ఢిల్లీని పాకిస్తాన్ బోర్డర్ లా మార్చేశారు.. ఎందుకో జనానికి తెలుసు: ఏకిపారేసిన అభిజిత్ దిప్కే

ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌కు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న అసాధారణ భద్రత, ఢిల్లీలో విధించిన కఠిన ఆంక్షలపై కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఒక్క అధికారి కోసం దేశ రాజధానిని పూర్తిగా స్తంభింపజేసిందని ఆరోపించారు. ఢిల్లీని భారత్-పాకిస్తాన్ సరిహద్దులా మార్చేసిందని ధ్వజమెత్తారు. సామాన్య ప్రజల పట్ల కనీస జాలి, దయ లేకుండా వ్యవహరిస్తోందని, వాహనాల రాకపోకలను అడ్డుకుంటోందని మండిపడ్డారు.

ఢిల్లీలో ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ నాయకురాలు నేహా బోరా, ఇతర విద్యార్థి సంఘాల ప్రతినిధులతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు అభిజిత్ దిప్కే. జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా నిరసన తెలుపుతోన్న విపక్ష నేతలు, విద్యార్థులను రోడ్లపై ఈడ్చుకెళ్లడం ప్రభుత్వ అణచివేత ధోరణికి నిదర్శనమని విమర్శించారు. రెండు వారాలుగా ఢిల్లీ వీధుల్లో విద్యార్థి సంఘాలు, యువత తమ ఆకాంక్షల కోసం నిరంతరం పోరాటం చేస్తున్నారని, అయినా కేంద్ర ప్రభుత్వంలో కనీస చలనం రావట్లేదని విమర్శించారు.

Turned Delhi into an India-Pakistan border says Abhijeet Dipke outrage slams PM Modi and Amit Shah

శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్న వారిపై పోలీసులు, భద్రతా బలగాలు విరుచుకుపడుతున్నాయని అబిజిత్ దిప్కే ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలు, నిర్ణయాలను ఎండగడుతూ ప్రతిపక్ష నాయకులు కూడా వీధుల్లోకి వచ్చి పోరాడగా, వారందరినీ భద్రతా దళాలు బలవంతంగా అదుపులోకి తీసుకుంటోన్నాయని గుర్తు చేశారు. ఈ ఆందోళనల సమయంలో లోక్‌సభ ప్రతిపక్ష నేతతో పాటు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులైన మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, పినరయి విజయన్ వంటి అగ్రనేతలను కూడా పోలీసుల బాధితులేనని దిప్కే వ్యాఖ్యానించారు.

న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ నుంచి టీమిండియా స్టార్ ప్లేయర్ అవుట్
న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ నుంచి టీమిండియా స్టార్ ప్లేయర్ అవుట్

ఆకాశవాణి భవన్ వద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన రాహుల్ గాంధీని సైతం కేంద్ర ప్రఁభుత్వం, పోలీసులు దోషిగా చూస్తోన్నారని దిప్కే అన్నారు. జాతీయ పతాకాన్ని ఎగురవేయడాన్ని సైతం చట్ట ఉల్లంఘనగా పరిగణించడం ప్రజాస్వామ్య సూత్రాలకు పూర్తిగా విరుద్ధమని చెప్పారు. జ్ఞానేష్ కుమార్‌ అనే ఒక అధికారి కోసం దేశంలో ఇలాంటి అణచివేత వాతావరణాన్ని సృష్టించడం మునుపెన్నడూ లేదని పేర్కొన్నారు.

న్యాయ వ్యవస్థను ఎవరూ బెదిరించలేరు- రాహుల్ గాంధీపై సీజేఐ సూర్యకాంత్ ఫైర్
న్యాయ వ్యవస్థను ఎవరూ బెదిరించలేరు- రాహుల్ గాంధీపై సీజేఐ సూర్యకాంత్ ఫైర్

కేంద్ర ప్రభుత్వం జ్ఞానేష్ కుమార్‌కు ఈ స్థాయిలో రక్షణ కల్పించాల్సిన అవసరం ఏమొచ్చిందో వివరించాలని అభిజీత్ దిప్కే డిమాండ్ చేశారు. ప్రధాని మోదీకి జ్ఞానేష్ కుమార్ నుంచి ఎలాంటి ప్రయోజనం చేకూరుతోందో ఈ దేశ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని అన్నారు. రాబోయే ఎన్నికల్లో నరేంద్ర మోదీ విజయం సాధించడానికి జ్ఞానేష్ కుమార్ సహకరిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, ఒకవేళ అది నిజం కాకపోతే ఆయనకు ప్రభుత్వం ఇంతటి భారీ భద్రతా వలయాన్ని ఎందుకు ఏర్పాటు చేస్తోందో స్పష్టం చేయాలని చెప్పారు.

అక్టోబర్ 10న ఇచ్చిన నిరసన పిలుపు నేపథ్యంలో దేశ చరిత్రలోనే అరుదుగా రైల్వే సేవలను నిలిపివేశారని దిప్కే ఆరోపించారు. అక్కడితో ఆగకుండా ఢిల్లీ వ్యాప్తంగా మెట్రో రైళ్లను కేంద్రం రద్దు చేసిందని, అన్ని మెట్రో స్టేషన్లను మూసివేయించిందని సాధారణ పౌరులకు రవాణా సౌకర్యాలు లేకుండా చేశారని పేర్కొన్నారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చే నెపంతో జమ్మూ కాశ్మీర్ నుంచి ప్రత్యేక బలగాలను ఢిల్లీకి రప్పించి, రాజధాని నగరంలో భయాందోళనకర వాతావరణాన్ని సృష్టించారని మండిపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+