బాలిలో ఘోర ప్రమాదం.. యంగ్ హీరోయిన్ వెన్నెముకకు తీవ్ర గాయం!

బాలీవుడ్ డ్రీమ్‌గర్ల్‌‌గా గుర్తింపు పొందిన యంగ్ హీరోయిన్ నుష్రత్ భరూచా ఇండోనేషియాలోని బాలిలో ప్రమాదానికి గురయ్యారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, ఆమె బృందం సాయంతో బాలిలోని సమీప ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో ఆమె వెన్నెముకకు తీవ్రమైన ఫ్రాక్చర్ కావడంతో ప్రస్తుతం అక్కడి ఆస్పత్రిలో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. తమ అభిమాన నటికి తీవ్ర గాయాలైన వార్త బయటకు రావడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Thella Kaagitham Movie Review: తెల్లకాగితం మూవీ రివ్యూ.. లవ్ స్టోరీకి కొత్త టచ్!
Thella Kaagitham Movie Review: తెల్లకాగితం మూవీ రివ్యూ.. లవ్ స్టోరీకి కొత్త టచ్!

నుష్రత్ ఆరోగ్య పరిస్థితిపై టీమ్ అధికారిక ప్రకటన
ప్రమాదం అనంతరం నుష్రత్ భరూచా ఆరోగ్య పరిస్థితిపై ఆమ్ టీమ్ ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం ఆమె బాలిలోని ఆస్పత్రిలో ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు. వెన్నెముకకు తీవ్ర గాయం కావడంతో ఆమెకు శస్త్రచికిత్స అవసరమని వైద్యులు నిర్ధారించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యాన్ని స్థిరంగా ఉంచడం, అవసరమైన అత్యవసర వైద్య సంరక్షణ అందించడమే తమ మొదటి ప్రాధాన్యత అని నటి టీమ్ వెల్లడించింది.

Nushrratt Bharuccha Injured in Bali Accident Actress Suffers Spine Fracture Airlifted to Mumbai

ముంబైకి ఎయిర్‌లిఫ్ట్ ఏర్పాట్లు
బాలిలో ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం తదుపరి ప్రధాన శస్త్రచికిత్సను ఇండియాలోనే నిర్వహించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో ఆమెను బాలి నుంచి ముంబైకి విమానంలో అత్యవసరంగా తరలించేందుకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ముంబైలోని ప్రముఖ ఆస్పత్రిలో ఆమెకు వెన్నెముక సర్జరీ జరగనుంది.

ప్రాజెక్టులపై ప్రభావం, ఆర్థిక నష్టం
గాయం తీవ్ర దృష్ట్యా, శస్త్రచికిత్స తర్వాత నుష్రత్ భరూచా కోలుకోవడానికి కొన్ని వారాల పాటు పూర్తి విశ్రాంతి అవసరమని వైద్యులు స్పష్టం చేశారు. దీంతో ఆమె రాబోయే కొన్ని వారాల పాటు షూటింగ్‌లకు, ఇతర సినీ కార్యక్రమాలకు దూరంగా ఉండనున్నారు. సరైన సమయానికి పని బాధ్యతలను పూర్తి చేయలేకపోవడం, డేట్స్ రీషెడ్యూల్ కావడం వల్ల ఆమె భారీగా ఆర్థిక నష్టాలను చవిచూసే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Don’t Trouble the Trouble Movie Review: డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ రివ్యూ.. హిట్టా.. ఫట్టా?
Don’t Trouble the Trouble Movie Review: డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ రివ్యూ.. హిట్టా.. ఫట్టా?

అభిమానుల ప్రార్థనలు
ఈ క్లిష్ట సమయంలో మీడియా, అభిమానులు నటి ప్రైవసీని గౌరవించాలని ఆమె టీమ్ విజ్ఞప్తి చేసింది. సర్జరీ, రికవరీపై దృష్టి పెట్టేందుకు ఆమెకు తగినంత సమయం ఇవ్వాలని కోరారు. నుష్రత్ భరూచా త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ సోషల్ మీడియా వేదికగా అభిమానులు, బాలీవుడ్ ప్రముఖులు ప్రార్థనలు చేస్తున్నారు.

సినీ ప్రస్థానం
'ప్యార్ కా పంచనామా', 'ప్యార్ కా పంచనామా 2' సినిమాలతో బాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నుష్రత్ భరూచా.. ఆ తర్వాత 'సోను కే టిటు కి స్వీటీ', 'డ్రీమ్ గర్ల్' వంటి వరుస సూపర్ హిట్ సినిమాలతో స్టార్ హీరోయిన్ గా ఎదిగారు. ప్రస్తుతం ఆమె చేతిలో పలు కీలకమైన ప్రాజెక్టులు ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+