ఈ చిన్న చిట్కాలతో టేస్టీ, స్మూత్ చపాతీలు: చల్లారినా గట్టిపడవ్

చపాతీలు ఎవరికి ఇష్టం ఉండవు. అన్నానికి ప్రత్యామ్నాయంగా చాలామంది చపాతీలతో భోజనం లాగించేస్తుంటారు. చపాతీలు వేడివేడిగా ఉన్నంత వరకే అవి మృదువుగా ఉంటాయి. కొంచెం చల్లారినా గానీ అవి కొంత గట్టిపడుతుంటాయి. చల్లారిన తర్వాత వాటి రుచి మారిపోతుంటుంది. మరికొందరు చేసే చపాతీలు మాత్రం చల్లారిన తర్వాత కూడా మెత్తగానే ఉంటాయి.

కొన్ని చిట్కాలను పాటిస్తే చపాతీలు మృదువుగా ఉంటాయి. మెత్తని చపాతీలు కావాలంటే పిండిని సరిగ్గా కలపడం చాలా ముఖ్యం. గోరువెచ్చని నీరు లేదా పాలను ఉపయోగించి పిండిని బాగా కలిపి, మృదువుగా అయ్యేలా నలిపి, కొద్దిసేపు అలాగే ఉంచాలి. ఆ తర్వాత వాటిని గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేయాలి. అవసరమైతే తడి టవల్‌తో కప్పవచ్చు.

  • చపాతీ మెత్తదనం అనేది మనం కలిపిన పిండిని బట్టి ఉంటుంది. తేమను నిలుపుకోవడం, సరైన పద్ధతిలో పిండిని కలపడంపై ఆధారపడి ఉంటుంది. పిండిని కలపడం, దాన్ని నిల్వ చేయడం వంటి పద్ధతులను పాటించడం ద్వారా చపాతీలు మృదువుగా వస్తాయి.
  • పిండిలో కొద్దిగా గోరువెచ్చని పాలు కలపడం లేదా దాన్ని గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేయడం వంటి కొన్ని పద్ధతులను అనుసరించడం వల్ల చపాతీలు ఎక్కువ కాలం మృదువుగా ఉంటాయి. ప్రతీసారి మీరు మెత్తని చపాతీలనే ఆస్వాదించవచ్చు.
  • పిండిని కలిపి అప్పటికప్పుడు చపాతీలను వేస్తే.. అవి గట్టిగానే తయారవుతాయి. కలిపిన పిండిని కొంత సమయం పాటు పక్కన పెట్టడం ఉత్తమం. దీనివల్ల అందులో ఉండే గ్లూటెన్ వదులు అవుతుంది. చపాతీలు మరింత సాగే గుణాన్ని పొందుతాయి. అటు ఒత్తడానికి కూడా సులభంగా మారుతాయి.
  • పిండి కలిపేటప్పుడు కొద్దిగా నూనె లేదా నెయ్యి కలపినా కూడా చపాతీలు మెత్తగా అవుతాయి.
  • అలాగే చపాతీలను మృదువుగా ఒత్తాలి. దీనివల్ల పెనం వేసినప్పుడు అవి బాగా పొంగుతాయి. ఎక్కువ కాలం మృదువుగా ఉంటాయి.
  • పెనాన్ని మధ్యస్థంగా వేడి చేయాలి. బాగా వేడిగా ఉన్న పాన్ పై చపాతీని వేస్తే వెంటనే అది కాలిపోతుంది. అలాగనీ మరీ చల్లగా ఉన్న పాన్ పై చపాతీని వేస్తే.. అది గట్టిపడుతుంది. అందుకే- పెనం వేడి అనేది మధ్యస్థంగా ఉండాలి. అలాంటి పాన్ పై చపాతీలు కాల్చినప్పుడు, ఆవిరి లోపల చిక్కుకొని, అది మృదువుగా ఉంటుంది.
  • రాత్రి వరకు నిల్వ ఉంచుకోవాలనుకుంటే మాత్రం గాలి చొరబడని డబ్బాలో ఉంచాలి. ఇది ఆవిరిని నిలిపి ఉంచి, చపాతీ గట్టిపడకుండా నిరోధిస్తుంది.
  • చపాతీలు కొద్దిగా గట్టిపడినట్లయితే, వాటిని తడి కిచెన్ టవల్‌లో చుట్టి తవా మీద లేదా మైక్రోవేవ్‌లో వేడి చేయవచ్చు. ఇది వాటి మృదుత్వాన్ని తిరిగి తెస్తుంది.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+