కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఆహారాలు అసలే తినొద్దు!
శరీరంలో మూత్రపిండాలు అత్యంత ముఖ్యమైన అవయవం. ఇవి రక్తాన్ని వడపోసి, వ్యర్థపదార్థాలను మూత్ర రూపంలో బయటకు పంపిస్తూ ఉంటాయి. శరీరంలో ద్రవాల సమతుల్యతను, రక్తపోటును నియంత్రిస్తాయి. ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి సహాయం చేస్తాయి. అటువంటి మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపైన ఉంటుంది. అయితే ఇటీవల కాలంలో మూత్రపిండాల వ్యాధులు బాగా పెరుగుతున్నాయి.
మూత్ర పిండాలను ప్రభావితం చేసే వాటిలో ఇవే డేంజర్
మూత్రపిండాల ఆరోగ్యం కోసం మంచి ఆహారపు అలవాట్లను అలవర్చుకోవాలి. మన మూత్రపిండాలను ప్రభావితం చేసే వాటిలో, మూత్రపిండాలను పాడు చేసే ఆహారాలలో ఫాస్ట్ ఫుడ్స్ ఒకటి. మూత్రపిండ ఆరోగ్య నిపుణులు ఫాస్ట్ ఫుడ్స్ మూత్రపిండాలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తాయని హెచ్చరిస్తున్నారు. బయట విపరీతంగా ఫాస్ట్ ఫుడ్స్ తినడం మూత్రపిండ సంబంధిత ఆరోగ్య సమస్యలకు కారణమవుతున్నదని చెబుతున్నారు.

ఫాస్ట్ ఫుడ్స్ లో అనారోగ్యకరమైన కొవ్వులు, చక్కెరలు
ఈ పెరుగుతున్న సమస్యను ఎదుర్కొనేందుకు ప్రజల అవగాహన మరియు ఆహార మార్పుల అవసరాన్ని నిపుణులు పదే పదే గుర్తు చేస్తున్నారు. మన శరీరంలో బయట తినే ఫాస్ట్ ఫుడ్స్ అనారోగ్యకరమైన కొవ్వులను, చక్కెరలను చేరుస్తాయని, ఇవి మూత్రపిండాల పనితీరుకు హాని చేస్తాయని చెబుతున్నారు. నూడిల్స్ ,ఎగ్ ఫ్రైడ్ రైస్, చికెన్ ఫ్రైడ్ రైస్, ప్రాసెస్ చేసిన ఆహారాలు, ప్రాసెస్ చేసిన మీట్ వంటివి ఎక్కువ తినడం కిడ్నీల ఆరోగ్యాన్ని పాడుచేస్తాయి.
ప్రాసెస్ చేసిన ఆహారాలకు చెప్పండి నో
బయట స్ట్రీట్ ఫుడ్స్ లో ఉపయోగించే ఆయిల్ కూడా మన శరీర ఆరోగ్యాన్ని పాడుచేసి కిడ్నీల పైన ప్రభావాన్ని చూపిస్తుంది. కనుక మూత్రపిండాల ఆరోగ్యం కోసం ఫాస్ట్ ఫుడ్స్ కు, ప్రాసెస్ చేసిన ఫుడ్స్ కు దూరంగా ఉండాలని వైద్య నిపుణులు సలహా ఇస్తున్నారు. ఫాస్ట్ ఫుడ్స్ లో చెడు కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఊబకాయానికి మరియు మధుమేహానికి దారితీయవచ్చు. ఇవి కిడ్నీ వ్యాధికి ప్రధాన కారణంగా మారింది.
కిడ్నీల ఆరోగ్యం విషయంలో జాగ్రత్త
మూత్రపిండాల ఆరోగ్యం కోసం రోజువారి ఆహారంలో పండ్లు, కూరగాయలు మరియు చిరు ధాన్యాలను చేర్చుకోవాలని సలహా ఇస్తున్నారు. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్ల ద్వారా మూత్రపిండాలను పరిరక్షించుకోవచ్చు అని సూచిస్తున్నారు. ముఖ్యంగా కిడ్నీల ఆరోగ్యం విషయంలో అసలే నిర్లక్ష్యం మంచిది కాదని అంటున్నారు.
-
దయచేసి నడవండి.. రోజుకు 7000 అడుగులేయండి.. -
టీలో చక్కెరకు బదులు ఇవి వాడి చూడండి: అస్సలు వదలరు -
పొట్టు మినపప్పుతో రోటిపచ్చడి.. తింటే అసలే వదిలిపెట్టరు! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
ఉపాసన చెప్పిన సింపుల్ స్పెషల్ రాగి జావ.. ఇలా చేస్తే బలం! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!!












Click it and Unblock the Notifications