వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

health tips: పగలు నిద్ర పనికి చేటు మాత్రమే కాదు ఆరోగ్యానికి చేటు.. ఎలాగంటే!!

|
Google Oneindia TeluguNews

మనిషిని ఆరోగ్యంగా ఉంచటంలో నిద్ర గణనీయమైన పాత్రను పోషిస్తుంది. ప్రతిరోజు రాత్రి వేళ ఎటువంటి నిద్ర భంగాలు లేకుండా ఎనిమిది గంటలపాటు నిద్ర పోయినవారు ఆరోగ్యవంతులు అని ప్రతి ఒక్కరు ఒప్పుకోవాల్సిందే. అయితే చాలామంది రాత్రి సమయాల్లో నిద్రపోకుండా పగలు ఎప్పుడు పడితే అప్పుడు నిద్రపోతూ ఉంటారు. ఇది ఏ మాత్రం మంచిది కాదు అని చెబుతున్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు. అందుకు అనేక కారణాలను కూడా చెబుతున్నారు.

health tips: పండుగ పిండివంటలతో కడుపు ఉబ్బరమా? అయితే తగ్గేందుకు చిట్కాలివే!!health tips: పండుగ పిండివంటలతో కడుపు ఉబ్బరమా? అయితే తగ్గేందుకు చిట్కాలివే!!

 పగటి నిద్ర పోయే వాళ్ళలో జరిగేది ఇదే

పగటి నిద్ర పోయే వాళ్ళలో జరిగేది ఇదే

పగటి నిద్ర పనికి చేటు అంటారు.. ఇది ప్రతి ఒక్కరు అంగీకరించవలసిన సత్యం. పగటిపూట నిద్రపోతే శరీరంలో దోషాలు పెరుగుతాయని, ఎన్నో అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయని చెబుతున్నారు. మన శరీరంలో ప్రతిక్షణం వేలాది జీవక్రియలు జరుగుతూ ఉంటాయని, అవి పగటి పూట నిద్రపోతే తగ్గిపోతాయని, దానివల్ల అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని చెబుతున్నారు. శరీరంలో జీర్ణ వ్యవస్థ, గుండె, కాలేయం, మూత్రపిండాలు, మెదడు సరిగ్గా పనిచేయడానికి, మన శరీరం శక్తివంతంగా ఉండడానికి, మన శరీరంలో అవసరమైన హార్మోన్లు విడుదల కావడానికి శరీరానికి ఒక మెకానిజం ఉంటుంది. పగటిపూట నిద్రపోయే వారిలో ఆ మెకానిజం క్రమంగా తగ్గుతూ వస్తుంది.

 పగలు నిద్ర పోవటం వల్ల దుష్ప్రభావాలు

పగలు నిద్ర పోవటం వల్ల దుష్ప్రభావాలు


శరీరంలోని వ్యవస్థలన్నీ నిదానించడంతో శరీరంలోని మెటబాలిజం కూడా తగ్గుతూ వస్తుంది. మెటబాలిజం తగ్గడంతో మనకు ఉండే రోగాలు తగ్గకపోగా మనకు ఏ వ్యాధి ఉంటే ఆ వ్యాధి రెట్టింపు అవుతుంది. పగలు నిద్రపోయేవారు లావుగా ఉంటే వారు మరింత లావుగా తయారవుతారు. పగటి నిద్ర వల్ల వీక్ గా ఉన్నవారు మరింత వీక్ గా మారుతారు. అందుకే పగటిపూట నిద్రకు సాధ్యమైనంత వరకు దూరంగా ఉండండి. ఒకవేళ ఎవరైనా పగటిపూట అలసటగా ఉండి ఒక 20 నిమిషాల పాటు కునుకు తీయాలి అనుకుంటే, ప్రతిరోజు ఒక నిర్దిష్టమైన సమయాన్ని కేటాయించుకోండి. అంతకుమించి ఎక్కువగా పడుకున్నా అది మన ఆరోగ్యానికి చేటు చేస్తుంది.

పగటి పూట ఎక్కువగా పడుకునేవారికి వచ్చే రోగాలివే

పగటి పూట ఎక్కువగా పడుకునేవారికి వచ్చే రోగాలివే


అలా కాకుండా ఎప్పుడు పడితే అప్పుడు పడుకుంటే అది మన శరీరంలోని వ్యవస్థలను ఇబ్బంది పెడుతుంది. ఫలితంగా అనారోగ్యం మనల్ని అవస్థ పెడుతుంది. అంతేకాదు ఎక్కువగా పగటిపుట నిద్రపోయే వారిలో డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. గంటలు గంటలు పగటిపూట నిద్రపోవడం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుందని, ఊబకాయ బాధితులుగా మారుతారని, రకరకాల సమస్యలతో బాధపడతారని చెబుతున్నారు.

 రాత్రి పూట నిద్రతో హ్యాపీ లైఫ్

రాత్రి పూట నిద్రతో హ్యాపీ లైఫ్


ఇక మొత్తంగా చూస్తే పగటిపూట నిద్రమానుకుని, రాత్రివేళ చక్కగా ఎనిమిది తొమ్మిది గంటల వరకే పడుకుని నిద్రపోవడం మంచిదని వైద్య నిపుణులు సలహా ఇస్తున్నారు. రాత్రంతా మెలకువగా ఉండి పగలు పడుకుంటే ఏ పని సరిగ్గా చెయ్యలేరని అంటున్నారు. శరీర ధర్మం ప్రకారం రాత్రిపూట నిద్రపోతేనే మంచిదని చెబుతున్నారు. ప్రతిరోజు రాత్రిపూట తగినంత నిద్రపోతే శారీరక, మానసిక సమస్యల నుంచి మంచి రిలీఫ్ దొరుకుతుందని చెబుతున్నారు. అందుకే పగలు నిద్రకు గుడ్ బై చెప్పి రాత్రి త్వరగా నిద్రకు ఉపక్రమించండి. సుఖవంతమైన నిద్ర మన జీవితాన్ని ఆనందదాయకం చేస్తుంది.


disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

English summary
Doctors say that daytime sleep is not good for work but also not good for health. It is said that sleeping too much during the day can lead to obesity, heart disease and diabetes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X