health tips: అల్పాహారంగా పండ్లు తింటే ఆరోగ్యమా? అనారోగ్యమా? తెలుసుకోండి
చాలామంది అల్పాహారంగా పండ్లు తింటే మంచిది అని భావిస్తూ ఉంటారు. అయితే అల్పాహారంగా పండ్లు తినడం ఆరోగ్యమా? లేక అనారోగ్యమా? అన్నది ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అల్పాహారంగా పండ్లు తీసుకోవడం వల్ల మన శరీరంలో ఏం జరుగుతుంది అన్న విషయానికి వస్తే..
చాలామంది అల్పాహారంగా పండ్లు తింటూ ఉంటారు. బ్రేక్ ఫాస్ట్ గా ఫుల్ గా పండ్లు తినవచ్చని చాలా మంది సలహా ఇస్తుంటారు. పండ్లలో మన శరీరానికి కావలసిన అన్ని ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. పండ్లు తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటామన్నది కూడా తెలిసిన విషయమే. అయితే ఉదయాన్నే ఖాళీ కడుపుతో పండ్లను తినడం ఏ మాత్రం మంచిది కాదని చెబుతున్నారు.

ఆయుర్వేదం ప్రకారం ఉదయం 6 గంటల నుండి 10 గంటల మధ్య కాళీ కడుపుతో పండ్లను తినడం వల్ల జలుబు వంటి రకరకాల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని, జీర్ణ వ్యవస్థ ఉదయంపూట నిదానంగా పని చేస్తుందని చెబుతున్నారు. కాబట్టి ఈజీగా జీర్ణమయ్యే ఆహారాలు తీసుకోవాలి కానీ, ఉదయాన్నే పండ్లను అల్పాహారంగా తీసుకోవడం మంచిది కాదని చెబుతున్నారు.
ఎప్పుడు ఉదయం పూట తీసుకొనే అల్పాహారం వేడిగా మరియు సులభంగా జీర్ణం అయ్యే విధంగా ఉండాలని ఓట్స్, కిచిడి, జావ వంటి సులభంగా జీర్ణమయ్యే ఆహారాలను బ్రేక్ ఫాస్ట్ లో తీసుకోవాలని చెబుతున్నారు. ఉదయాన్నే పండ్లను తీసుకోవడం వల్ల జీర్ణక్రియ నిదానంగా జరుగుతుందని, పళ్లను తిన్న వెంటనే నీటిని తాగడం వల్ల జీర్ణ వ్యవస్థ లోని పీహెచ్ స్థాయిలో అసమతుల్యత ఏర్పడుతుందని చెబుతున్నారు.

ఒకవేళ అల్పాహారంగా ఫ్రూట్స్ తీసుకోవాలనుకుంటే, డ్రై ఫ్రూట్స్ ను తీసుకోవచ్చని చెబుతున్నారు. కానీ పండ్లు తింటే ఆరోగ్యంగా ఉంటామని అనుకుని ఉదయాన్నే కడుపునిండా పండ్లను తినకూడదని సూచిస్తున్నారు. ఇక మనం తినే పండ్ల విషయంలో ఏవి మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి అన్నది కూడా తెలుసుకుని సమయానుకూలంగా తినాలని అంటున్నారు న్యూట్రిషనిస్టులు.
disclaimer: ఈ కథనం ఆహార నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications