Health tips: కాలేయం ఆరోగ్యం కోసం ఈ ఆహారాలు తప్పక తీసుకోండి!!

మన శరీరంలోని అతి ముఖ్యమైన అవయవాల్లో కాలేయం ఒకటి. కాలేయ ఆరోగ్యం కాపాడుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా ప్రతి ఒక్కరిపైన ఉంటుంది. కాలేయం దెబ్బతింటే రికవరీ చేయడం చాలా కష్టం. కాబట్టి కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఆహారంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి.

సరైన ఆహారం తీసుకోవడం వల్ల కాలేయం దీర్ఘకాలం ఆరోగ్యంగా ఉంటుంది. కాలేయం ఆరోగ్యంగా ఉంటే మధుమేహం వంటి ఇతర అనారోగ్యాలను రాకుండా చేస్తుంది. కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే అది మొత్తం శరీరాన్ని పనికిరాకుండా చేస్తుంది. ముఖ్యంగా కాలేయం ఆరోగ్యం కోసం తీసుకోవలసిన ఆహారం విషయానికి వస్తే..

 Health tips:

కాలేయం ఆరోగ్యం కోసం పండ్లు, కూరగాయలను ఎక్కువగా తీసుకోవాలి. పండ్లు, కూరగాయలలో యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి కాలేయం ఆరోగ్యం దెబ్బతినకుండా కాపాడతాయి. కాలేయం ఆరోగ్యం కోసం తృణధాన్యాలను ఎక్కువగా తీసుకుంటే మంచిది. తృణధాన్యాలు రక్తంలోని వ్యర్థ పదార్థాలను ఫిల్టర్ చేస్తాయి. తద్వారా ఇవి కాలేయానికి మేలు చేస్తాయి.

కాలేయం ఆరోగ్యం కోసం చికెన్, చేపలు మరియు బీన్స్ వంటి లీన్ ప్రోటీన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాలేయం సరిగ్గా పని చేయడానికి ఇవి ఎంతగానో పనిచేస్తాయి. ముఖ్యంగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఆహారాలు తీసుకోవటం మంచిది. కాలేయం ఆరోగ్యం కోసం గ్రీన్ టీ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది కాలేయ పనితీరును మెరుగుపర్చడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.

 Health tips

ఇక నాన్-ఆల్కాహాలిక్ ఫ్యాటీలివర్ డిసీజ్ ఉన్న వారిలో కాలేయ పనితీరును మెరుగుపరచడానికి కాఫీ తీసుకుంటే మంచిది.కాలేయం ఆరోగ్యం కోసం ఆలివ్ ఆయిల్ ను ఆహారంలో ఉపయోగిస్తే మంచిది ఆలివ్ ఆయిల్ లో ఆరోగ్యకరమైన కొవ్వు ఉంటుంది. ఇది కాలేయంలో కొవ్వు పేరుకుపోయిన వ్యర్థాలను తొలగిస్తుంది.

కాలేయం ఆరోగ్యం కోసం డ్రైఫ్రూట్స్ తీసుకోవడం మంచిది. డ్రై ఫ్రూట్స్ మరియు నట్స్ కాలేయ పనితీరును బాగా మెరుగుపరుస్తాయి. అంతే కాదు కాలేయ ఆరోగ్యం కోసం పసుపు తీసుకోవటం మంచిది, పసుపును మన ఆహారంలో భాగం చేసుకుంటే కాలేయానికి మేలు కలుగుతుంది.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+