వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Guava Health Benefits: రోగనిరోధక శక్తి పెరగాలంటే.. ఆ కాయ తినండి చాలు..!

|
Google Oneindia TeluguNews

మనకు ఎక్కువగా దొరికే పండ్లలో జామకాయ ఒకటి. ఈ జామ పండ్లు చలికాలంలో ఎక్కువగా దొరుకుతాయి. అయితే
ఈ జామ యాపిల్ తో సమానమైందని నిపుణులు చెబుతున్నారు. యాపిల్లో ఉన్నటువంటి పోషకాలన్నీ కూడా ఈ జామకాయలో ఉంటాయని చెబుతున్నారు. అందుకే ఈ పండును పేదవాడి ఆపిల్ పండు అని పిలుస్తుంటారు. ఈ పండును నేరుగా తిన్నా, జ్యూస్ రూపంలో తీసుకున్నా ఆరోగ్యానికి చాలా ఉపయోగం ఉంటుంది.

జలుబు

జలుబు

చలికాలంలో జామకాయ తింటే జలుబు చేస్తుందని చాలా మంది తినరు. కానీ చలికాలంలో ఈ పండును తినడం వల్ల రోగనిరోధక శక్తిని పెరిగి ఆరోగ్యంగా ఉంటామట. జామకాయలో విటమిన్లు, మినిరల్స్, ఇతర పోషకాలు పెద్ద మొత్తంలో ఉంటాయి. ప్రధానంగా ఈ జామకాయలో విటమిన్ సితో పాటు యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి.

సిట్రస్

సిట్రస్


ఈ పండును ఇతర రకాల సిట్రస్ పండ్లైన నారింజ, నిమ్మ, బత్తాయి, దానిమ్మ కాయలతో పోల్చితే, విటమిన్ సి కంటెంట్ ఇందులో ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. సి విటమిన్ తో శరీరంలో రోగనిరోధక శక్తి పెరగడమే కాకుండా రక్తంలో తెల్లరక్తకణాల సంఖ్య కూడా పెరుగుతుంది. అయితే జామలో చాలా తక్కువ కేలరీలు ఉంటాయట.

బరువు

బరువు


బరువు తగ్గాలనుకునే వారు మెన్ లో జామకాయాలను చేర్చుకోవచ్చు. అధిక రక్త పోటు ఉన్న వారు రెగ్యులర్ డైట్ లో జామపండ్లను చేర్చుకుంటే మంచిది. జామలో ఉండే పోటాషియం గుండెకు రక్షణగా ఉంటాయి. శీతాకాలంలో ఈ పండును రోజుకొకటి తింటే శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

English summary
Experts say that guava is equal to apple. It is said that this guava contains all the nutrients like apple.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X