రోజుకు ఎంత వంట నూనె వాడాలి, ఏది మంచిది- పరిమితి మించితే..!!
వంటల్లో నూనె తప్పనిసరి. వంటకు నూనె ఎంత ముఖ్యమూ... ఆరోగ్యాన్ని కాపాడుకోవటంలోనూ వంట నూనె కీలకమైనది. గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో వంట నూనె వినియోగం.. పరిమితి చాలా ముఖ్యం. ఎక్కువ నూనె వాడటం వల్ల కొలెస్ట్రాల్ పెరిగి.. గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. నూనెను పదే పదే వేడి చేయడం లేదా అధికంగా వాడటం గుండెకు హానికరం. వంట నూనె వినియోగం.. ఎంత మేర వినియోగించాలి.. ఎంత వరకు పరిమితం చేసుకోవాలనే అంశాల పైన నిపుణులు స్పష్టత ఇస్తున్నారు.
వంటనూనె వినియోగం విషయంలో కొన్ని జాగ్రత్తలు అవసరం. నూనెను పదే పదే వేడి చేయడం లేదా అధికంగా వాడటం గుండెకు హానికరం. ఇటీవలి కాలంలో గుండెపోటు కేసులు పెరగడానికి అధిక నూనె వినియోగం కూడా ఒక కారణంగా నిపుణులు భావిస్తున్నారు. నిపుణుల లెక్కల ప్రకారం ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి రోజుకు సుమారు 25 నుండి 30 మిల్లీలీటర్ల (సుమారు 2 టేబుల్ స్పూన్లు) నూనె మాత్రమే తీసుకోవాలి. వారానికి మొత్తం 150 నుండి 170 మిల్లీ లీటర్ల నూనె సరిపోతుంది. ఈ పరిమాణంలో వంట నూనెతో పాటు వేయించిన ఆహారం, బేకరీ పదార్థాలు, ప్రాసెస్డ్ ఫుడ్‌లో ఉండే నూనె కూడా లెక్కలోకి వస్తుంది. అధికంగా నూనె తీసుకోవడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది.

నిపుణుల సూచనలు
దీనివల్ల గుండెపోటు ప్రమాదం పెరుగుతుంది. స్ట్రోక్ వచ్చే అవకాశం కూడా పెరుగుతుంది. అలాగే ఊబకాయ సమస్య తలెత్తడంతో పాటూ అధిక రక్తపోటు, మధుమేహ ప్రమాదం పెరుగుతుంది. వంట నూనె వినియోగం లో కొన్ని జాగ్రత్తలు అవసరం. ఆలివ్ నూనె, వేరుశెనగ నూనె, నువ్వుల నూనె, చియా సీడ్ ఆయిల్, అవోకాడో ఆయిల్ వంటివి వినియోగిస్తే మంచిదని సూచిస్తున్నారు. అదే సమయంలో కొన్ని జాగ్రత్తలు సూచిస్తున్నారు. నూనెను పదే పదే వేడి చేయకూడదు. నాన్ స్టిక్ లేదా ఇనుప పాత్రలు వాడితే తక్కువ నూనె సరిపోతుంది. నూనెను చెంచాతో కొలిచి వాడాలి. వేయించిన ఆహారం, జంక్ ఫుడ్ తగ్గించాలి. తక్కువ నూనె వాడటం, సరైన నూనె ఎంపిక చేయడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని చాలా వరకు కాపాడుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications