health tips: ఈ నాలుగు పండ్లను తింటున్నారా? బరువు పెరగటం ఖాయం!!
ప్రతిరోజు మన ఆహారంలో పండ్లను తినాలని చాలామంది న్యూట్రిషనిస్టులు చెబుతూ ఉంటారు. పండ్లలో మన శరీరానికి కావలసిన విటమిన్లు, పోషకాలు పుష్కలంగా ఉంటాయని చెబుతారు. అయితే అసలే ఊబకాయంతో బాధపడేవారు కొన్ని రకాల పండ్లను తినకుండా ఉండడమే మేలని చెబుతున్నారు. ముఖ్యంగా వేసవికాలంలో దొరికే కొన్ని పండ్లను అతిగా తింటే అధిక బరువు పెరిగి, ఆ తర్వాత అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.

ఊబకాయం ఉన్నవాళ్ళు పండ్ల విషయంలో జాగ్రత్త
ఈ రోజుల్లో అధికంగా బరువు పెరగడం అతిపెద్ద అనారోగ్య సమస్య. ఊబకాయం వచ్చిన వారికి ఇతరత్రా దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం తప్పనిసరిగా ఉంటుంది. అందుకే ఊబకాయం ఉన్నవారు ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు వేడివేడి, అప్పుడే వండుకున్న ఆహార పదార్థాలను, పోషకాలు ఉన్న ఆహార పదార్థాలను తినడం అలవాటు చేసుకోవాలి. ఇక పండ్లను తినే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ పండ్లు తినొచ్చు.. ఏ పండ్లు తినకూడదు అన్నది తెలుసుకోవాలి.

ఈ నాలుగు పండ్లతో బరువు పెరిగే ఛాన్స్
ముఖ్యంగా వేసవికాలంలో త్వరగా బరువు పెంచే పండ్లను తినకుండా ఉంటేనే మంచిదని న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు. ఇంతకీ వేసవికాలంలో త్వరగా బరువును పెంచే ఆ నాలుగు పండ్లు ఏమిటి అంటే.. వేసవిలో బరువు అదుపులో ఉండాలి అంటే మామిడి పండ్లను, అరటి పండ్లను, సపోటా పండ్లను, ద్రాక్ష పండ్లను తినడం మానుకోవాలని న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు .

మామిడి తెగ తింటున్నారా ?
మామిడిపండ్లలో క్యాలరీలు, కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మామిడి పండ్లను ఎక్కువగా తింటే త్వరగా బరువు పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే పొరపాటున కూడా సీజనల్ ఫ్రూట్ అంటూ మామిడిపండ్లను ఎక్కువగా తినకూడదు. పరిమిత పరిమాణంలో మామిడి పండ్లను తీసుకుంటే బరువు పెరుగుదలను నియంత్రించవచ్చు.

అరటి పండ్లు ఎక్కువగా తింటే అంతే సంగతి
ఇక బరువు పెరగకూడదు అనుకుంటే అరటి పండ్లను తినడం తగ్గించాలని చెబుతున్నారు. పోషకాలతో కూడిన అరటి పండ్లను ఎక్కువగా తినడం వల్ల బరువు పెరుగుతారు. ప్రతిరోజు ఒక్క అరటి పండు తింటే పెద్ద ఇబ్బంది కాదు. అయితే అధిక బరువు ఉన్నవారికి అరటిపండు తినడం ఏ మాత్రం మంచిది కాదు. అరటిపండు వారికి మంచి ఆహారం కాదని సూచించబడింది.

సపోటా, దాక్ష లతో వేగంగా బరువు పెరుగుదల
ఇక సపోటా లోను మన శరీరానికి కావలసిన మంచి పోషకాలు ఉన్నప్పటికీ సపోటాని ఎక్కువగా తినడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి బరువు పెరగకూడదు అనుకుంటే సపోటాలను సాధ్యమైనంత వరకు తక్కువ తింటే మంచిదని చెప్పబడింది. ఇక ద్రాక్ష పండ్లను ఎక్కువగా తిన్న కూడా విపరీతంగా బరువు పెరుగుతారు. ద్రాక్షాలో ఎక్కువ క్యాలరీలు ఉంటాయి .ఇవి వేగంగా బరువు పెరగడానికి కారణమవుతాయి. అందుకే అధిక బరువు ఉన్నవారు ద్రాక్ష పండ్లను తినకుండా ఉంటే మంచిదని చెప్పబడింది.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications