ఈ ఒక్క ఆయిల్ తో డయాబెటిస్, ఒబేసిటీకి చెక్.. ట్రై చెయ్యండి!
మనం ఉపయోగించే నూనెలలో ఆలివ్ ఆయిల్ ఒకటి. ఆలివ్ ఆయిల్ లో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఆలివ్ ఆయిల్ యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లతో పుష్కలంగా ఉంటుంది. ఇది మన ఆరోగ్యానికి ఎంతగానో దోహదం చేస్తుంది. ఆలివ్ ఆయిల్ ను తీసుకున్నట్లయితే మన శరీరంలో చెడు కొవ్వులు తగ్గి, మంచి కొవ్వు పెరుగుతుంది.
ఆలివ్ ఆయిల్ తో ఈ ఆరోగ్యం
ఆలివ్ ఆయిల్ లో ఉండే మోనోసాచురేటెడ్ కొవ్వులు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి దోహదం చేస్తాయి. తద్వారా ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. ఆలివ్ ఆయిల్ ను చర్మ సంరక్షణకు కూడా ఉపయోగిస్తారు. చర్మ మెరిసేలా ఉంచడానికి దోహదం చేస్తుంది. ఇందులో ఉండే విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు చర్మ కణాల పునరుత్పత్తికి తోడ్పడతాయి.

ఆలివ్ ఆయిల్ తో టైప్ 2 డయాబెటిస్ కు చెక్
ఆలివ్ ఆయిల్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో మంటను తగ్గించడానికి దోహదం చేస్తాయి శరీరంలోని అధిక కొలెస్ట్రాల్ ను నియంత్రించడానికి సహాయం చేస్తాయి. రక్తంలో చక్కెర నియంత్రణకు కూడా ఆలివ్ ఆయిల్ ఉపయోగపడుతుంది. ఇది టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఆలివ్ ఆయిల్ మలబద్ధకాన్ని నివారించడానికి ఎంతగానో దోహదం చేస్తుంది.
ఆలివ్ ఆయిల్ తో చర్మ, జుట్టు ఆరోగ్యం
జ్ఞాపకశక్తి తగ్గిన వారికి, అల్జీమర్స్ తో బాధపడుతున్న వారికి, మెదడు ఆరోగ్యానికి ఆలివ్ ఆయిల్ దోహదం చేస్తుంది. నరాలకు సంబంధించి డీ జనరేటివ్ వ్యాధుల ప్రమాదాన్ని కూడా ఆలివ్ ఆయిల్ తగ్గిస్తుంది. ఇది చర్మానికి కావలసిన పోషణను ఇచ్చి చర్మంపై ముడతలు పడకుండా యవ్వనంగా ఉంచుతుంది. ఆలివ్ ఆయిల్ జుట్టు పెరుగుదలకు ఎంతగానో దోహదం చేస్తుంది.
వంటలోకి ఆలివ్ ఆయిల్
మన జుట్టు కుదుళ్లకు పోషణను ఇచ్చి, జుట్టు పెరుగుదలకు కావలసిన వాతావరణాన్ని కల్పిస్తుంది. జుట్టుకు నిగారింపును ఇస్తుంది. పొడవుగా ఒత్తుగా నిండుగా పెరిగేలా చేస్తుంది. ఆలివ్ ఆయిల్ ను డైరెక్ట్ గా ఉపయోగించడం మాత్రమే కాదు వంట చేసుకోవడానికి కూడా ఉపయోగించవచ్చు. అయితే ఎవరైతే ఆలివ్ ఆయిల్ ను వినియోగిస్తారో వారు ఆరోగ్యంగా కూడా ఉంటారని చెబుతారు.












Click it and Unblock the Notifications