Silence please.. రోజూ ఒక గంట మౌనం; బోలెడు ప్రయోజనాలు!!
మాట్లాడడం ఒక అందమైన కళ.. మౌనంగా ఉండటం అంతకంటే అద్భుతమైన కళ. అందుకే జీవితంలో ప్రతి ఒక్కరు గంటసేపు మౌనంగా ఉండాలని చెబుతారు. మౌనంగా ఉండడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు, ఎన్నో లాభాలు కలుగుతాయని చెబుతున్నారు. చాలామంది తత్వవేత్తలు, నిష్ణాతులు మౌనమే గొప్ప శక్తిని ఇస్తుందని చెబుతారు.
ఉదయాన్నే నిద్రలేచిన తర్వాత కాసేపు మౌనంగా ఉండడం మంచిది. గంటసేపు మౌనంగా ఉంటే మానసిక ఒత్తిడి నుంచి బయట పడతామని చెబుతున్నారు. మౌనం మన ఆందోళనలను కంట్రోల్ చేస్తుందని చెప్తున్నారు. నిత్యం ఉరుకుల పరుగుల జీవితంలో అలసి సొలసి పోతున్న వారు కచ్చితంగా ఒక గంట సేపు మౌనంగా ఉంటే ఆ అలసట తగ్గుతుందని, వారి మెదడు పనితీరు మెరుగవుతుందని చెబుతున్నారు.

మానసిక ఆరోగ్యానికి మౌనం ఎంతో బాగా ఉపయోగపడుతుందని సూచిస్తున్నారు. భావోద్వేగాలను కంట్రోల్ చేసుకోవడానికి, మెరుగైన లోతైన అవగాహన కలిగి ఉండడానికి, ప్రశాంతంగా ఉండడానికి మౌనం ఎంతగానో ఉపయోగపడుతుందని చెబుతున్నారు. మౌనంగా ఉండడం వల్ల హాయిగా నిద్ర పడుతుందని, రక్తపోటు సమతుల్యం అవుతుందని చెబుతున్నారు.
మౌనంగా ఉండడం వల్ల ఒత్తిడి కూడా తగ్గుతుందని, ఫలితంగా రోగ నిరోధక శక్తి పెరుగుతుందని చెబుతున్నారు. మౌనం వల్ల ఆవేశం, కోపం, అయినదానికి, కాని దానికి గొడవలు పడడం, నోరు పారేసుకోవడం వంటి లక్షణాలు ఉంటే అవి తగ్గుతాయని చెబుతున్నారు. గుండె దడ తగ్గించడంలో మౌనం ఎంతగానో కీలకపాత్ర పోషిస్తుందని చెబుతున్నారు.
మౌన వ్రతాన్ని పాటించడం ఆరోగ్య పరంగాను, ఆధ్యాత్మిక పరంగాను మేలు చేస్తుందని చెబుతున్నారు. మౌన వ్రతం ఆచరించడం వల్ల అది మెదడుని కంట్రోల్ చేస్తుందని, మన ఆలోచనల్ని అదుపులో ఉంచుతుందని చెబుతున్నారు. మనసు నిర్మలంగా ఉన్నప్పుడు శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుందని అంటున్నారు.
శరీరం ఆరోగ్యంగా ఉన్నప్పుడు రోగ నిరోధక శక్తి పెరుగుతుందని, ఫలితంగా సంతోషకరమైన జీవనాన్ని సాగించగలుగుతామని చెబుతున్నారు.కాబట్టి మౌనానికి ఉన్న శక్తిని అర్ధం చేసుకుని, మౌన వ్రతాన్ని పాటించి కనీసం రోజుకు గంట సేపైనా నిశ్శబ్దంగా ఉండి మనం మన శరీరాన్ని, మనసును కంట్రోల్ లో ఉంచుకోవాలని చెప్తున్నారు.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.
-
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
వేసవిలో ఏ సమయంలో రాగి జావ తాగాలి- ఇలా చేస్తే ఫుల్ ఎనర్జీ..!! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications