గడ్డం పెంచడంవల్ల అందమే కాదు.. మంచి ఆరోగ్యం కూడా
ఒకప్పుడు గడ్డం పెంచితే ఇంట్లో పెద్దలు చిరాకుపడేవారు. దేవదాసులా ఆ గడ్డం పెంచడం ఏమిటి? ప్రేమలో విఫలమయ్యావా? అంటూ స్నేహితులు అడుగుతంటారు. కానీ కాలం మారేకొద్దీ అభిరుచులు, అభిప్రాయాలు మారుతున్నాయి. ఈరోజుల్లో గడ్డం పెంచితేనే ఫ్యాషన్. ఇంటర్వ్యూలకు కూడా గడ్డంతోనే వెళుతున్నారు. ఒకప్పుడు సినిమాల్లో హీరోలు అంటే చక్కగా షేవ్ చేసుకొని తళతళలాడుతూ కనిపిస్తారు. కానీ ఇప్పుడు మాత్రం హీరో అంటే గుబురుగా గడ్డం పెంచి, రఫ్ లుక్ లో, మాస్ లుక్ లో కనపడుతున్నారు. అభిమానులు కూడా అదే ఫాలో అవుతున్నారు. దాదాపుగా ఇప్పుడు 70 శాతం పురుషులు గడ్డంతోనే ఉంటున్నారు.
అందం సొంతమవుతుంది
గడ్డం పెంచడంవల్ల మంచి అందం సొంతమవుతుంది. అలాగే మంచి ఆరోగ్యం కూడా మన సొంతమవుతుంది. వారానికి ఒకసారి షాంపూ, కండిషనర్ ఉపయోగించి వాష్ చేయాలి. క్రమం తప్పకుండా గడ్డాన్ని దువ్వుతుండాలి. చేపలు, గుడ్లు తినడంద్వారా గడ్డం బలంగా పెరుగుతుంది. అలాగే జీడిపప్పు, బాదంపప్పులాంటివి కూడా గడ్డం నుంచి వెంట్రుకలు రాలడాన్ని నిరోధిస్తాయి. గడ్డం మృదువుగా పెరగడాలంటే ఆకుకూరలు తినాలి. జామాయిల్ లేదంటే యూకలిప్టస్ నూనె వాడితే మరింత మృదువుగా పెరుగుతుంది.

యూవీ కిరణాల నుంచి కాపాడుతుంది
గుబురుగా పెంచుకున్న గడ్డం యూవీ కిరణాల నుంచి చర్మం దెబ్బతినకుండా కాపాడుతుంది. మురికి నుంచి, పొడి గాలుల నుంచి కాపాడుతుంది. గడ్డం పెంచడంవల్ల ముఖం యువకుడిలా కనిపించేలా చేస్తుంది. మచ్చలు, మొటిమలు కనపడకుండా చేస్తుంది. దుమ్ము, ధూళి చేరకుండా చూస్తుంది. దీనివల్ల ఊపిరితిత్తుల సమస్యలు రావు. గడ్డం ఉన్నవారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. గడ్డాన్ని ఎప్పుడూ ట్రిమ్ చేసుకుంటుండాలి. బియర్డ్ నూనెను వాడటంవల్ల చర్మంలో తేమ కోల్పోదు. ఈ నూనె గడ్డం కింద చర్మాన్ని మాయిశ్చరైజ్ చేస్తుంది. దీనివల్ల గడ్డంలో నల్లమచ్చలు ఏర్పడవు. ప్రొటీన్లు ఉన్న ఆహారం తీసుకుంటుంటే గడ్డం అనేది ఒక స్టైల్ మాత్రమే కాకుండా అందాన్ని కూడా రెట్టింపు చేస్తుంది.












Click it and Unblock the Notifications