చికెన్ Vs గుడ్లు: బరువు తగ్గాలంటే ఏది బెస్ట్?
ఇటీవల కాలంలో ఒబేసిటీ అతిపెద్ద సమస్యగా మారింది. బరువు తగ్గాలని భావించేవారు ఆహారం విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే బరువు తగ్గడానికి ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవాలని న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు. బరువు తగ్గాలని లక్ష్యంగా పెట్టుకున్న వారు ప్రోటీన్ పుష్కలంగా ఉండే ఆహారాలు అయిన చికెన్ లేదా గుడ్లు ఏది తింటే మంచిది అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తున్న ప్రశ్న.
చికెన్ vs గుడ్లు .. చికెన్ లో పోషకాలు ఇలా
ప్రస్తుతం మనం ఈ రెండిట్లో ఏది మంచిదో, ఏది తింటే త్వరగా బరువు తగ్గుతారో తెలుసుకుందాం. చికెన్ తక్కువ కొవ్వు కలిగి ఉంటుంది. బరువు తగ్గాలని భావించే వారికి చికెన్ ఒక మంచి ఆహారం. 100 గ్రాముల వండిన చికెన్ బ్రెస్ట్ లో సుమారుగా 165 క్యాలరీలు, 31 గ్రాముల ప్రోటీన్, 3.6 గ్రాముల కొవ్వు, సున్నా కార్బోహైడ్రేట్లు ఉంటాయి.

కోడిగుడ్డులో పోషకాలు ఇలా
ఇది ప్రోటీన్, నియాసిన్, విటమిన్ b6, భాస్వరం, సెలీనియం వంటి విటమిన్లు మరియు ఖనిజాలకు అద్భుతమైన మూలంగా ఉంటుంది. ఇక 100గ్రాముల ఉడికించిన కోడిగుడ్డులో దాదాపు 155క్యాలరీలు 12.6గ్రాముల ప్రోటీన్ 10.6 గ్రాముల కొవ్వు 1.12గ్రాముల కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఇది ఏ, డి,ఈ, కే, బి1, బి2, బి3, బి6, బి9, బి12 అనేక ముఖ్యమైన విటమిన్లు ఖనిజాలను అందిస్తుంది. చికెన్ గుడ్లు రెండు మంచి ప్రోటీన్ సోర్సులు.
బరువు తగ్గాలంటే ఇదే బెస్ట్
అయినా బరువు తగ్గాలని లక్ష్యంగా పెట్టుకునే వారికి చికెన్ కంటే గుడ్లు బెస్ట్ అని చెబుతారు. ఎందుకంటే గుడిలో తక్కువ క్యాలరీలు, అధిక ప్రోటీన్ ఉంటుంది. ఇది ఎక్కువసేపు ఆకలి కాకుండా చేస్తుంది. గుడ్లు బడ్జెట్ ఫ్రెండ్లీ గా కూడా ఉంటుంది. కనుక బరువు తగ్గాలనుకునే వారికి గుడ్లు ఎక్కువగా ఫలితం చూపిస్తుంది.
చికెన్ ను ఇలా తింటే బరువు తగ్గకపోవచ్చు
చికెన్ లీన్ ప్రోటీన్ తో కూడుకుని ఉంటుంది. అయితే చికెన్ ఎక్కువగా తక్కువ నూనెతో ఉడికించుకొని తినడం వంటివి చేస్తేనే ఫలితం బాగుంటుంది. ఫ్రై లు, డీప్ ఫ్రై లు చేస్తే, బిర్యానీలు చేస్తే మనకు తెలియకుండానే ఎక్కువగా తీసుకుంటాం. కాబట్టి చికెన్ బరువు తగ్గడానికి అంత ప్రయోజనాలను చేకూర్చకపోవచ్చు. అయితే ఈ రెండింటిని ఒక ప్లాన్ ప్రకారం తీసుకుంటే కూడా చక్కగా బరువు తగ్గొచ్చు అని డైటీషియన్లు చెబుతున్నారు.
చికెన్, గుడ్లు రోజూ ఇలా తింటే బరువుకు చెక్
ప్రతిరోజు ఉదయం రెండు గుడ్లు ఉడికించినవి కానీ లేదా ఆమ్లెట్ వేసుకుని కానీ బ్రేక్ ఫాస్ట్ గా తీసుకోవాలి. మధ్యాహ్నం 100 నుండి 150 గ్రాముల చికెన్ ఉడికించి కానీ గ్రిల్ చేసుకుని కానీ తినాలి. ఇక రాత్రికి గుడ్లతో సలాడ్ చేసుకుని కానీ, సూప్ చేసుకుని కానీ తాగితే బరువు బాగా తగ్గుతారు.
-
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్‌గా ప్రమోషన్












Click it and Unblock the Notifications