అతిగా బీట్ రూట్ జ్యూస్ తాగితే ఏమవుతుందో తెలుసా!
ఆరోగ్యంపై శ్రద్ధ ప్రతీ ఒక్కరికీ అవసరమే. ఎవరైనా సరే ఆరోగ్యంపై శ్రద్ధతో శరీరానికి మేలు చేసే ఆహారాలపై ఫోకస్ చేస్తున్నారు. అటువంటి వాటిలో బీట్ రూట్ జ్యూస్ ఒకటి. బీట్ రూట్ జ్యూస్ ఆరోగ్యానికి ఎంతో మంచిది. బీట్ రూట్ జ్యూస్ ను డిటాక్స్ డైట్ గా చెబుతారు.
బీట్ రూట్ జ్యూస్ తో ఆరోగ్య ప్రయోజనాలు
బీట్రూట్ జ్యూస్ తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. బరువు తగ్గడానికి, శక్తిని పెంచడానికి బీట్రూట్ జ్యూస్ చాలా ఉపయోగపడుతుందని చాలామంది చెబుతారు. అయితే బీట్రూట్ జ్యూస్ ను అధికంగా తాగడం వల్ల అనేక దుష్ప్రభావాలు వస్తాయని ఇటీవల అధ్యయనాలు వెల్లడించాయి. బీట్రూట్లో పోషకాలు పుష్కలంగా ఉన్నప్పటికీ అధిక మొత్తంలో ఈ జ్యూస్ ను తాగడం అనేక సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు.

బీట్ రూట్ జ్యూస్ ఎక్కువ తాగితే సమస్యలు ఇలా
బీట్రూట్ జ్యూస్ ఖనిజాలు, విటమిన్లు ఫుల్ పోషకాలతో నిండి ఉంటుంది. ఇది రక్త ప్రవాహాన్ని మెరుగుపరచడానికి, రక్తపోటును తగ్గించడానికి ఎంతగానో దోహదం చేస్తుంది. అయినప్పటికీ దీనిని ఎక్కువగా తీసుకోవడం మాత్రం జీర్ణ సమస్యలకు కారణమవుతుందని అధ్యయనాలు తేల్చాయి. కడుపులో ఉబ్బరం, విరోచనాలు వంటి సమస్యలు వస్తాయని అధ్యయనాలు తేల్చాయి.
బీట్ రూట్ తో కిడ్నీలకు హాని
బీట్రూట్ జ్యూస్ ఎక్కువగా తాగడం వల్ల మూత్రం రంగు మారుతుంది. మూత్రం గులాబీ లేదా ఎరుపు రంగులోకి మారే అవకాశం ఉంటుంది. ఒకవేళ అటువంటి పరిస్థితి వస్తే దీనిని బీట్యూరియా అనే హానికరమైన పరిస్థితిగా చెబుతారు. బీట్రూట్లో అధిక ఆక్సలేట్ స్థాయిలు మూత్రపిండాల పైన ప్రభావం చూపించడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుంది. బీట్ రూట్ జ్యూస్ ను అధికంగా తాగితే ఇది మూత్రపిండాలలో రాళ్లకు దోహదం చేస్తుందని భావిస్తున్నారు.
అతిగా బీట్ రూట్ వాడొద్దు
మితిమీరిన బీట్రూట్ జ్యూస్ తాగడం మంచిది కాదని, మన శరీరానికి మేలు చేసేది అయినప్పటికీ దీనిని అధికంగా తాగడం ఆరోగ్యానికి అనర్ధాలను చేకూరుస్తుందని చెబుతున్నారు. ఒక బీట్రూట్ మాత్రమే కాదు ఆహారంలో మనం తీసుకునే ఏ పదార్థం అయినా సరే ప్రయోజనాలు బాగా ఉన్నాయని అతిగా వినియోగించడం మంచిది కాదు.












Click it and Unblock the Notifications