు టైగర్. ఇక దిలీప్- టైగర్ ఒకర్నొకరు ఎదురుపడ్డాక ఏం జరిగింది..? దిలీప్ వెనుక ఉండి విగ్రహాల స్మగ్లింగ్ ముఠాకు నాయకత్వం వహిస్తున్న దోధి కల్పక్(ఎస్ జే సూర్య) ను టైగర్ ఎలా ఎదుర్కొన్నాడు..? ఆ తర్వాత జరిగిన పరిణామాలేంటి..? విద్యా బాలన్, హృతిక్ రోషన్ పాత్రలు ఏంటి..? మోహన్ లాల్, శివరాజ్ కుమార్ ల పాత్ర ఏంటి..? ఇవన్నీ థియేటర్లలో సినిమా చూసి తెలుసుకోవాల్సిందే..

ఇక జైలర్ సినిమా మాదిరిగానే జైలర్ 2 కూడా పక్కా కమర్షియల్ ఫార్మాట్ లో సాగుతుంది. ఫస్టాఫ్ లో ఫన్ ఎలిమెంట్స్, రజనీకాంత్ ఎలివేషన్స్, గూస్ బంప్స్ తెప్పించే ఇంటర్వెల్ బ్యాంగ్ తో దర్శకుడు నెల్సన్ చాలా ఎంగేజింగ్ గా తీసుకొచ్చాడు. సినిమాలో కామెడీ, మాస్ అంశాలు, ఎమోషన్స్ ఇలా అన్నీ ప‌క్కాగా ఉండేలా, ఏ విష‌యంలోనూ త‌క్కువ కాకుండా రెండో భాగంలో మరింత జాగ్ర‌త్త‌ప‌డ్డాడు నెల్స‌న్. మొత్తానికి ఫస్టాఫ్ ఫ్యాన్స్ కు ఫీస్ట్ అని చెప్పాలి.

Jailer2 The pros and cons of Superstar Rajinikanth s Jailer 2 here is the full movie review for you

అలాగే సెకండాఫ్ నుంచి కథ అనుకున్నంతగా ప్రభావం చూపించలేకపోయిందని చెప్పాలి. కానీ ఎక్కడా బోర్ కొట్టకుండా సెకండాఫ్ ను లాగించాడు నెల్సన్. హృతిక్ రోష‌న్ కేమియో సినిమాకు హైలెట్ అని చెప్పాలి. అలాగే మూవీ క్లైమాక్స్ లో మరో కీలక నటుడి కేమియో కూడా ఉంటుంది. ఇక ఫైనల్ గా జైలర్ 3 కు లీడ్ ఇస్తూ సినిమా ముగుస్తుంది. ఇక చివరగా సినిమాలో ప్లస్ లు చూస్తే రజనీకాంత్ యాక్టింగ్, మాస్ ఎలివేషన్స్, ఫస్టాఫ్, కామెడీ.. అలాగే మైనస్ లు చూస్తే.. సెకండాఫ్, సాంగ్స్ అని చెప్పొచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+