ఖాళీ కడుపుతో ఈ వాటర్ తీసుకుంటే చాలు.. క్లీన్
ధనియా/కొత్తిమీర వాటర్ జీర్ణవ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు, బరువు తగ్గడానికి దోహదపడుతుంది. శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపడంలోనూ ఇది ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఈ పానీయాన్ని ఎంతకాలం వాడాలి అనే సంశయం చాలామందిలో ఉంది. ఈ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల మరింత ప్రభావం చూపుతుంది ధనియా వాటర్.
ధనియాల నీటిని తయారుచేయడం సులభం. వాటిని నీటిలో నానబెట్టి లేదా మరిగించి, ఆపై వడకట్టడం ద్వారా దీన్ని తయారు చేసుకోవచ్చు. ఈ పానీయం అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ధనియాల నీటిలో పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్, ఫ్లేవనాయిడ్లు, విటమిన్ సీ, కే, ఐరన్ వంటి పోషకాలు ఉన్నాయి. ఇవన్నీ జీర్ణక్రియను మెరుగుపరచి, శరీరంలో మంటను తగ్గించడంలో సహాయపడతాయి.

ధనియాల నీటిని ఎంతకాలం తాగాలి అనే విషయంపై నిపుణులు సూచనలు చేశారు. జీర్ణవ్యవస్థను పటిష్టం చేసుకోవడానికి లేదా గ్యాస్ట్రిక్ సమస్యలు, కడుపు ఉబ్బరం తగ్గించుకోవడానికి ఈ పానీయాన్ని రెండు వారాల పాటు నిరంతరాయంగా సేవించవచ్చు. బరువు తగ్గించుకోవడానికి లేదా జీవక్రియను మెరుగుపరచుకోవడానికి కొత్తిమీర నీటిని ఉపయోగిస్తుంటే, ఒక నెల పాటు నిరంతరంగా తాగాలి. 15 రోజులు లేదా ఒక నెల వాడిన తర్వాత ఒక వారం విరామం తీసుకోవడం వల్ల శరీరం ఒకే పోషకంపై ఆధారపడదు.
ఆయుర్వేదం ప్రకారం, ధనియా/కొత్తిమీర సాధారణంగా ప్రయోజనకరమైనది, పెద్దగా దుష్ప్రభావాలు ఉండవు. దీనిని అతిగా సేవించడం వల్ల కొన్ని ప్రతికూలతలు తలెత్తవచ్చు. ముఖ్యంగా, అధిక మోతాదులో చాలా రోజుల పాటు తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు గణనీయంగా తగ్గే ప్రమాదం ఉంటుంది. తక్కువ రక్తపోటు ఉన్నవారు కొత్తిమీర నీరు తాగితే మైకం రావచ్చు. కొత్తిమీర అలర్జీ ఉన్నవారు ఈ పానీయం తాగకుండా ఉండాలి. కాబట్టి, దీన్ని నిరంతరం కాకుండా, మధ్యమధ్యలో విరామాలిస్తూ తాగడం మంచిదని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు.
ఈ వాటర్ ను ఇలా తయారుచేయాలంటే- ముందుగా ఒక టీస్పూన్ ధనియాలను ఒక గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టాలి. ఉదయం ఆ నీటిని గింజలతో సహా 5-7 నిమిషాల పాటు మరిగించి, వడకట్టాలి. కొద్దిగా చల్లారిన తర్వాత దానిని తాగవచ్చు. మంచి ఫలితాల కోసం కొత్తిమీర నీటిని ఉదయం ఖాళీ కడుపుతో తాగడం శ్రేయస్కరం. దీనివల్ల అందులోని క్రియాశీల సమ్మేళనాలు శరీరానికి బబాగా అందుతాయి. గరిష్ట ప్రయోజనాలు చేకూరుతాయి.












Click it and Unblock the Notifications