డయాబెటిస్ ఉన్నవారు అరటిపండు తినొచ్చా?
అరటిపండు పోషకాలు పుష్కలంగా ఉండే పండు. అటువంటి అరటిపండు మధుమేహం (Diabetes) ఉన్నవారికి మంచిదా కాదా అనే సందేహాలు చాలా మందిలో ఉన్నాయి. భారతదేశంలో డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు పండ్లు తినే విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అరటిపండును ఇతర పండ్లతో పోల్చి చూస్తే డయాబెటిస్ ఉన్నవారికి మంచిది కాదనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. ఇప్పుడు అసలు వాస్తవం ఏంటి? అనే దాని గురించి మనం తెలుసుకుందాం.
అరటిపండులో ఫుల్ పోషకాలు
అరటిపండులో చాలా పోషకాలు ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి చాలా దోహదం చేస్తాయి, అరటిపండులో పిండి పదార్ధాలు ఎక్కువగా ఉంటాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిని పెంచే అవకాశం ఉంది. అయితే, ఇతర పండ్లైన ఆపిల్, నారింజ, బేరి పండ్లలో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల చక్కెర స్థాయి నెమ్మదిగా పెరుగుతుంది. కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు వీటిని తీసుకోవడం మంచిది.

అరటిపండులో గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువ
కానీ అరటిపండు తినడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది. కానీ ఇది ఎక్కువసేపు ఉండదు. అదే ఆపిల్ లేదా నారింజ వంటి పండ్లను తింటే నెమ్మదిగా జీర్ణమై ఎక్కువసేపు శక్తిని ఇస్తాయి. ఇది కూడా ఒక ముఖ్యమైన అంశం. గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది ఆహారంలోని చక్కెర శాతం రక్తంలో ఎంత త్వరగా కలుస్తుందో తెలిపే సూచిక. అరటిపండు యొక్క గ్లైసెమిక్ ఇండెక్స్ 51 నుండి 55 వరకు ఉంటుంది.
అరటిపండులో తక్కువ ఫైబర్
ఇది మధ్యస్థాయి గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగిన ఆహారం. ఆపిల్, నారింజ వంటి పండ్ల గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇవి డయాబెటిస్ ఉన్నవారికి సురక్షితమైనవి.కానీ అరటిపండు కాస్త వీటితో పోలిస్తే కాస్త ఎక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువ. ఇక ఫైబర్ కంటెంట్ విషయంలో కూడా అరటిపండ్లు ఆపిల్, నారింజ వంటి పండ్ల కంటే తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ కలిగి ఉంటుంది.
అరటిపండు తినొచ్చు కానీ మితంగా
డయాబెటిస్ ఉన్నవారు ఫైబర్ అధికంగా ఉండే పండ్లను ఎంచుకోవడం ఉత్తమం. పోషకాల రీత్యా చూసినప్పుడు అరటి పండులో చాలా పోషకాలు ఉంటాయి. అందుకే డయాబెటిస్ ఉన్నవారు అరటిపండును మితంగా తీసుకోవచ్చు. ఒకేసారి ఎక్కువ తినకుండా చిన్న ముక్కలుగా తీసుకోవడం మంచిది. ఆపిల్, నారింజ, వంటి పండ్లను రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకోవచ్చు.
మధుమేహ బాధితులు... పండ్ల విషయంలో జాగ్రత్త
ఇవి రక్తంలో చక్కెరస్థాయిని నియంత్రించడంలో చాలా బాగా సహాయపడతాయి.మధుమేహం ఉన్నవారు పండ్లను ఎంచుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అరటిపండును మితంగా తీసుకుంటూ, ఇతర ఫైబర్ అధికంగా ఉండే పండ్లను ఎంచుకోవడం ఆరోగ్యానికి మంచిది.












Click it and Unblock the Notifications