మోర్ డేంజర్- ఆ వెయిట్ లాస్ డ్రగ్ పై కేంద్రం హెచ్చరిక
దేశీయ మార్కెట్‌లోకి ఇటీవలే విడుదలైన బరువు తగ్గించే జీఎల్పీ 1 (GLP-1) ఆధారిత జనరిక్ ఔషధాలపై వ్యక్తమవుతున్న ఆందోళనలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. కొద్దిసేపటి కిందటే కీలక ప్రకటన విడుదల చేసింది. ఈ మందుల అనధికార విక్రయాలు, ప్రచారంపై నిఘాను మరింత కఠినతరం చేసినట్లు తెలిపింది. ఈ జీఎల్పీ 1 ఔషధాల సప్లై చైన్ లో నైతిక ఔషధ పద్ధతులను నిర్ధారించడానికి డ్రగ్స్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా నిఘాను ముమ్మరం చేసినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
రిటైల్ దుకాణాలు, ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్, బల్క్ డ్రగ్ వ్యాపారులు, వెల్‌నెస్ క్లినిక్‌ల ద్వారా ఈ మందులు విరివిగా అందుబాటులో ఉండటం పట్ల ఆందోళన వ్యక్తం చేసింది. సరైన వైద్య పర్యవేక్షణ లేకుండా ఈ మందులు వాడితే తీవ్రమైన ప్రతికూల ప్రభావాలు, సంబంధిత ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చని అధికారులు హెచ్చరించారు. ఈ నిఘా మరింత ముమ్మరమౌతుందని, నిబంధనల ఉల్లంఘనలను తీవ్రంగా పరిగణిస్తామని స్పష్టం చేసింది.

ఉల్లంఘనలకు పాల్పడిన వారి లైసెన్సులను రద్దు చేయడంతో పాటు జరిమానాలను విధిస్తామని అధికారులు వెల్లడించారు. చట్టాల ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఫార్మాస్యూటికల్ సప్లై చైన్ వ్యాప్తంగా ఈ ఉల్లంఘనలు, ఇతర అక్రమ వ్యాపార లావాదేవీలను అరికట్టడానికి తక్షణమే డ్రగ్స్ కంట్రోలర్ విభాగం రంగంలోకి దిగిందని తెలిపింది. అనధికార విక్రయాలు, అనవసర, అధిక వినియోగాన్ని నిరోధించడానికి రాష్ట్ర స్థాయి సంస్థలతో కలిసి నిర్దుష్ట చర్యలను ప్రారంభించారని వివరించింది.
దీనికి సంబంధించి ఈ నెల 10వ తేదీన ఓ కాంప్రహెన్సివ్ అడ్వైజ్ డాక్యుమెంట్ ను ఈ వెయిట్ లాస్ డ్రగ్ తయారీదారులకూ జారీ చేసిన విషయాన్ని గుర్తు చేసింది. వినియోగదారులను తప్పుదారి పట్టించేలా లేదా డాక్టర్ సలహాలు, పర్యవేక్షణలో గానీ ఈ డ్రగ్ వినియోగాన్ని ప్రోత్సహించే పరోక్ష ప్రకటనలు, ఇతర ప్రచార రూపాలను నిషేధించినట్లు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ మధ్యకాలంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ కార్యకలాపాలు గణనీయంగా పెరిగాయని, ఆన్‌లైన్ ఫార్మసీ గోడౌన్లు, బల్క్ డ్రగ్ వ్యాపారులు, రిటైలర్లు, వెల్‌నెస్, స్లిమ్మింగ్ క్లినిక్‌లతో సహా 49 సంస్థలలో ఆడిట్‌లు, తనిఖీలు నిర్వహించామని పేర్కొంది.
ఆరోగ్య భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తోన్నామని, డాక్టర్ల సలహాలు, వారి పర్యవేక్షణ లేకుండా బరువు తగ్గించే మందులను దుర్వినియోగం చేయడం తీవ్ర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని హెచ్చరించింది. అర్హత కలిగిన వైద్య నిపుణుల మార్గదర్శకత్వంలో మాత్రమే అటువంటి మందులను ఉపయోగించాలని పౌరులకు సూచించింది. భారత్‌లో ఈ ఔషధాన్ని ఎండోక్రినాలజిస్టులు, ఇంటర్నల్ మెడిసిన్ నిపుణులు మాత్రమే సిఫార్సు చేయాలనే షరతుతో దీన్ని ఆమోదించినట్లు పేర్కొంది.
-
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్!












Click it and Unblock the Notifications