అరటిపండుతో సహా ఈ పండ్లు తిన్న వెంటనే నీళ్ళు తాగొద్దు... ఎందుకంటే!
చాలామంది ఏదైనా తిన్న తర్వాత వెంటనే నీళ్లు తాగుతూ ఉంటారు. ఇక కొంతమంది ఏదైనా తింటే నీళ్లు తాగకూడదని తిన్నాక ఒక అరగంట తర్వాత నీళ్లను తాగుతారు. అయితే ఆహారం తినేటప్పుడు, తిన్న వెంటనే నీళ్లను తాగకుండా ఉంటేనే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
పండ్లు తిన్న తర్వాత నీళ్లు తాగితే ఏం జరుగుతుంది?
ముఖ్యంగా ఏదైనా పండ్లు తిన్న తర్వాత నీళ్లు తాగితే ఏం జరుగుతుంది? పండ్లు తిని నీళ్లను తాగడం మంచిదేనా? ఏ పండ్లు తిన్న తర్వాత నీళ్లను వెంటనే తాగకూడదు? వంటి అనేక వివరాలను ప్రస్తుతం మనం తెలుసుకుందాం. ఆయుర్వేదం ప్రకారం పండ్లు తిన్న తర్వాత పొరపాటున కూడా నీళ్లను తాగకూడదు.

అరటిపండు తిని నీళ్ళు తాగుతున్నారా?
అటువంటి పండ్లలో మొదటి చెప్పుకోవాల్సింది అరటిపండు. అరటిపండు తిని నీళ్లను తాగితే మన జీర్ణ వ్యవస్థ పాడవుతుంది. అరటిపండు తిన్న తర్వాత నీళ్లను తాగడం వల్ల టాక్సిక్ ఎఫెక్ట్ కూడా వచ్చే ప్రమాదం ఉంది. కడుపు ఉబ్బరం గ్యాస్ వంటి సమస్యలతో ఇబ్బంది పడే ప్రమాదం ఉంది.
సిట్రస్ పండ్లు తిని నీళ్ళు తాగితే
ఇక సిట్రస్ పండ్లను తిన్న తర్వాత కూడా వెంటనే మనం నీళ్లను తాగడం మంచిది కాదు. సిట్రస్ పండ్లు అయిన నారింజ, బత్తాయి, కమలా వంటి పండ్లను, ఉసిరికాయలను తిన్న తర్వాత నీళ్లను తాగితే మన జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది. మన పీహెచ్ బ్యాలెన్స్ చెడిపోతుంది. కాబట్టి సిట్రస్ పండ్లను తిన్న తర్వాత పొరపాటున కూడా నీళ్లను తాగకూడదు.
పుచ్చపండు తిని నీళ్ళు తాగితే జరిగేదిదే
చాలామంది పుచ్చపండు తిన్న తర్వాత కూడా నీళ్లను తాగుతూ ఉంటారు. పుచ్చకాయలో దాదాపు 90 నుండి 95 శాతం వరకు నీరు ఉంటుంది. ఇక పుచ్చకాయ తిన్న తర్వాత నీళ్లను తాగితే కడుపు ఉబ్బరంగా మారుతుంది. కడుపునొప్పి లేదా అజీర్ణ సమస్యలతో ఇబ్బంది పడాల్సి వస్తుంది. ముఖ్యంగా పండ్లను ఆహారంలో భాగంగా తీసుకునేవారు పండ్లు తిన్న వెంటనే నీటిని తాగకుండా ఉంటేనే మంచిది.
పండ్లు తిన్నా, పాలు తాగినా ఈ పని చెయ్యొద్దు
ఇక ఈ పండ్లు మాత్రమే కాదు పాలు తాగిన తర్వాత కూడా నీటిని తాగకూడదు. దీనివలన జీర్ణ క్రియ మందగించి ఎసిడిటీ, అజీర్ణానికి దారి తీస్తుంది. కనుక పండ్లు తిన్నా, పాలు తాగినా వెంటనే నీళ్ళు తాగకండి.ఇది మీకు అనారోగ్య సమస్యలకు కారణం అవుతుంది.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications