చింతచిగురు ఎండు రొయ్యల కూర.. ఇలా వండితే మీరు అసలే వదిలిపెట్టరు!

తెలుగువారు ప్రత్యేకంగా చేసుకునే వంటలలో మనకు ఆరోగ్యాన్ని ఇచ్చే పోషకాలు ఇచ్చే వంటలు మాత్రమే కాదు రుచిని అందించే వంటలు కూడా చాలా ఉంటాయి. ఎండు రొయ్యలు ప్రోటీన్, ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ మరియు విటమిన్లతో నిండి ఉంటే, చింతచిగురు లో ఉండే పోషకాలు మన శరీరానికి కావలసిన అద్భుతమైన ప్రయోజనాలను చేకూరుస్తాయి.

చింత చిగురు,ఎండు రొయ్యలు కూర

ఈ రెండూ కలిపి చేసే చింత చిగురు, ఎండు రొయ్యల కూర ఎలా వండితే బాగుంటుంది? ఎలా వండితే ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి? ముఖ్యంగా వేసవికాలంలో ఈ ఎండు రొయ్యలు, చింతచిగురు కూర తినటం ఎంత ప్రత్యేకం అనేది ప్రస్తుతం తెలుసుకుందాం.

chintachiguru endu royyalu this is the making process for tasty and healthy chinta chiguru endu royyala recipe

కావలసిన పదార్థాలు

చింతచిగురు- రెండు కప్పులు శుభ్రంగా కడిగి తుంచి పెట్టుకున్నది
ఎండు రొయ్యలు- ఒక కప్పు
ఉల్లిపాయ- ఒకటి పెద్దది సన్నగా తరిగినది
పచ్చిమిరపకాయలు- నాలుగు
పసుపు- పావు టీ స్పూన్
ఉప్పు- తగినంత
కారంపొడి- ఒక టీ స్పూన్
వెల్లుల్లి రెబ్బలు- 5
నూనె - రెండు టేబుల్ స్పూన్లు
ఆవాలు, జీలకర్ర - తాలింపు కోసం
కరివేపాకు- కొద్దిగా

తయారీ విధానం

ముందుగా ఎండు రొయ్యలను వేడి నీటిలో పది నిమిషాలు నానబెట్టి శుభ్రంగా కడగాలి. స్టవ్ పైన పాన్ పెట్టి అందులో నూనె వేసి నూనెలో ఆవాలు జీలకర్ర మరియు కరివేపాకు వేసి వేయించాలి ఆపై అందులో కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి, ఉల్లి పాయ ముక్కలు పచ్చిమిరపకాయలు వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. ఆపై ఎండు రొయ్యలు వేసి మూడు నుండి నాలుగు నిమిషాల పాటు వేయించాలి.

ఇలా చేస్తేనే రుచిగా చింతచిగురు ఎండు రొయ్యల కూర

తర్వాత అందులో పసుపు ఉప్పు కారం వేసి కలపాలి.కొద్దిసేపు వేగిన తర్వాత చివరగా చింతచిగురు వేసి మూతపెట్టి మీడియం ఫ్లేమ్ లో ఎనిమిది నుంచి పది నిమిషాల పాటు ఉడికించాలి. చింతచిగురు మెత్తబడిన తర్వాత కావాలంటే కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకోవచ్చు. అంతే చింతచిగురు ఎండు రొయ్యల కూర తయారైనట్లే. వేడివేడి అన్నంలో ఈ కూర చాలా రుచిగా ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+