పచ్చళ్ళు తెగ తింటున్నారా? అయితే ఈ రోగాలు పక్కా.. రాసుకోండి!

చాలామంది నిలువ పచ్చళ్లను ఇష్టంగా తింటూ ఉంటారు. అయితే విపరీతంగా పచ్చళ్ళను తినడం మంచిది కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పచ్చళ్ళు అధిక వినియోగం వల్ల ఆరోగ్య ప్రమాదాలు పెరుగుతాయని పోషకాహార నిపుణులు సైతం చెబుతున్నారు. రుచికరంగా ఉన్నాయని పచ్చళ్ళు పదేపదే తినేవారు ఆరోగ్యం విషయంలో అలర్ట్ అవ్వాల్సిందేనని, తమ అలవాట్లు మార్చుకోవలసినదేనిని హెచ్చరిస్తున్నారు.

పచ్చళ్ళు ఎక్కువ తింటే అనారోగ్యాలు

పచ్చళ్ళు వినియోగం కారణంగా మన శరీరంలో అధికస్థాయిలో సోడియం చేరుతుంది. ఇది మన శరీర ఆరోగ్యాన్ని పాడుచేస్తుంది. నిలువ పచ్చడిలో ఉండే అధిక సోడియం కారణంగా హైపర్ టెన్షన్ తో పాటు, గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక పచ్చళ్లలో కాస్త నూనెను కూడా ఎక్కువగా ఉపయోగించడం వల్ల ఇది మన ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడానికి, బరువు పెరగడానికి దోహదం చేస్తుంది.

Health Experts Warn About Risks Pickles over eating

పచ్చళ్లలో ఉప్పు, కారం, మసాలాలతో సమస్యలు

పచ్చళ్ళు ఎక్కువగా తినేవారిలో అందులో ఉప్పు ఎక్కువగా ఉండటం వలన కిడ్నీల పనితీరుపైన భారం పడుతుంది. పచ్చళ్లలో ఉప్పు, కారం, మసాలాలు ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణ సంబంధిత మైన సమస్యలు వస్తాయి. కడుపు, పేగుపూతలు వంటి సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. అంతేకాదు పచ్చళ్ళు ఎక్కువ తినేవారిలో పోషకాహార లోపం ఏర్పడుతుంది. పచ్చళ్లలో వేసే పదార్థాలు శరీరానికి ఏమాత్రం పోషకాలను ఇవ్వవు. పైపెచ్చు ఇవి ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి.

నిల్వ పచ్చడికి ప్రత్యామ్నాయం ఇదే

నిలవ పచ్చడిని తినడం బదులు అప్పటికప్పుడు నూరుకునే పచ్చళ్లను చేసుకుని తింటే మంచిది. వీటిలో సోడియం తక్కువ ఉంటుంది. ఇంట్లో మనం ఎప్పటికప్పుడు పచ్చడి తయారు చేసుకుని తినడం ఇష్టంగా తినే వారికి ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయంగా చెప్పవచ్చు. పచ్చళ్ళ వాడకాన్ని తగ్గించి మితంగా తీసుకోవడం వల్ల మన శరీరానికి, ఆరోగ్యానికి హాని కలగకుండా చూసుకోవచ్చు. మన ఆహారంలో పచ్చళ్ళ కు బదులు ఇతర ఇష్టమైన ఆహార పదార్థాలు తినడం వల్ల కూడా పచ్చళ్ళ వల్ల కలిగే దుష్ప్రభావాలను అరికట్టవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+