అల్లం టీ Vs లెమన్ టీ - ఏ సమస్యకు ఏది బెస్ట్..!?
ప్రతీ ఉదయం టీ ఉండాల్సిందే. ప్రతీ ఇంటా ఇది సాధారణం. అనేక మంది పలు రకాల ప్లేవర్లు టీ రూపంలో తీసుకుంటారు. మారుతున్న జీవన శైలితో ఆరోగ్య పరమైన టీలు అందుబాటులోకి వచ్చాయి. ఆరోగ్యం పైన అవగాహన పెరుగుతున్న కొద్దీ టీ తీసుకునే వారి అభిరుచుల్లోనూ మార్పు కనిపిస్తోంది. చాలా మంది ఈ మధ్య కాలంలో అల్లం టీ.. లెమన్ టీ వైపు ఆసక్తి చూపుతున్నారు. గ్రీన్ టీ వినియోగం బాగా పెరిగింది. దీంతో.. అసలు ఆరోగ్య పరంగా అల్లం టీ.. లెమన్ టీ ల్లో ఏది ఎవరికి మంచిదనే సందేహాలకు నిపుణులు స్పష్టత ఇస్తున్నారు.
ప్రతీ ఇంటా.. ప్రతీ ఒక్కరి లైఫ్ లో కామన్ మారిన టీ కి సంబంధించి ఆసక్తి కర అంశాలు వెలుగు లోకి వస్తున్నాయి. సాధారణ టీ కంటే ఈ మధ్య కాలంలో అల్లంటీ, లెమన్ టీ తీసుకునే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ సమయంలో ఈ రెండు రకాల టీల కోసం ఎక్కువ సంఖ్యలో మొగ్గు చూపుతున్నారు. అల్లంలో ఉండే జింజెరాల్స్ శక్తివంతమైన యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. కీళ్ల నొప్పులు, మోకాళ్ల వాపు, గొంతు నొప్పి లేదా దగ్గు ఉన్నప్పుడు ఉదయాన్నే అల్లం టీ తాగడం శరీరానికి ఉపశమనంగా మారుతుంది. అదే విధంగా భోజనం తర్వాత లేదా ఉదయాన్నే తాగితే అజీర్తి, గ్యాస్ సమస్యలు తగ్గుతాయి. వాపును తగ్గించడంలోనూ సహాయపడుతుంది. అదే విధంగా అల్లం టీ శీతా కాలంలో శరీర వేడిని తగ్గించి...శరీరానికి శక్తిని అందిస్తుందని చెబుతున్నారు. కాగా.. నిమ్మకాయలో విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరాన్ని లోపల నుండి శుభ్రం చేస్తుంది. బరువు తగ్గాలనుకునేవారికి లెమన్ టీ బెస్ట్ ఆప్షన్ గా స్పష్టం చేస్తున్నారు.

నిపుణుల సూచనలు
శరీరంలోని సమస్యలు.. ఆరోగ్య పరమైన అంశాల ఆధారంగానూ టీ ఎంపిక చేసుకునే వారి సంఖ్య పెరుగుతోంది. లెమన్ టీ శరీరపు ఫ్యాట్ ద్రవ్యం త్వరగా శక్తిగా మారుతుంది. పని ఒత్తిడిలో ఉన్నవారికి లెమన్ టీ వాసన మనసును ప్రశాంతంగా చేస్తుంది. శరీరంలోని విషతుల్యాలు బయటకు పంపేందుకు దోహదం చేస్తుంది. దీని ద్వారా చర్మం ప్రకాశవంతంగా మారుతుంది. ఉద్యోగాల్లో.. ఇతర సమస్యల్లో ఒత్తిడి.. అలసటగా ఉన్న సమయంలో లెమన్ టీ మూలు చేస్తుంది. ఆలోచనల ను ఫ్రెష్ గా మార్చేందుకు దోహద పడుతుంది. జలుబు, అలసట, అజీర్తి సమస్య ఉంటే అల్లం టీ. బరువు తగ్గడం, మానసిక చురుకుదనం, చర్మ శ్రేయస్సు కోసం లెమన్ టీని తీసుకోవచ్చని నిపుణులు తెలుపుతున్నారు. తయారీలో చేసే సాధారణ తప్పు చాలామంది టీని గంటల తరబడి మరిగిస్తూ ఉంటారు. ఇలా మరిగించటం ద్వారా అల్లం.. నిమ్మలోని ఔషధ గుణాలు తగ్గిపోతాయి. నీటిని మరిగించాక అల్లం తురుము లేదా నిమ్మరసం వేసి రెండు నిమిషాలు మూత పెట్టి ఉంచడం ద్వారా పోషకాలు అందులోని ఉండిపోతాయి. వయసు.. సమస్యల ఆధారంగా ఏ టీ తాగాలో ఎంపిక చేసుకోవటం ద్వారా ఆరోగ్య పరమైన ప్రయోజనాలు ఉందే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.













Click it and Unblock the Notifications