రోజూ ఈ జ్యూస్ తాగండి.. వంద ఆరోగ్య ప్రయోజనాలు పొందండి!

మనకు అనేక రకాల పండ్ల జ్యూస్ తెలుసు కానీ గోధుమ గడ్డి జ్యూస్ లో ఉన్న పోషకాలు, మిటమిన్లు ఇతర ఏ పండ్ల జ్యూస్ లో కూడా లభించవు. వినడానికి నమ్మశక్యంగా లేకపోయినా గోధుమ గడ్డి జ్యూస్ మన శరీరానికి ఎంతగా ఉపయోగపడుతుందో ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాలి. రోగ నిరోధక వ్యవస్థను అభివృద్ధి పరచడానికి సహాయ పడే మిటమిన్లు A,C,E ఉన్నాయి..

గోధుమ గడ్డి జ్యూస్ తో బోలెడు ఆరోగ్యం
గోధుమ గడ్డి జ్యూస్ కోలాజెన్ ఉత్పత్తిని మెరుగుపరుస్తూ యవ్వనంగా ఉండటానికి దోహదపడుతుంది. మొహం పై మొటిమలు రాకుండా పోరాడుతుంది.ఈ జ్యూస్ లో ఉన్న పోషకాలు జీర్ణ ఎంజైమ్ ల ఉత్పత్తిని మెరుగుపరుస్తూ ఆహారంలోని పోషకాలను శరీరానికి అందించడానికి ఉపయోగపడుతుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతి కలిగిస్తుంది. జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది.

Drink Wheat grass juice daily Get a hundred health benefits

షుగర్ కు, చెడు కొలెస్ట్రాల్ కు చెక్
గోధుమగడ్డి జ్యూస్ యొక్క అతి ముఖ్యమైన ప్రయోజనాలలో రక్తంలో షుగర్ ని తగ్గించడానికి దోహదపడుతుంది. మధుమేహం ఉన్నవారికి ఉపయోగంగా ఉంటుంది. గోధుమ గడ్డి జ్యూస్ ని క్రమం తప్పకుండా తీసుకోవడం వలన ఒంట్లో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ని పూర్తిగా కరిగిస్తుంది.గుండె సంబంధిత వ్యాధులను గోధుమ గడ్డి జ్యూస్ తో చెక్ పెట్టొచ్చు. క్రమం తప్పకుండా జ్యూస్ తాగినట్లయితే కొలెస్ట్రాల్ ను కొంత కంట్రోల్ చేసుకునే గోధుమ గడ్డి జ్యూస్ పనిచేస్తుంది.

రోగ నిరోధక శక్తికి గోధుమ గడ్డి జ్యూస్
పని వలన బాగా ఒత్తిడికి గురయ్యే వారికి ఒత్తిడిని తగ్గించడానికి ఈ జ్యూస్ ఒక మెడిసిన్ లాగా పని చేస్తుంది. రోగ నిరోధక శక్తిని బలోపేతం చేయడంతో అంటువ్యాధులు కానీ ఏ ఇతర వ్యాధులు సోకకుండా ఈ జ్యూస్ మన శరీరంలో నిరంతరం పోరాడుతుంది. నెలసరి సమయాల్లో మహిళలకు అధిక రుతుస్రావం సమస్యను తగ్గించటానికి గోధుమ గడ్డి జ్యూస్ ఉపశమనం కలిగిస్తుంది.

గోధుమ గడ్డిని ఇంట్లోనే పెంచుకోండిలా
చిన్న చిన్న మట్టి పాత్రలు లేదా ఖాళీ డబ్బాలలో చెక్కపొట్టు, వరిపొట్టు ,ఎర్రమట్టి మూడు కలిపి ఒక పాత్రలో వేసి కలిపిన మిశ్రమం పైన గోధుమలు చల్లి మట్టి వేసి, మట్టి తడిసేంతవరకు వాటర్ పోసి ఉదయాన్నే పాత్రలను సూర్యరశ్మికి పెట్టి మధ్యాహ్నం నుండి కొద్దిగా చల్లటి ప్రాంతంలో పెట్టుకున్నట్లైతే 15 రోజుల నుండి 20 రోజుల ప్రాంతంలో గోధుమ గడ్డి జ్యూస్ చేసుకోవడానికి అనువుగా పెరుగుతుంది.

గోధుమ గడ్డి జ్యూస్ చేసుకోండిలా
ఈ సమయంలో పెరిగిన గడ్డిని కాండం వరకు కోసుకొని గడ్డిని చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసి కట్ చేసిన గడ్డిని మిక్సీ గిన్నెలో వేసి గడ్డి తో పాటు కొద్దిగా వాటర్ కలిపి జ్యూస్ చేసుకొని వాటర్ కలిపిన జ్యూస్ లో పొడి పిప్పిని తీసివేసి ఆ విధంగా రోజు గోధుమ గడ్డి జ్యూస్ తీసుకోవడం వల్ల ఇంకా మరిన్ని ప్రయోజనాలు ఉంటాయి..అయితే రోజు జ్యూస్ తాగాలి అనుకునేవారు రెండు మూడు పాత్రలో గోధుమ గడ్డిని పెంచుకున్నట్లయితే గడ్డి లేతగా ఉన్నప్పుడే ముదిరిపోక ముందే గడ్డి కోసుకొని జ్యూస్ చేసుకుంటే బోలెడన్ని ప్రయోజనాలు ఉంటాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+