Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కోపం, విచారం, దుఃఖం వంటి భావోద్వేగాలు ఆరోగ్యానికి ఎంత హాని చేస్తాయో తెలుసా?

తన కోపమే తన శత్రువు అని చెబుతుంటారు. అంటే కోపం వల్ల మనిషికి తీరని నష్టం జరుగుతుందని అర్థం. అలాగే ఎప్పుడూ ఏడుస్తూ ఉండడం మంచిది కాదని, విచారంగా ఉండడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు. మనిషికి భావోద్వేగాలు ఉండాలి కానీ, అవసరానికి మించి ఉంటే అనర్థానికి దారితీస్తుందని చెబుతున్నారు. ఇక భావోద్వేగాలు మనిషి శరీరం పై ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తాయి అనేది ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

 విపరీతంగా కోపం.. అనర్ధాలు ఇవే

విపరీతంగా కోపం.. అనర్ధాలు ఇవే

భయం, కోపం, బాధపడటం వంటి భావోద్వేగాలు మనిషి ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తాయి. అందుకే ఈ భావోద్వేగాలను కంట్రోల్ చేసుకోవడం చాలా ముఖ్యమైన విషయం. కుటుంబ సభ్యులకు విపరీతంగా కోపం ఉండడంవల్ల ఇంటి వాతావరణం దెబ్బతింటుంది. పిల్లలు ఆరోగ్యంగా పెరగరు. వారి మానసిక ఆరోగ్యం పైన తీవ్ర ప్రభావం పడుతుంది. విపరీతంగా కోపంతో కాలేయం బలహీనపడుతుంది. విపరీతంగా కోపం పెరగడం వల్ల బీపీ బాధితులుగా మారతారు. బీపీ అధికమైనప్పుడు అది పక్షవాతం వంటి సమస్యలకు కూడా కారణమవుతుంది.

 దుఃఖంతో బోలెడు అనారోగ్య సమస్యలు

దుఃఖంతో బోలెడు అనారోగ్య సమస్యలు


ఇక విపరీతంగా ఏడవడం కూడా ఆరోగ్యానికి హాని చేస్తుంది. విపరీతంగా ఏడవడం వల్ల అది ఊపిరితిత్తులను బలహీనపరుస్తుంది. కళ్ళకు ఇబ్బంది కలిగిస్తుంది. విపరీతమైన దుఃఖం మనిషి ఆలోచనను నాశనం చేస్తుంది. నరాలకు సంబంధించిన అనారోగ్యాలకు కారణమవుతుంది. ఇక ఎప్పుడూ నిరాశ నిస్పృహలతో ఉండడంవల్ల అది పొట్టను బలహీనపరుస్తుంది. ఏదైనా తింటే జీర్ణం చేసుకోలేని పరిస్థితి వస్తుంది. ఏదైనా తినాలి అన్న ఆసక్తి కూడా తక్కువ అవుతుంది.

ఒత్తిడి, భయం వల్ల కలిగే ఫలితాలు ఇలా

ఒత్తిడి, భయం వల్ల కలిగే ఫలితాలు ఇలా


ఇక విపరీతమైన ఒత్తిడి వల్ల గుండె, మెదడు రెండు బలహీనమవుతాయి. ఒత్తిడి తగ్గించుకోవాలని ఎంత చెప్తున్నా ఇప్పుడు మనుషుల్లో విపరీతంగా ఒత్తిడి పెరుగుతుంది.దీంతో ఇబ్బంది తలెత్తుతుంది. ఎక్కువగా భయపడడం వల్ల మూత్రపిండాలు చాలా వీక్ అవుతాయి. కాబట్టి భయాన్ని, కోపాన్ని, దుఃఖాన్ని కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీటిని కంట్రోల్ చేసుకో లేకపోతే మన శరీరంలోని ముఖ్యమైన అవయవాలపై వాటి ప్రభావం కచ్చితంగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.

 ప్రేమ, సంతోషం .. ఆరోగ్యానికి మేలు ఎలా చేస్తాయంటే

ప్రేమ, సంతోషం .. ఆరోగ్యానికి మేలు ఎలా చేస్తాయంటే


ఇక భావోద్వేగాలలో మరికొన్ని భావోద్వేగాలు మనకు మంచిని చేకూరుస్తాయి. మనసుకు శాంతినిస్తాయి. మన ఆరోగ్యాన్ని కాపాడటానికి ఎంతగానో ఉపయోగపడతాయి. అటువంటి భావోద్వేగాలను కలిగివుండటం ఎంతో అవసరం. ఇక అటువంటి భావోద్వేగాలను చూసినట్లయితే వాటిలో ప్రధానంగా చెప్పుకోవలసినవి సంతోషం, ప్రేమ. ఎప్పుడూ సంతోషంగా ఉండడం ఒత్తిడిని తగ్గిస్తుంది. ఎప్పుడూ నవ్వుతూ ఉండే వారిలో అనారోగ్య సమస్యలు చాలా తక్కువగా వస్తాయి. ఇక ప్రేమ శాంతిని, మధురానుభూతిని తీసుకువస్తుంది. ప్రేమ వల్ల మన శరీరం, మెదడు రెండూ బలంగా పని చేసేలా ప్రేరేపించబడుతుంది.

disclaimer: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+