ఉప్పు vs పంచదార: పెరుగు లో ఏది కలిపి తింటే ఏం జరుగుతంది..!?
ఆహారంలో పెరుగు ఒక ముఖ్యమైన భాగం. పెరుగు అత్యంత శక్తివంతమైన ప్రోబయోటిక్. పెరుగు శరీరాన్ని చల్లబరుస్తుంది , జీర్ణ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. రకరకాల కడుపు సమస్యలకు కూడా అద్భుతంగా మేలు చేస్తుంది. కొంతమంది పెరుగును ఉప్పుతో తినడానికి ఇష్టపడితే, మరికొందరు పెరుగును చక్కెరతో తినడానికి ఇష్టపడతారు. ఈ రెండింటిలో ఏది ఆరోగ్యానికి మంచిదనే సందేహం ఉంది. దీనికి నిపుణులు స్పష్టత ఇస్తున్నారు.
పెరుగు ప్రతిరోజూ కనిపించే ఆరోగ్యకరమైన పదార్థం. తాజా పెరుగు మన జీర్ణవ్యవస్థకు ఉపశమనం కలిగిస్తుంది. పెరుగులో ఉప్పు కలిపినప్పుడు, అందులో ఉండే లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియాపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఈ బ్యాక్టీరియా జీర్ణవ్యవస్థకు చాలా అవసరం. ఇది చనిపోయితే, పెరుగులోని ప్రోబయోటిక్ విలువలు తగ్గిపోతాయి. తినేటప్పుడు రుచికి తగ్గట్టుగా చిన్న మోతాదు లో నల్ల ఉప్పు లేదా సైంధవ లవణం వాడాలి. సాధారణ టేబుల్ సాల్ట్ అయితే తప్పనిసరిగా నివారించాలి. కొంతమందికి ఉప్పుతో కూడిన పెరుగు చాలా సులభంగా జీర్ణమవుతుంది. అయితే అధికంగా ఉప్పు తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. అందువల్ల అధికంగా ఉప్పు ఉన్న పెరుగును తినడం పూర్తిగా మానుకోవాలి.

నిపుణుల సూచనలు
పెరుగు , పంచదారల కలయిక కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించి, పెరుగు రుచిని అద్భుతంగా పెంచుతుంది. పంచదార పెరుగులోని పులుపును తగ్గిస్తుంది, దీనివల్ల తీపి ఇష్టపడేవారికి ఇది మరింత ఇష్టమైనదిగా మారుతుంది. పంచదార కలపడం వల్ల పెరుగులోని చల్లదనం కూడా తగ్గుతుంది, ఇది వేసవి కాలంలో శరీరాన్ని చల్లగా ఉంచడంలో సహాయపడుతుంది. అయితే చక్కెరను అధికంగా తీసుకోవడం ఆరోగ్యానికి అస్సలు ప్రయోజనకరం కాదు. అందువల్ల పెరుగు , చక్కెరను ఎల్లప్పుడూ మితంగానే తీసుకోవాలి. కొంద రికి పెరుగు శారీరకంగా హానికరంగా ఉండొచ్చు. కీళ్ల వాతం, ఉబ్బసం, కీళ్ల నొప్పులు ఉన్నవారు, కిడ్నీ సమస్యలతో బాధపడే వారితో పాటుగా తరచుగా జలుబు, దగ్గుతో బాధపడేవారి పెరుగు తినటం వలన సమస్య తీవ్రత పెరిగే అవకాశం ఉంటుంది.













Click it and Unblock the Notifications