మెరిసే చర్మం కోసం ఖరీదైన క్రీమ్స్ వద్దు.. ఇంట్లోనే ఉండే ఇవి చాలు!
చర్మం కాంతివంతంగా ఉండడం ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు. అయితే అటువంటి చర్మం సొంతం చేసుకోవాలంటే, చర్మాన్ని కాంతివంతంగా మార్చుకోవాలంటే ఖరీదైన ఉత్పత్తులను వాడాల్సిన అవసరం లేదు. నిత్యం మన వంటగదిలో ఉండే కొన్ని పదార్థాలు మన చర్మాన్ని కాంతివంతంగా చేసి మనకు ఎన్నో లాభాలను కలిగిస్తాయి. చర్మం కాంతివంతంగా ఉండాలి అంటే కొన్ని రకాల ఆహారాలను మనం ప్రతినిత్యం తీసుకోవాలి. ఆ ఆహారాలు ఏమిటో ప్రస్తుతం తెలుసుకుందాం.
పసుపు
చర్మం కాంతివంతంగా ఉండడం కోసం, ఆరోగ్యంగా ఉండడం కోసం పసుపును మనం ఆహారంలో భాగంగా చేసుకోవాలి. పసుపులో ఉండే వ్యాధి నిరోధక లక్షణాలు మన చర్మ ఆరోగ్యాన్ని కాపాడతాయి. మొటిమలు, మచ్చలు వంటి వాటిని తగ్గించడానికి దోహదం చేస్తాయి. పసుపులో ఉండే కర్కుమిన్ ప్రీ రాడికల్స్ తో పోరాడి ఆరోగ్యకరమైన రంగును ప్రోత్సహిస్తుంది.

ఉసిరి
చర్మం కాంతివంతంగా ఉండాలంటే ఉసిరి ఎంతగానో దోహదం చేస్తుంది. ఉసిరిలో ఉండే విటమిన్ సి తో కొల్లాజిన్ ఉత్పత్తి కూడా పెరుగుతుంది. ఇది మన స్కిన్ మెరిసేలా చేస్తుంది. ఉసిరిని నిత్యం మనం ఆహారంలో భాగంగా చేసుకుంటే మంచిది. ఉసిరిలో ఉండే గొప్ప గుణాలు చర్మం ముడతలు రాకుండా నున్నగా ఉండేలా చూస్తుంది.
కొబ్బరి నూనె
చర్మ సంరక్షణకు ఉపయోగపడే పదార్థాలలో కొబ్బరినూనె ఒకటి. కొబ్బరి నూనెలో ఉండే తేమ లక్షణాలు చర్మాన్ని తేమగా మృదువుగానూ ఉంచుతాయి. కొబ్బరి నూనె క్రమం తప్పకుండా అప్లై చేసుకోవడం ద్వారా మన చర్మం కాంతివంతంగా మారుతుంది. కొబ్బరినూనెలో కాస్త కాఫీపొడి, చెక్కర వంటివి కలిపి పేస్ కి అప్లై చేస్తే చర్మం నిగారింపు సొంతం చేసుకుంటుంది.
తేనే
తేనె కూడా మన చర్మ ఆరోగ్యాన్ని కాపాడటానికి ఎంతగానో దోహదం చేస్తుంది. యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉండే తేనే మొటిమలను, మచ్చలను నివారిస్తుంది. ముఖానికి మాస్క్ వేసుకోవడానికి ఉపయోగపడుతుంది. దీనివల్ల ఇది సున్నితమైన ప్రకాశవంతమైన చర్మాన్ని మనకు అందిస్తుంది. ఇది చర్మ సంరక్షణకు చాలా మంచిది.
కుంకుమపువ్వు
కుంకుమ పువ్వు కూడా మన చర్మం ప్రకాశవంతం కావడానికి ఎంతగానో దోహదం చేస్తుంది. కుంకుమ పువ్వులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మన చర్మ ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఫేస్ కు వేసుకునే ప్యాక్ లలో కుంకుమపువ్వును కలిపి ఉపయోగించడం ద్వారా చర్మం యొక్క కాంతి పెరుగుతుంది.












Click it and Unblock the Notifications