నాన్‌వెజ్‌లో రెడ్‌మీట్ తింటున్నారా?.. అయితే తెలుసుకోండి
నాన్ వెజ్ తినడం అలవాటైన తర్వాత కనీసం రెండురోజులకోసారి తినేవారు కూడా ఉన్నారు. గతంలో ఆదివారం ఒక్కరోజే తినేవారు. క్రమేణా రెస్టారెంట్లు, హోటల్స్ ఎక్కువ కావడంతోపాటు ప్రతిరోజు దొరుకుతుండటంతో ప్రజలు కూడా నాన్ వెజ్ ప్రతిరోజు తినడానికి అలవాటుపడుతున్నారు. అయితే లాన్సెట్ నివేదిక ప్రకారం నాన్ వెజ్ ఎక్కువగా తినేవారిలో టైప్ 2 మధుమేహం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తేలిసింది. మధుమేహం రోజురోజుకు వ్యాపిస్తోన్న సంగతి తెలిసిందే. భారతదేశంలో కూడా షుగరు వ్యాధిగ్రస్తుల సంఖ్య ఆందోళనకర స్థాయిలో పెరుగుతోంది. అందులోను టైప్2 ఎక్కువగా సోకుతోంది.
ప్రపంచవ్యాప్తంగా 19 లక్షల మందిపై సర్వే
మధుమేహం అనేది మన ఆహారపు అలవాట్లు, జీవనశైలి వల్ల వస్తుంది. ఒకసారి వచ్చిన తర్వాత నియంత్రించుకోవడమేకానీ చికిత్స లేదు. జీవనశైలిని మార్చుకుంటే ఇది అదుపులో ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా నాన్ వెజ్ ప్రియులు ఎక్కువగా ఉంటారు. వారందరికీ మధుమేహం ముప్పు పొంచివున్నట్లే. ప్రధానంగా రెడ్ మీట్ తినేవారిలో టైప్-2 షుగరు ముప్పు ఎక్కువగా ఉన్నట్లు తేలిసింది. ప్రపంచవ్యాప్తంగా 20 దేశాల్లో 19 లక్షలకు పైగా ప్రజలపై అధ్యయనం చేసి ఈ నివేదికను రూపొందించారు.

15 శాతం పెరిగిన ముప్పు
ప్రతిరోజు 50 గ్రాముల ప్రాసెస్ చేసిన మీట్ తింటున్నవారు, 100 గ్రాములు ప్రాసెస్ చేయని రెడ్ మీట్ తింటున్నవారు, 100 గ్రాముల పౌల్ట్రీ మీట్ తీసుకుంటున్నవారిపై ఈ అధ్యయనం చేయగా షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. వీటి వివరాలను ది లాన్సెట్ డయాబెటిస్ అండ్ ఎండోక్రైనాలజీ మ్యాగజైన్ లో ప్రచురించారు. రోజుకు 50 గ్రాముల చొప్పున ప్రాసెస్ మీట్ తింటున్నవారిలో 15 శాతం షుగరు ముప్పు ఉంది. 100 గ్రాముల అన్ ప్రాసెస్ రెడ్ మీట్ తింటున్నవారిలో 10 శాతం షుగరు ముప్పు, 100 గ్రాముల పౌల్ట్రీ మీట్ తింటున్నవారిలో 8 శాతం టైప్ - షుగరు ముప్పు పెరిగింది. ప్రపంచంలోని చాలా దేశాల్లో రెడ్ మీట్ ను పరిమితి దాటి తింటున్నట్లు గుర్తించారు. దీనివల్లే షుగరు ముప్పుు పెరుగుతోంది.












Click it and Unblock the Notifications