కోడిగుడ్డు రోటి పచ్చడి : సరికొత్త రుచి, 10 నిమిషాల్లో సిద్ధం!
ప్రతీరోజూ మనం రకరకాల పచ్చళ్ళు చేసి తింటాం . అయితే చాలా వెరైటీ గా కోడిగుడ్డు రోటి పచ్చడి ఉంటుంది. ఎంతో రుచికరంగా ఉండే ఈ రోటి పచ్చడి మనకు అన్నం, రోటీ, దోస, ఇడ్లీలతో అద్భుతంగా సరిపోతుంది. దీనిని తయారు చేయటం ఎలాగో ఒకసారి చూద్దాం.
కావాల్సిన పదార్థాలు
కోడిగుడ్లు – 3-4
పచ్చి మిర్చి – 5-6
ఎండు మిర్చి – 4-5
ఉల్లిపాయలు – 2 (ముక్కలు చేసినవి)
టమాటాలు – 2 (కట్ చేసుకున్నవి)
వెల్లుల్లి – 4-5రేకులు
ఆవాలు – ½ టీస్పూన్
జీలకర్ర – ½ టీస్పూన్
కరివేపాకు – 1-2రెమ్మలు
కొత్తిమీర - కొద్దిగా
పసుపు – చిటికెడు
ఉప్పు – రుచికి తగినంత
నూనె – 2-3టేబుల్ స్పూన్లు

తయారీ విధానం
ముందుగా పాన్‌లో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర వేసి పాప్ చేయాలి. తర్వాత అందులో పచ్చి మిర్చి 6, ఎండు మిర్చి వేసి కొద్దిగా నూనె వేసి వేయించాలి. ఆపై అందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. వాటిని తీసి పక్కన పెట్టుకుని, అందులోనే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసి మగ్గించాలి.
రుచికరమైన కోడిగుడ్డు రోటి పచ్చడి ఇలా
ఆపై ఈ మిశ్రమాన్ని అంతటినీ రోట్లో వేసి 6 వెల్లుల్లి, జీలకర్ర, కరేపాకు, కొత్తమీర వేసి పచ్చడిలా నూరుకోవాలి. అందులో రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి. ఒకవేళ కారం సరిపోకుంటే కొద్దిగా కారప్పొడి ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆపై ఉడికించిన కోడిగుడ్డును కట్ చేసి, తురుముకుని పచ్చడిలో కలిపితే రుచికరమైన కోడిగుడ్డు రోటి పచ్చడి తయారవుతుంది. ఈ కోడిగుడ్డు రోటి పచ్చడి ఒక్కసారి చేసి చూస్తే మళ్లీ మళ్లీ చేయాలనిపిస్తుంది.













Click it and Unblock the Notifications