వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Cabbage Benefits: క్యాబేజీ తినడం లేదా.. అయితే మీకు నష్టమే..!

|
Google Oneindia TeluguNews

క్యాబేజీ చాలా తక్కువ మంది వాడే కూరగాయ ఇది. ఈ క్యాబేజీని నూడుల్స్, మంచురియా వంటి వాటిలో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఏడాది పొడవునా లభ్యమయ్యే ఈ కూరగాయలో ఎన్నో పోషకాలు ఉన్నాయి. అయితే చాలా మంది క్యాబేజీని తినేందుకు ఆసక్తి చూపరు. క్యాబేజీ తినడం వల్ల లాభాలు తెలిస్తే అస్సలు తినకుండా ఉండలేరు.

విటమిన్ సి

విటమిన్ సి

క్యాబేజీలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటీరీ లక్షణాలుంటాయి. దీనిలో పీచుపదార్థాలు, రైబోఫ్లేవిన్, ఫోలేట్, విటమిన్ సి, థయామిన్, విటమిన్ బి6, మెగ్నీషియం, నియాసిన్, కాల్షియం, భాస్వరం, ఇనుము, పొటాషియం, జింక్ వంటి పోషకాలు పుష్కలం. ఇవి ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గిస్తాయి. క్యాబేజీని తినడం వల్ల అనేక రకాల ఆరోగ్యప్రయోజనాలను ఉన్నాయి.

బీటా కెరోటిన్

బీటా కెరోటిన్

వీటిలో ఉండే బీటా కెరోటిన్ కంటి లోపల మచ్చలను తగ్గించటంలో ఉపయోగపడుతుంది. అంతేకాక కంటి శుక్లాలు రాకుండా రక్షణగా ఉంటుంది. క్యాబేజిలో ఎమినో యాసిడ్స్ సమృద్ధిగా ఉండడం వలన కడుపు మంట సమస్య రాదు. క్యాబేజిలో విటమిన్ సి సమృద్ధిగా ఉండడం వలన శరీరంలో వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది.

అల్జీమర్స్

అల్జీమర్స్

అల్జీమర్స్ సమస్యను నివారించే విటమిన్ K రెడ్ క్యాబేజీలో సమృద్ధిగా ఉంటుంది. క్యాబేజీ రసంలో గ్లూటమిన్ అనే కంటెంట్‌లో యాంటీ అల్సర్ గుణాలు కలిగి ఉన్నాయి. అందువల్ల కడుపులో మంట,కడుపులో పూతలు తగ్గుతాయి. కాబట్టి కడుపు మంట ఉన్నప్పుడు క్యాబేజీ రసం త్రాగితే ప్రయోజనం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

డయాబెటీస్

డయాబెటీస్

డయాబెటీస్ పేషెంట్లకు క్యాబేజీ మంచి ప్రయోజనకరంగా ఉంటుందట. ఎందుకంటే క్యాబేజీ ఇన్సులిన్ స్థాయిలను పెంచడానికి, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి ఉపయోగపడుతుంది. క్యాబేజీని తింటే రక్తంలో చక్కెర స్థాయిలను పెరిగే అవకాశమే ఉండదు. క్యాజేజీ జీర్ణక్రియకు ఎంతో మేలు చేస్తుంది. ఈ కూరగాయలో ఎక్కువ మొత్తంలో ఫైబర్ కంటెంట్ ఉంటుంది. ఇది జీర్ణక్రియ పనితీరును మెరుగుపరుస్తుంది.

గుండె

గుండె

క్యాబేజీ గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి కూడా సహాయపడుతుంది. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండెను రక్షించడానికి సహాయపడతాయి. క్యాబేజీని తరచుగా తింటే గుండెకు సంబంధించిన వ్యాధులొచ్చే ప్రమాదం చాలా వరకు తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది. క్యాబేజీలో పుష్కలంగా ఉండే పాలీఫెనాల్స్, ఆంథోసైనిన్స్ లు జీర్ణ సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది.

English summary
Cabbage contains antioxidants and anti-inflammatory properties. It also contains fiber, riboflavin, folate, vitamin C and thiamin.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X